Jeetendra
-
కొత్త కోణం చూస్తారు
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ జితేంద్ర త్వరలోనే ఓ వెబ్ సీరిస్ ద్వారా తన అభిమానులను పలకరించనున్నారు. ప్రముఖ టీవీ సీరియల్స్ నిర్మాత, జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా వెబ్ సిరీస్ ‘బారిష్ 2’. ఈ వెబ్ సిరీస్‌లో జితేంద్ర ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. జీతూజీ గాంధీ అనే వజ్రాల వ్యాపారి పాత్రలో కనిపించబోతున్నారట. ‘‘మళ్లీ యాక్ట్ చేయడం భలే సరదాగా ఉంది. (2013లో వచ్చిన ‘మహాభారత్ ఔర్ బార్బరీక్’ సినిమాలో చివరిగా అతిథి పాత్రలో మెరిశారాయన. ‘బారిష్’ లాంటి సిరీస్‌తో వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. నా అభిమానులు, ప్రేక్షకులు ఈ పాత్రల్లో నాలోని విభిన్న కోణాలను చూసి ఆస్వాదిస్తారనుకుంటున్నాను’’ అన్నారు జితేంద్ర. -
తాగొచ్చి హేమ మాలిని పెళ్లి ఆపాడు
అలనాటి సూపర్ స్టార్ జితేంద్ర నేడు 78వ వడిలోకి అడుగుపెట్టాడు. అతను తన ప్రేయసి శోభా కపూర్‌ను 1974లో అక్టోబర్18న వివాహం చేసుకున్నాడు. అయితే దీనికన్నా ముందు అలనాటి అందాల తార హేమమాలినిని పెళ్లి చేసుకోబోయాడు. ఈ విషయాన్ని ఆమె జీవిత కథ ఆధారంగా వచ్చిన "హేమ మాలిని: బియాండ్ ద డ్రీమ్‌గర్ల్" పుస్తకం వెల్లడించింది. ఈ పుస్తకం ప్రకారం ఆమె తల్లిదండ్రులకు హేమ, వివాహితుడైన ధర్మేంద్రతో ఉండటం అస్సలు నచ్చేది కాదు. దీంతో ఆమెకు జితేంద్రతో వివాహం జరిపించాలనుకున్నారు. వెంటనే అతని కుటుంబసభ్యులతో మాట్లాడటం, ఇంట్లో వాళ్ల సంతోషం కోసం జితేంద్ర కూడా పెళ్లికి అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ముహూర్తం కూడా ఖరారు చేసుకుని, చెన్నైలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఓ వార్తాపత్రిక ఈ విషయాన్ని చాటింపు చేసి చెప్పింది. దీంతో విషయం తెలుసుకున్న ధర్మేంద్ర్ర, జితేంద్ర ప్రేయసి శోభా(ప్రస్తుతం అతని భార్య)తో కలిసి పెళ్లిని ఆపేందుకు చెన్నైకు పయనమయ్యారు. (ఎంతో నేర్చుకున్నా) మద్యం సేవించిన ధర్మేంద్ర.. హేమ ఇంటికి చేరుకుని ఆమెను ఇంత పెద్ద తప్పు చేయవద్దని కోరుకున్నాడు. మరోవైపు శోభా కూడా జితేంద్రను కలిసి ఆగ్రహం వ్యక్తం చేయగా అతను మాత్రం హేమను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించాడని పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ధర్మేంద్ర మాటలతో కదిలిపోయిన హేమ పెళ్లికి మరింత గడువు కావాలని తన పేరెంట్స్‌ను అభ్యర్థించింది. అలా ఆ పెళ్లి వాయిదా పడింది. కాగా షోలే, సీతా ఔర్ గీతా, దిలాగీ, డ్రీమ్‌గర్ల్ వంటి చిత్రాల్లో హేమతో కలిసి నటించిన ధర్మేంద్ర ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. అనంతరం 1979లో ఆగస్టు 21న హేమను రెండో భార్యగా చేసుకున్నాడు. అయినప్పటికీ వాళ్లిద్దరి సంసార విషయంలో ఎప్పడూ గొడవలు బయటకు రాలేదు. ఇక వీరికి కూతుళ్లు ఈషా, అహాన్ డియోల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈషా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం గృహిణిగా ఉండగా.. అహానా క్లాసికల్ డ్యాన్సర్‌గా పలు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇక ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్ సంతానం సన్నీ డియోల్, బాబీ డియోల్ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. -
లైంగిక వేధింపుల కేసులో జితేంద్రపై ఎఫ్ఐఆర్
సాక్షి, ముంబయి : బాలీవుడ్ సీనియర్ నటుడు జితేంద్రపై లైంగిక వేధింపుల కేసులో సిమ్లా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జితేంద్ర కజిన్ ఇచ్చిన ఫిర్యాదుపై చోటా సిమ్లా పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 354 కింద ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సిమ్లా ఎస్పీ ఉమాపతి జమ్వాల్ తెలిపారు. 47 ఏళ్ల కిందట జితేంద్ర తనను ఓ సినిమా షూటింగ్‌కు తీసుకువెళ్లి తాను బసచేసిన హోటల్ రూమ్‌లో లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. ఈ మేరకు బాధితురాలి స్టేట్మెంట్ను మెజిస్ర్టేట్ ఎదుట నమోదు చేశారు. అప్పట్లో జితేంద్ర వయసు 28 ఏళ్లు కాగా, తన వయసు 18 సంవత్సరాలని ఆమె చెప్పారు. నేరం జరిగినప్పుడు అమల్లో ఉన్న చట్ట నిబంధనలకు అనుగుణంగా కేసును విచారిస్తామని ఎస్పీ వివరించారు. అయితే ఏ హోటల్లో వారు బస చేసిందీ..దానికి సంబంధించిన ఆధారాలను ఆమె చూపలేకపోతున్నారని చెప్పారు. మరోవైపు ఈ ఆరోపణలను జితేంద్ర న్యాయవాది రిజ్వాన్ సిద్ధికీ తోసిపుచ్చారు. జితేంద్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకే అవాస్తవ ఆరోపణలను చేస్తున్నారని ఆయన తిప్పికొట్టారు. జితేంద్ర లైంగికంగా తనను వేధించారని, ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని బాధితురాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ డీజీపీ ఎస్ఆర్ మర్ధికి పంపిన ఈ - మెయిల్లో కోరారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఓ సినిమా షూటింగ్ సందర్భంగా న్యూఢిల్లీ నుంచి ఆమెను సిమ్లాకు తీసుకువెళ్లారు. ఓ రోజు రాత్రి తాము బసచేసిన హోటల్ గదిలోకి మద్యం సేవించి వచ్చిన జితేంద్ర లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. -
షూటింగ్ అని పిలిచి.. లైంగిక దాడి చేశాడు!
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత జితేంద్ర (రవి కపూర్) తనను లైంగికంగా వేధించాడంటూ ఆయన మేనకోడలు ఆరోపించారు. లైంగిక వేధింపుల ఘటనను వివరిస్తూ హిమాచల్ ప్రదేశ్ డీజీపీ కార్యాలయానికి బాధితురాలు ఫిర్యాదు లేఖ రాశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా ఆమె కోరినట్లు సమాచారం. లైంగిక వేధింపులకు గురైన వారు ధైర్యంగా బయటకు వచ్చి జరిగిన అన్యాయంపై పోరాడటం, బాధితులకు అండగా నిలిచేందుకు చేపట్టిన మీటూ ఉద్యమం (#MeToo campaign) వల్లే తాను 47 ఏళ్ల కిందట ఎదుర్కొన్న లైంగిక దాడిపై ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెబుతున్నారు. హోటల్ గదికి తాగొచ్చాడు.. '1971లో జితేంద్ర సిమ్లా లోకేషన్లలో షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అప్పుడు ఆయనకు 28 ఏళ్లు కాగా, నాకు 18 ఏళ్లు. అన్ని సిద్ధం చేశానని, షూటింగ్ చూసేందుకు రావాలని జితేంద్ర కోరగా.. నేను ఢిల్లీ నుంచి సిమ్లాకు వెళ్లాను. హోటల్ రూములో నా కోసం రూమ్ బుక్ చేశాడు. షూటింగ్లో పాల్గొన్న ఆయన రాత్రి హోటల్లో నా గదికి వచ్చారు. చాలా అలసిపోయాననని, ఇక్కడే విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. మధ్యరాత్రి లేచి చూసేసరికి జితేంద్ర తన బెడ్‌ను నా బెడ్‌తో కలిపి ఉంచారు. కళ్లు తెరిచి చూసేసరికి నన్ను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. మద్యం మత్తులో నాపై లైంగిక దాడి చేసిన తర్వాత జితేంద్ర హోటల్ నుంచి వెళ్లిపోయారు. ఆ రాత్రికి భయంభయంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని రెండు పేజీల ఫిర్యాదు లేఖలో ఆమె పేర్కొన్నారు. పరువు పోతుంది.. వద్దన్నారు..! నాకు అన్యాయం జరిగిన సమయంలో జితేంద్రకు బాగా పలుకుబడి ఉంది. నా తల్లిదండ్రులకు చెబితే.. వారు పరువు పోతుందంటూ ఫిర్యాదు చేయవద్దన్నారు. కానీ ప్రస్తుతం సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా, మీటూ ఉద్యమం, మహిళా సంఘాల పోరాటాలు, హాలీవుడ్లో ఇటీవల చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఫిర్యాదులతో నాకు అవగాహనా వచ్చింది. పోరాడేందుకు నిర్ణయించుకున్నాకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెబుతున్నారు. -
జయప్రద, జితేంద్ర స్ఫూప్ వీడియో అదుర్స్!
గత జనవరిలో ఎడ్ షీరాన్ ’షేప్ ఆఫ్ యూ’ విడుదలైన నాటి నుంచి ఆ వీడియో సాంగ్‌పై అనేక బాలీవుడ్ స్ఫూప్ వీడియోలు ఆన్లైన్లో హల్చల్ చేశాయి. షీరాన్ పాటపై సల్మాన్ ఖాన్ మొదలు గోవింద వరకు నటులు చేసిన డ్యాన్స్‌తో మిక్స్ చేసిన స్ఫూప్ వీడియోలు నెటిజన్లను అలరించగా.. తాజాగా పాప్ సింగర్ సియా ‘చీప్ థ్రిల్స్’ పాటపై స్ఫూప్ వీడియోలు దుమ్మురేపుతున్నాయి. 2016లో చార్ట్ బస్టర్‌గా నిలిచిన ’చీప్ థ్రిల్స్’ పాటను తాజాగా అలనాటి నటులు జితేంద్ర, జయప్రద తీసిన ఓ పాటతో స్ఫూప్ చేయడం నెటిజన్లను నవ్వులో ముంచెత్తుతోంది. ‘మవాలీ’ సినిమాలో ’ఉయ్ అమ్మ ఉయ్ అమ్మ’ పాటను సియా ’చిప్ థ్రిల్స్’ సాంగ్‌తో స్ఫూప్ చేసి ఫేస్బుక్లో విట్టీఫీడ్ అనే పేజీ పోస్టు చేసింది. ఈ పోస్టు నెటిజన్లను ఆకట్టుకోవడమే కాదు వారికి కితకితలు పెడుతోంది. మీరూ ఓ లుక్ వేయండి.. -
'టెలిగ్రాఫ్ లో ప్రేమ సందేశాలు పంపేవాడిని'
ముంబై: టెలిగ్రాఫ్ ద్వారా తన భార్య శోభకు ప్రేమ సందేశాలు పంపేవాడినని బాలీవుడ్ సీనియర్ నటుడు జితేంద్ర వెల్లడించారు. తన అనుభూతులను టెలిగ్రాఫ్ ద్వారా వ్యక్తపరిచేవాడినని చెప్పారు. గురువారం ఆయన వియాన్ మొబైల్ ఫోన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...'మొబైల్ ఫోన్లను యువత ఎలా హేండిల్ చేస్తుందో తెలియదు. నేను హీరో వెలుగొందుతున్న సమయంలో మొబైల్ ఫోన్లు లేకపోవడంతో సరదాగా గడిపేందుకు ఎక్కువ సమయం ఉండేది. ఇప్పట్లా ఫోన్లు లేకపోవడంతో టెలిగ్రాఫ్ లో నా భార్య శోభకు ప్రేమ సందేశాలు పంపుతుండేవాడిని. ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నాను. అయితే శోభ చదవగలిగే వాటిని మాత్రమే అందులో ఉంచుతున్నా' అని జితేంద్ర చెప్పారు. 73 ఏళ్ల జితేంద్ర 1970-80 దశకంలో పలు విజయవంతమైన ప్రేమకథా చిత్రాల్లో హీరోగా నటించారు. పాకెట్ ఫ్రెండ్లీ రేంజ్ మొబైల్ ఫోన్లను తయారు చేయడమే తమ లక్ష్యమని వియాన్ యజమాని శిల్పాశెట్టి తెలిపారు. 80 శాతం మంది రూ. 10 వేలలోపు ధర ఉన్న ఫోన్లను వాడుతున్నారని, తాము కూడా ఈ రేంజ్ లోనే ఫోన్లు అందిస్తామన్నారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా తమ కుమారుడు 'వియాన్' పేరుతో దీన్ని ప్రారంభించారు.