విజయానందంలో సీనియర్‌ హీరోయిన్‌.. కాలికి కట్టుతో భర్త! | Dharmendra Shares Video With Plaster on His Leg, Calls Himself Zakhmi sher | Sakshi
Sakshi News home page

Dharmendra: వీడియో షేర్‌ చేసిన నటుడు.. కాలికి ఏమైంది?

Published Thu, Jun 6 2024 6:11 PM | Last Updated on Thu, Jun 6 2024 6:31 PM

Dharmendra Shares Video With Plaster on His Leg, Calls Himself Zakhmi sher

సీనియర్‌ నటుడు ధర్మేంద్ర డియోల్‌ 88 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా కనిపిస్తూ ఉంటాడు. సోషల్‌ మీడియాలోనూ అప్పుడప్పుడు కబుర్లు చెప్తూ ఉంటాడు. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా షేర్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ సీనియర్‌ హీరో ఓ వీడియో షేర్‌ చేశాడు. గాయపడ్డ సింహం.. మళ్లీ బిజీ అయిపోయానంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. 

ఈ వీడియోలో ఆయన తన ఫామ్‌ హౌస్‌లో ప్రకృతి నడుమ సేద తీరుతున్నాడు. చెట్టు కింద కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. అందులో అతడి కుడి కాలికి పట్టీ వేసి ఉంది. ఇది చూసిన అభిమానులు ఆయనకు ఏమైందని కంగారుపడుతున్నారు. ఆ గాయం త్వరగా మానుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. 

కాగా ఈయన చివరగా రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహాని, తేరి బాటీ ఐసా ఉల్జా జియా అనే సినిమాల్లో కనిపించాడు. ఇకపోతే ధర్మేంద్ర రెండో భార్య హేమమాలిని సంతోషంలో మునిగి తేలుతోంది. మధుర నియోజకవర్గం నుంచి ఆమె మూడోసారి ఎంపీగా గెలుపొందింది. దీంతో ఫ్యాన్స్‌ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

 

చదవండి: నేను వాడిపడేసిన టిష్యూ ఏరుకుంది: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement