జయప్రద, జితేంద్ర స్ఫూప్‌ వీడియో అదుర్స్‌! | Spoof video of Jeetendra dancing to Sia Cheap Thrills | Sakshi
Sakshi News home page

జయప్రద, జితేంద్ర స్ఫూప్‌ వీడియో అదుర్స్‌!

Published Mon, Apr 10 2017 1:20 PM | Last Updated on Sun, Sep 2 2018 3:57 PM

జయప్రద, జితేంద్ర స్ఫూప్‌ వీడియో అదుర్స్‌! - Sakshi

జయప్రద, జితేంద్ర స్ఫూప్‌ వీడియో అదుర్స్‌!

గత జనవరిలో ఎడ్‌ షీరాన్‌ ’షేప్‌ ఆఫ్‌ యూ’ విడుదలైన నాటి నుంచి ఆ వీడియో సాంగ్‌పై అనేక బాలీవుడ్‌ స్ఫూప్‌ వీడియోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేశాయి. షీరాన్‌ పాటపై సల్మాన్‌ ఖాన్‌ మొదలు గోవింద వరకు నటులు చేసిన డ్యాన్స్‌తో మిక్స్‌ చేసిన స్ఫూప్‌ వీడియోలు నెటిజన్లను అలరించగా.. తాజాగా పాప్‌ సింగర్‌ సియా ‘చీప్‌ థ్రిల్స్‌’ పాటపై స్ఫూప్‌ వీడియోలు దుమ్మురేపుతున్నాయి.

2016లో చార్ట్‌ బస్టర్‌గా నిలిచిన ’చీప్‌ థ్రిల్స్‌’ పాటను తాజాగా అలనాటి నటులు జితేంద్ర, జయప్రద తీసిన ఓ పాటతో స్ఫూప్‌ చేయడం నెటిజన్లను నవ్వులో ముంచెత్తుతోంది. ‘మవాలీ’ సినిమాలో ’ఉయ్‌ అమ్మ ఉయ్‌ అమ్మ’ పాటను సియా ’చిప్‌ థ్రిల్స్‌’ సాంగ్‌తో స్ఫూప్‌ చేసి ఫేస్‌బుక్‌లో విట్టీఫీడ్‌ అనే పేజీ పోస్టు చేసింది. ఈ పోస్టు నెటిజన్లను ఆకట్టుకోవడమే కాదు వారికి కితకితలు పెడుతోంది. మీరూ ఓ లుక్‌ వేయండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement