తాగొచ్చి హేమ మాలిని పెళ్లి ఆపాడు | Hema Malini Wedding With Jitendra Stopped By Dharmendra | Sakshi
Sakshi News home page

లేకుంటే ఆ హీరోతో హేమ మాలిని పెళ్లి అయ్యుండేది

Apr 7 2020 2:54 PM | Updated on Apr 7 2020 3:26 PM

Hema Malini Wedding With Jitendra Stopped By Dharmendra - Sakshi

అల‌నాటి సూపర్ స్టార్ జితేంద్ర నేడు 78వ వ‌డిలోకి అడుగుపెట్టాడు. అత‌ను త‌న ప్రేయ‌సి శోభా క‌పూర్‌ను 1974లో అక్టోబ‌ర్‌18న వివాహం చేసుకున్నాడు. అయితే దీనిక‌న్నా ముందు అల‌నాటి అందాల తార హేమ‌మాలినిని పెళ్లి చేసుకోబోయాడు. ఈ విష‌యాన్ని ఆమె జీవిత క‌థ ఆధారంగా వ‌చ్చిన "హేమ మాలిని: బియాండ్ ద డ్రీమ్‌గ‌ర్ల్" పుస్త‌కం వెల్ల‌డించింది. ఈ పుస్త‌కం ప్ర‌కారం ఆమె త‌ల్లిదండ్రుల‌కు హేమ‌, వివాహితుడైన‌ ధ‌ర్మేంద్ర‌తో ఉండ‌టం అస్స‌లు న‌చ్చేది కాదు. దీంతో ఆమెకు జితేంద్ర‌తో వివాహం జ‌రిపించాల‌నుకున్నారు. వెంట‌నే అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌తో మాట్లాడ‌టం, ఇంట్లో వాళ్ల సంతోషం కోసం జితేంద్ర కూడా పెళ్లికి అంగీక‌రించడం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ముహూర్తం కూడా ఖ‌రారు చేసుకుని, చెన్నైలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తుండ‌గా ఓ వార్తాప‌త్రిక ఈ విష‌యాన్ని చాటింపు చేసి చెప్పింది. దీంతో విష‌యం తెలుసుకున్న‌ ధ‌ర్మేంద్ర్ర, జితేంద్ర ప్రేయ‌సి శోభా(ప్ర‌స్తుతం అత‌ని భార్య‌)తో క‌లిసి పెళ్లిని ఆపేందుకు చెన్నైకు ప‌య‌న‌మ‌య్యారు. (ఎంతో నేర్చుకున్నా)

మ‌ద్యం సేవించిన‌ ధ‌ర్మేంద్ర.. హేమ ఇంటికి చేరుకుని ఆమెను ఇంత పెద్ద త‌ప్పు చేయ‌వ‌ద్ద‌ని కోరుకున్నాడు. మ‌రోవైపు శోభా కూడా జితేంద్ర‌ను క‌లిసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా అత‌ను మాత్రం హేమ‌ను పెళ్లి చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడ‌ని పుస్త‌కంలో పేర్కొన్నారు. అయితే  ధ‌ర్మేంద్ర మాట‌ల‌తో క‌దిలిపోయిన హేమ‌ పెళ్లికి మ‌రింత గ‌డువు కావాల‌ని త‌న పేరెంట్స్‌ను అభ్య‌ర్థించింది. అలా ఆ పెళ్లి వాయిదా ప‌డింది. కాగా షోలే, సీతా ఔర్‌ గీతా, దిలాగీ, డ్రీమ్‌గర్ల్‌ వంటి చిత్రాల్లో హేమ‌తో క‌లిసి నటించిన ధర్మేంద్ర ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. అనంత‌రం 1979లో ఆగ‌స్టు 21న హేమ‌ను రెండో భార్య‌గా చేసుకున్నాడు.  అయిన‌ప్ప‌టికీ వాళ్లిద్దరి సంసార విషయంలో ఎప్పడూ గొడవలు బయటకు రాలేదు. ఇక వీరికి కూతుళ్లు ఈషా, అహాన్‌ డియోల్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈషా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం గృహిణిగా ఉండగా.. అహానా క్లాసికల్ డ్యాన్సర్‌గా పలు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇక ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్‌ కౌర్‌ సంతానం సన్నీ డియోల్‌, బాబీ డియోల్ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement