
ఏక్తా కపూర్, జితేంద్ర
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ జితేంద్ర త్వరలోనే ఓ వెబ్ సీరిస్ ద్వారా తన అభిమానులను పలకరించనున్నారు. ప్రముఖ టీవీ సీరియల్స్ నిర్మాత, జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా వెబ్ సిరీస్ ‘బారిష్ 2’. ఈ వెబ్ సిరీస్‌లో జితేంద్ర ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
జీతూజీ గాంధీ అనే వజ్రాల వ్యాపారి పాత్రలో కనిపించబోతున్నారట. ‘‘మళ్లీ యాక్ట్ చేయడం భలే సరదాగా ఉంది. (2013లో వచ్చిన ‘మహాభారత్ ఔర్ బార్బరీక్’ సినిమాలో చివరిగా అతిథి పాత్రలో మెరిశారాయన. ‘బారిష్’ లాంటి సిరీస్‌తో వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. నా అభిమానులు, ప్రేక్షకులు ఈ పాత్రల్లో నాలోని విభిన్న కోణాలను చూసి ఆస్వాదిస్తారనుకుంటున్నాను’’ అన్నారు జితేంద్ర.
Comments
Please login to add a commentAdd a comment