Spoof video
-
సోషల్ మీడియా పైత్యం.. ‘బైకాట్ ఖతర్ ఎయిర్వేస్’..
స్వియ నియంత్రణ. స్వియ నియంత్రణ అని చెవులు చిల్లలు పడేలా మొత్తుకుంటున్నా సోషల్ మీడియాలో అది సాధ్యపడేలా కనిపించడం లేదు. వాక్ స్వాతంత్రం పేరుతో కొందరు ట్రోలింగ్ పేరుతో మరికొందరు సున్నితమైన అంశాలపై కూడా ఎడాపెడా కామెంట్లు చేస్తున్నారు. వీడియోలు షేర్ చేస్తున్నారు. స్పూఫ్‌లు వండివారుస్తున్నారు. చిత్రంగా ఇలాంటివన్నీ వైరల్‌గా మారిపోతున్నాయ్.. అసలైన అంశాలు పక్కదారి పడుతున్నాయి. అందుకు తాజా ఉదాహారణ హ్యాష్‌టాగ్ బైకాట్ఖతర్ఎయిర్వేస్ ఉదంతం. కొందరు బీజేపీ నేతలు ఓ మతంపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపుతున్నాయి. విదేశాల్లో నివసిస్తున్న వలస కార్మికుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టాయి. కొన్ని దేశాలు ఇప్పటికే భారత ఉత్పత్తులను బహిష్కరించాలని డిమాండ్ చేస్తుండగా మరికొన్ని దేశాలు క్షమాపణలకు పట్టుబడుతున్నాయి. పార్టీ చేసిన తప్పుకు దేశం తరఫున క్షమాపణలు చెప్పేది ఏంటంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. పార్టీ నేతలు చేసిన బాధ్యతారాహిత్య వాఖ్యల వల్ల కలుగున్న నష్టం పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం కిందామీదా అవుతోంది. ఓవైపు దేశ ప్రతిష్టను కాపాడుతూనే విదేశాల్లో ఉన్న భారతీయుల క్షేమం, వ్యాపారం దెబ్బతినకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. చాలా సున్నితమైన అంశంలోకి సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిగా కామెంట్లు చేస్తున్నారు. వాసుదేవ్ అనే ఓ యువ ట్విటర్ యూజర్.. ఓ వీడియో చేశాడు. అందులో భారత ఉత్పత్తులపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ... ఖతార్ ఎయిర్‌వేస్‌ని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చాడు. అతని వాలకం చూస్తే అతనెప్పుడు విమాన్ ఎక్కినట్టుగా అనిపిండచం లేదు. సాధ్యాసాధ్యాలను మరిచిపోయి ఆవేశంలో హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఉంది. పైగా బాయ్‌కాట్ అనే పదాన్ని కూడా ఇంగ్లీష్‌లో తప్పుగా రాశాడు. వాసుదేవ్ వీడియోను ట్రోల్ చేస్తూ స్పూఫ్ వీడియోను నెట్టింట్లోకి వదిలారు మరికొందరు. అల్‌జజీరా ఛానల్‌కి ఖతార్ ఎయిర్వేస్ సీఈవో అక్బర్ అల్ బకర్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూని దీని కోసం వాడుకున్నారు. ఈ స్పూఫ్ వీడియోలో వాసుదేవ్ ఇచ్చిన వార్నింగ్‌కి ఖతర్ సీఈవో భయపడిపోయి గజగజ వణికిపోతున్నాడనే రేంజ్లో స్పూఫ్ వీడియోను రూపొందించారు. ఇప్పుడీ వీడియో ట్రెండింగ్‌గా మారింది. అసలు విషయాన్ని పక్కన పెట్టి వాసుదేవ్ వార్నింగ్, దానికి కౌంటర్‌గా వచ్చిన స్పూఫ్ వీడియోపై ఫోకస్ చేస్తున్నారు. The CEO of Qatar airways now gives an interview to Aljazeera on the call for #BycottQatarAirwaysQatar by Vashudev Watch till the end! https://t.co/ezBC8wYcv6 pic.twitter.com/8dkRZsCPHp — Ahad (@AhadunAhad11111) June 7, 2022 సున్నితమైన అంశాలపై ఎలా ముందుకు పోవాలో తెలియక ప్రభుత్వాలే తలలు పట్టుకుంటున్నాయ్. అంతర్జాతీయంగా భారత్ వాణిజ్య ప్రయోజనాలు, వలస కార్మికుల భద్రతతో ముడిపడిన అంశాలపై ఇష్టారీతిగా సోషల్ మీడియాలో పోస్టులు రావడాన్ని చాలా మంది తప్పుపడుతుండగా మరికొందరు ఏ అంశంపైన అయినా చర్చ జరగాల్సిందే అంటున్నారు. Those who are trending Boycott Qatar Airways, do they know that the per capita GDP of Qatar is more than 25 times India's per capita GDP? Indian labor force working in Qatar sends $5Billion home every year, more than double the price of Air India. — Ashok Swain (@ashoswai) June 7, 2022 చదవండి: Virtual Influencer Kyra Story: వావ్ కైరా! ఎందుకమ్మా.. నీకు ఇంతమంది ఫ్యాన్స్? -
మతిమరుపు బైడెన్‌పై స్పూఫ్ వీడియో.. నెట్టింట వైరల్
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో దీనిపై స్పందిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన వింతగా ఉంటోంది. వయస్సులో పెద్దవాడు కావడం వల్ల జరుగుతోందో.. ఏమో కానీ ఆయన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేరు సైతం మర్చిపోవడం, తనతోపాటు పక్కనే ఉన్న ఆమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. అప్పుడే నిద్ర నుంచి లేచి మీడియా ముందుకు వచ్చినట్లు కనిపించడం పట్ల పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు సంబంధించిన ఓ స్పూఫ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుతం సమయంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులపై అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు మీడియాతో మాట్లాడుతూ గందరగోళానికి గురైనట్లు చాలా వ్యంగ్యంగా ఓ ఫన్నీ స్కిట్‌ను సౌదీలోని ప్రభుత్వానికి అనుకూల టీవీ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. ఈ వీడియోలో రెండు పాత్రలు.. జో బైడెన్, కమలా హారిస్‌లు వేదికపై నడుస్తూ వచ్చినట్లు వ్యంగ్యంగా చూపుతారు. వారిద్దరూ మీడియతో మాట్లాడుతూ కనిపిస్తారు. ముందుగా.. బైడెన్ పాత్ర మాట్లాడుతూ.. ఈ రోజు మనం స్పెయిన్ సంక్షోభం గురించి మాట్లాడబోతున్నామని వ్యాఖ్యానిస్తాడు. పక్కనే ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పాత్రదారి కాదు.. కాదు.. అన్నట్లు చెవిలో చెబుతుంది. అయినా కూడా వినని బైడెన్ పాత్రదారి.. ఆఫ్రికాలో సంక్షోభం అంటూ మొదలుపెడతాడు. అది కూడా తప్పు కావడంతో చివరకు రష్యా అని అంటాడు. అక్కడితో ఆగకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరును మర్చిపోయి గుర్తు చేసుకోవడానికి సహాయం తీసుకుంటాడు. ‘పుతిన్, నా మాట వినండి. మీ కోసం నా దగ్గర చాలా ముఖ్యమైన సందేశం ఉంది. ఆ సందేశం ఏమిటంటే..’ అని నిల్చొన్న చోటే ఓ కునుకు తీస్తాడు. వెంటనే నిద్ర లేవగానే పుతిన్ గురించి పూర్తిగా మర్చిపోయి ‘చైనా ప్రెసిడెంట్' తో మాట్లాడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టాడు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను పట్టుకొని.. తాను మాట్లాడున్న సమయంలో తనను సరిదిద్దినందుకు ధన్యవాదాలు, ఆమెరికా ప్రథమ మహిళా’ అని నవ్వుతూ మాట్లాడుతాడు. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం గురించి స్పందించాలన్న అమెరికా అభ్యర్థనను సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇక అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవి స్వీకరించిన తర్వాత సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఒక్కసారిగా కూడా మాట్లాడిన దాఖలు లేకపోవడం గమనార్హం. తాజాగా ప్రసారమైన ఈ ఫన్నీ స్కిట్‌తో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నావో తెలుసుకోవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. VIDEO: A prominent Saudi television network has racked up millions of views with a comedy sketch that openly mocks US President Joe Biden, an unusual move that further signals souring ties pic.twitter.com/GRrNXx7Bjo — AFP News Agency (@AFP) April 14, 2022 -
'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ స్పూఫ్.. అదరగొట్టేశారుగా..!
RRR Movie Trailer Spoof Video By Odisha State People: సినిమా అంటే ఒకరకమైన పిచ్చి. అదో మైకం. సినిమాపై తమకున్న అభిమానాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా చూపిస్తారు. రోజుకు ఒక్క సినిమా అయిన చూడకుండా ఉండలేరు కొందరు. సినిమాల్లోని డైలాగ్‌లను నిజ జీవితంలో వాడుతూ కనిపిస్తారు మరికొందరు. ఇక సోషల్ మీడియాల్లో రీల్స్, స్పూఫ్స్ చూస్తూనే ఉంటాం. ఇటీవల కాలంలో అయితే సినిమా పాటలు, యాక్షన్ సీన్స్, డ్యాన్స్‌లను స్పూఫ్ చేయడం, రీక్రియేట్ చేయడం, అవి తెగ వైరల్ కావడం కూడా జరిగింది. ఈ తరహాలోనే ఒడిశాకు చెందిన కొందరు యువకులు సినిమాపై తమకున్న అభిమానాన్ని 'ఆర్ఆర్ఆర్' మూవీ ట్రైలర్ స్పూఫ్ ద్వారా తెలియజేశారు. అది చూసిన సగటు జనం వావ్ అనకుండా, నవ్వకుండా ఉండలేరు. టాలీవుడ్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానోఎదురుచూస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. దర్శక ధీరుడు రాజమౌళి టేకింగ్ , మరో వైపు టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమాలో యాక్షన్ సీన్స్, లొకేషన్లు, నటీనటుల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ఈ ట్రైలర్ స్పూఫ్‌ను తమదైన శైలిలో చిత్రీకరించి ఆకట్టుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా 'ఆర్ఆర్ఆర్' చిత్ర యూనిట్ వారిని ప్రశంసించింది. ఈ వీడియోకు తామెంటో కష్టపడ్డారో వీడియో చివర్లో చూపించారు. ఆర్ఆర్ఆర్తో పాటు వారు ఇదివరకు పుష్ప, అంతిమ్, 3 ఇడియట్స్, స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ట్రైలర్లను కూడా రీక్రియేట్ చేసి వావ్ అనిపించారు. ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్'కు అమెజాన్ భారీ ఆఫర్.. కానీ -
డేవిడ్ వార్నర్.. యవ్వ తగ్గేదే లే : అల్లు అర్జున్
Australian Cricketer David Warner Recreates Scene Of Pushpa, Video Viral: ఆస్టేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటికే బుట్టబొమ్మ సాంగ్‌తో యావత్ తెలుగు ప్రజలకు ఎంతో దగ్గరైన వార్నర్ తాజాగా మరోసారి పుష్పరాజ్ అవతారం ఎత్తాడు. ఇప్పటికే ఈ సినిమాలోన 'యే బిడ్డా.. ఇది నా అడ్డా' అనే పాటను ఇమిటేట్ చేసిన వార్నర్ ఇప్పుడు మరోసారి అల్లుఅర్జున్ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. పుష్పలోని ఫేమస్ డైలాగ్ 'పుష్ప..పుష్పరాజ్నీ యవ్వ తగ్గేదె లే' అంటూ తనదైన స్టైల్లో డైలాగ్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక డేవిడ్ వార్నర్‌కు ఇండియన్ సిటిజన్ అవసరం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా..దీనికి నేను ఏం చేయాలి అంటూ డేవిడ్ రిప్లై ఇవ్వడం విశేషం. ప్రస్తుతం డేవిడ్ చేసిన ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. దీనిపై అల్లు అర్జున్ సైతం స్పందిస్తూ.. 'వార్నర్.. డేవిడ్ వార్నర్ నీ యవ్వ తగ్గేదే లే' అంటూ ప్రశంసలు కురిపించాడు. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
‘యే బిడ్డా.. ఇది నా అడ్డా..’ అంటున్న డేవిడ్ భాయ్, కౌంటరిచ్చిన కోహ్లి
David Warner Imitates Allu Arjun: ఫేస్ యాప్ ద్వారా ప్రముఖ తెలుగు హీరోల వీడియోలను మార్ఫింగ్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా..’ అనే పాపులర్ పాటకు స్పూఫ్ చేశాడు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ 'క్యాప్షన్ దిస్' అంటూ కామెంట్ పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తూ.. తెలుగు క్రికెట్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) ఈ పోస్ట్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. 'ఆర్ యూ ఓకే' అంటూ కామెంట్ పెట్టాడు. ఇందుకు వార్నర్ 'గొంతు పట్టేసినట్టుంది..’ అంటూ సరదాగా బదులిచ్చాడు. కాగా, డేవిడ్ భాయ్ గతంలో కూడా అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేసి నెట్టింట నవ్వులు పూయించాడు. బన్నీ నటించిన 'అల వైకుంఠపురంలో' సినిమాలోని బుట్టబొమ్మ పాటకు వార్నర్ కుటుంబంతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇదిలా ఉంటే, యాజమాన్యంతో విభేదాల కారణంగా డేవిడ్ భాయ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవలే ముగిసిన రిటెన్షన్ పాలసీలో కూడా ఎస్ఆర్హెచ్ వార్నర్ పేరు చేర్చలేదు. దీంతో త్వరలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలంలో అతడు పాల్గొనే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వార్నర్ యాషెస్ సిరీస్‌లో ఆడుతున్నాడు. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగులు చేసిన వార్నర్.. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: Ashes 1st Test: ఆసీస్ బౌలర్ ఖాతాలో పలు అరుదైన రికార్డులు -
వైరల్ వీడియో: మరో కమల్ హాసన్.. నటనకు నెటిజన్లు ఫిదా!
Reporting Spoof Video: కరోనా మనిషికి ఎన్నో విషయాలను నేర్పించింది. ఇంటి పట్టునే కూర్చో పెట్టింది. వాస్తవానికి పాఠశాలలు మూతబడ్డాయి. పిల్లలు తమ తరగతులను ఆన్లైన్లో వింటున్నారు. కానీ చాలా మంది పిల్లలు తమ ఇళ్లలో ఖైదు అయిపోయారు. వారి జీవితాలు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్లకు పరిమితం అయిపోయాయి. స్నేహితులను కలవలేరు.. ఆట స్థలాలకు వెళ్లలేని పరిస్థితి. ఇదంతా ఒక పార్శ్వం. దీనికి మరో పార్శ్వం తమ సమయాన్ని సద్వినియోగం చేకుకోవడం. చెన్నై: కోయంబత్తూరుకు చెందిన అసేవెన్ అనే బాలుడు న్యూస్ రిపోర్టేజ్ గురించి చేసిన స్పూఫ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుంతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారం రోజుల్లోనే 5.79 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. వివరాల్లోకి వెళితే.. రీతూ చిన్నప్పటి నుంచే దేన్నైనా చూసి ఇట్టే చేసేవాడు. దాన్ని చూసి తండ్రికి ఆశ్యర్యపోయాడు. అయితే లాక్డౌన్ సమయంలో రీతూ న్యూస్ క్లిప్‌లను ఎక్కువగా చూసేవాడు. దీంతో కొడుకు వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడానికి ఇది వరకే ప్రారంభించిన ఛానల్లో ఈ స్పూఫ్ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో రీతూ యాంకర్‌గా, ఫీల్డ్ రిపోర్టర్‌గా, రైతుగా, సామాన్య వ్యక్తిగా నటించి నెటిజనుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘రీతూ నీ నటన సూపర్ ఉంది. ఇంతలోనే అన్ని అవతారాలా!’’ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. మరో నెటిజన్ ‘‘ చోటా కమల్ హాసన్ నటన అదిరిపోయింది. బొమ్మ పడితే బ్లాక్ బస్టర్.’’ అంటూ కామెంట్ చేశాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
అవెంజర్స్ : థానోస్‌గా స్వామి నిత్యానంద..!
మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హీరో సీరిస్‌లో చివరి సినిమా అవడంతో అవెంజర్స్ ; ఎండ్‌గేమ్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. హాలీవుడ్‌తో పాటు చైనా, భారత్‌లాంటి ఆసియా దేశాల్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇక సూపర్ హీరోస్ అందరూ కలిసి విలన్ థానోస్‌ను ఎలా అంతమొందించారనేదే అవెంజర్స్ ; ఎండ్‌గేమ్ కథ. అయితే, ఇండియాలో మాత్రం మరో థానోస్ పుట్టుకొచ్చాడు. ఓ కథానాయికతో శంగారకేళీలు సాగిస్తూ దొరికిపోయిన స్వామి నిత్యానందే థానోస్. తనను తాను దేవుని బిడ్డను అని చెప్పుకునే నిత్యానందను విలన్‌గా చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. (చదవండి : బాహుబలిని దాటలేకపోయిన ‘అవెంజర్స్’) అవెంజర్స్ ; ఇన్ఫినిటీ వార్ సినిమాలో కథానాయకుడు డాక్టర్ స్ట్రేంజ్, విలన్ థానోస్ మధ్య జరిగే ఫైట్ సీన్‌కు స్పూఫ్గా వచ్చిన ఈ వీడియోలో నిత్యానందను అతీతమైన శక్తులుగల వాడిగా చూపించారు. ఇక థానోస్ ఆటలు కట్టించేందుకు లక్షలాది మార్గల్లో యత్నించే డాక్టర్ స్ట్రేంజ్‌ను నిత్యానంద అలవోకగా ఓడిస్తాడు. మంత్ర శక్తితో మట్టికరిపిస్తాడు. కొంతకాలం క్రితం తనకు మూడో కన్ను ఉందని, దైవ రహస్యాలు తెలుసునని నిత్యానంద చెప్పిన విషయం తెలిసిందే. పశువులకు తమిళ, సంస్కృత భాషలు కూడా నేర్పిస్తానని చెప్పుకొచ్చాడు. ‘అవెజంర్స్ రీలోడెడ్ ; 2020 సినిమా ట్రైలర్‌ను అప్పుడే విడుదల చేశారా’ అంటూ ఒకరు, అసలైన ఎండ్‌గేమ్ ఇదేనంటూ మరొకరు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. The asli Avengers Endgame. pic.twitter.com/h1ZrjdYWTa — Kaveri (@ikaveri) 29 April 2019 -
ప్రియా ప్రకాష్ స్పూఫ్ చేసిన బన్నీ
-
ప్రియా ప్రకాష్లా బన్నీ..!
సినిమాలు, షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తూ ఉంటాడు యంగ్ హీరో అల్లు అర్జున్. ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో ఉండేందుకే ఇష్టపడే బన్నీ తన చిన్నారులతో కలిసి అల్లరి చేస్తుంటాడు. బన్నీ పిల్లలతో చేసే అల్లరి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేస్తుంటుంది అల్లు అర్జున్ భార్య స్నేహ. తాజాగా స్నేహ పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం ఒరు ఆదార్ లవ్ లోని ఓ సన్నివేశం నాకు బాగా నచ్చిందంటూ బన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సన్నివేశానికి స్పూఫ్ చేశాడు స్టైలిష్ స్టార్. హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ చేసినట్టుగానే చేతితో తన కొడుకును షూట్ చేయటం, బన్నీ కొడుకు అయాన్ అమాంతం బెడ్ మీద పడిపోవటాన్ని వీడియో తీసిన స్నేహ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. -
ఆమె కన్నుగీటితే.. అంతా ఇలా విలవిలలాడాల్సిందే!
ఎవరినీ విడిచిపెట్టలేదు. ఆమె కన్నుగీటితే.. ఎవరూ మాత్రం సిగ్గుపడకుండా ఉంటారు. ఎవరు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వకుండా ఉంటారు. ఎవరు మాత్రం ఆమె కనుసైగల సెగలు తగలకుండా రాతిబొమ్మలుగా ఉండిపోగలరు. అందుకే మన నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు రాహుల్ గాంధీ వరకు.. అటు సినీ రంగంలో రజనీ మొదలు రానా వరకు అందరినీ ప్రియాప్రకాశ్ వారియర్ కనుసైగల వాలుచూపుల పరిధిలోకి తీసుకొచ్చారు. ఆమె కన్నుగీటితే.. వారు ఎలా స్పందిస్తారో చూపిస్తూ.. స్పూఫ్ వీడియోలు వదిలారు. ఇప్పుడు ఈ వీడియోలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రియా కన్నుగీటితే.. బ్రహ్మచారి రాహుల్‌గాంధీ ముసిముసి నవ్వులు రువ్వుతూ.. లోలోపల సిగ్గుపడుతున్నట్టు ఉన్న స్పూఫ్ నెటిజన్లను తెగ అలరిస్తోంది. ‘ఒరు ఆదార్ లవ్’ అనే మలయాళ సినిమాతో అరంగేట్రం చేస్తున్న ప్రియా ప్రకాశ్.. 40 సెకన్ల నిడివి ఉన్న కనుసైగల వీడియోతో ఓవర్‌నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. గన్నులాంటి కన్నులతో ఆమె కన్నుగీటినా.. తాజా టీజర్లో తూటాలాంటి ఫ్లయింగ్ కిస్‌తో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా.. యువత అమాంతం ఫిదా అయిపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఇప్పటికే మిలియన్‌కుపైగా ఫాలోవర్లు యాడ్ అయ్యారు. పలువురిపై వచ్చిన స్ఫూప్ వీడియోలు ఇవే.. Kya yahi pyaar hai? pic.twitter.com/FL5r13eekI — East India Comedy (@EastIndiaComedy) February 11, 2018 .@realDonaldTrump babu Ye aap kis line me aa gaye bhai? 😂 pic.twitter.com/mlj2TFUQPi — Err.. (@Gujju_Er) February 11, 2018 who tf did this 😭😂 pic.twitter.com/87SlMPWhre — ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤㅤ ㅤ ㅤ ㅤ (@firkiii) February 11, 2018 Mahi ❤❤❤❤ #PriyaPrakashVarrier pic.twitter.com/KTrnCkkQ47 — Shash (@pokershash) February 11, 2018 -
ఆమె కన్నుగీటితే.. అంతా ఇలా విలవిలలాడిల్సిందే!
-
జయప్రద, జితేంద్ర స్ఫూప్ వీడియో అదుర్స్!
గత జనవరిలో ఎడ్ షీరాన్ ’షేప్ ఆఫ్ యూ’ విడుదలైన నాటి నుంచి ఆ వీడియో సాంగ్‌పై అనేక బాలీవుడ్ స్ఫూప్ వీడియోలు ఆన్లైన్లో హల్చల్ చేశాయి. షీరాన్ పాటపై సల్మాన్ ఖాన్ మొదలు గోవింద వరకు నటులు చేసిన డ్యాన్స్‌తో మిక్స్ చేసిన స్ఫూప్ వీడియోలు నెటిజన్లను అలరించగా.. తాజాగా పాప్ సింగర్ సియా ‘చీప్ థ్రిల్స్’ పాటపై స్ఫూప్ వీడియోలు దుమ్మురేపుతున్నాయి. 2016లో చార్ట్ బస్టర్‌గా నిలిచిన ’చీప్ థ్రిల్స్’ పాటను తాజాగా అలనాటి నటులు జితేంద్ర, జయప్రద తీసిన ఓ పాటతో స్ఫూప్ చేయడం నెటిజన్లను నవ్వులో ముంచెత్తుతోంది. ‘మవాలీ’ సినిమాలో ’ఉయ్ అమ్మ ఉయ్ అమ్మ’ పాటను సియా ’చిప్ థ్రిల్స్’ సాంగ్‌తో స్ఫూప్ చేసి ఫేస్బుక్లో విట్టీఫీడ్ అనే పేజీ పోస్టు చేసింది. ఈ పోస్టు నెటిజన్లను ఆకట్టుకోవడమే కాదు వారికి కితకితలు పెడుతోంది. మీరూ ఓ లుక్ వేయండి..