Actor Manoj Bajpayee Approached For Pushpa 2 movie? Check Details In Telugu - Sakshi
Sakshi News home page

పుష్ప-2 కోసం రంగంలోకి ఫ్యామిలీ మ్యాన్‌ నటుడు!

Published Tue, Jul 19 2022 11:10 AM | Last Updated on Tue, Jul 19 2022 12:17 PM

Actor Manoj Bajpayee Approched For Pushpa 2 Film - Sakshi

అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' సినిమా బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా లెవల్‌లో ఈ సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. దీంతో పుష్ప-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పుష్ప-2లో బాలీవుడ్‌ విలక్షణ నటుడు, ఫ్యామిలీ మ్యాన్‌ ఫేం మనోజ్‌ భాజ్‌పాయి నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది.

ఇప్పటికే సుకుమార్‌ ఆయనకు స్క్రిప్ట్‌ వినిపించగా, వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. ఇక గతంలో అల్లు అర్జున్‌-మనోజ్‌ భాజ్‌పాయి కలిసి హ్యాపీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు ఒకే స్క్రీన్‌పై వీరు కనిపించనున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement