Pushpa 2: Allu Arjun Look Test Done Sukumar Super Happy - Sakshi
Sakshi News home page

Pushpa 2: పుష్ప-2 కోసం డిఫరెంట్‌ లుక్‌లో అల్లు అర్జున్‌

Published Fri, Sep 9 2022 12:58 PM | Last Updated on Fri, Sep 9 2022 3:31 PM

Pushpa 2: Allu Arjun Look Test Done Sukumar Super Happy - Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్‌’ ఎంత హిట్‌ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, ఫాహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో నటించారు. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్‌ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది.

కాగా ‘పుష్ప’ తొలి భాగం బ్లాక్‌ బస్టర్‌ అవడంతో సీక్వెల్‌పై (పుష్ప: ది రూల్‌) భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగంలో పుష్పరాజ్‌గా ఆకట్టుకున్న అల్లు అర్జున్‌ ‘పుష్ప: ది రూల్‌’లో కొంచెం డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం లుక్‌ టెస్ట్‌ చేశారు. అల్లు అర్జున్‌కి బాలీవుడ్‌ ప్రముఖ మేకప్‌ ఆర్టిస్ట్‌ ప్రీతీ షీల్‌ మేకప్‌ చేశారు. ప్రోస్థటిక్‌ మేకప్‌ చేశారని తెలిసింది.

గత రెండు రోజుల్లో ఈ లుక్‌ టెస్ట్‌ జరిగింది. ఈ లుక్‌ పై సుకుమార్‌ సంతోషంగా ఉన్నారని టాక్‌. రెండో భాగంలోనూ రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ నెల 22న ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో ఆరంభమవుతుందని తెలిసింది. ఫస్ట్‌ పార్ట్‌కి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ రెండో భాగానికి కూడా ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement