ఐకాన్‌ స్టార్‌ మరో రికార్డ్‌.. పుష్పతో ఫస్ట్‌ ఇండియన్‌ హీరోగా ఘనత | Pushpa Album Reaches 5 Billion Views | Sakshi
Sakshi News home page

Pushpa: సంచలనాలు సృష్టిస్తోన్న పుష్ప ఆల్బమ్‌..

Published Wed, Jul 13 2022 8:58 PM | Last Updated on Wed, Jul 13 2022 9:26 PM

Pushpa Album Reaches 5 Billion Views - Sakshi

పుష్ప సినిమా మరో అరుదైన రికార్డు అందుకుంది. ఇప్పటికే పుష్ప మేనరిజమ్స్ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే పాటలు కూడా అదే స్థాయిలో సంచలనాలు సృష్టించాయి. తాజాగా పుష్ప మ్యూజిక్ ఆల్బమ్ ఏకంగా 5 బిలియన్ వ్యూస్ సాధించింది. అంటే అక్షరాలా 500 కోట్ల వ్యూస్ అన్నమాట. ఇండియన్ సినిమాలో ఈ ఘనత సాధించిన మొదటి హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిచిన పుష్ప ఆల్బమ్ అన్నిచోట్లా అద్భుతాలు చేసింది. దాక్కో దాక్కో మేక, ఏయ్ బిడ్డా, ఊ అంటావా ఉఊ అంటావా పాటలకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ వచ్చింది.

అలాగే సోషల్ మీడియా రీల్స్‌లో శ్రీవల్లి స్టెప్ సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ప్రతీ పాటను ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో 500 కోట్ల వ్యూస్ సాధించింది పుష్ప మ్యూజిక్ ఆల్బమ్. దీనికి ముందు అల వైకుంఠపురములో సినిమా కూడా మ్యూజికల్‌గా సంచలనాలు సృష్టించింది. పుష్ప అదే కంటిన్యూ చేసింది.

పుష్ప తనకు మైల్ స్టోన్ మూవీ అవుతుందని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు అల్లు అర్జున్. అలా ఆయన చెప్పిన ప్రతీ అంచనా నిజమైపోతుందిప్పుడు. ఈ మధ్యే బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి పంపిన మెసేజ్ వైరల్ అయ్యింది. ప్రతీ సీన్ అద్భుతంగా ఉందని.. అలాటి సినిమా అసలు ఎలా తీసారో కూడా అంతుచిక్కడం లేదంటూ సుకుమార్‌ను ఆకాశానికి ఎత్తేసారు రాజ్ కుమార్ హిరాణి. సినిమాకు మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినపుడు కూడా ఫలితంపై నమ్మకంగానే ఉన్నారు బన్నీ. కచ్చితంగా ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే పుష్ప ఏకంగా రూ.350 కోట్లు వసూలు చేసింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా పుష్ప తరహాలో తగ్గేదే లే అన్నారు.. ఇంకా అంటూనే ఉన్నారు. అటు రాజకీయ నాయకులు సైతం పుష్ప మేనరిజమ్స్ వాడుతూనే ఉన్నారు.

చదవండి: ప్రముఖ నటి కుమార్తెపై ట్రోలింగ్‌.. హీరోయిన్‌ స్ట్రాంగ్ రిప్లై
2022లో వచ్చిన టాప్‌ 10 సినిమాల లిస్ట్‌ ఇదిగో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement