ప్రముఖ నటి హేమమాలిని నటుడు ధర్మేంద్ర జీవితంలో అడుగుపెట్టేనాటికే అతడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ హేమమాలినితో అతడు ప్రేమలో పడ్డాడు. అటు ఆమె కూడా ధర్మేంద్రను ఎంతగానో ప్రేమించింది. ఈ ప్రేమకు మొదటి పెళ్లి అడ్డవుతుందని అంతా అనుకున్నారు, కానీ వారు మాత్రం అలాంటి భయాలేమీ పెట్టుకోలేదు. 1980లో హేమమాలినిని రెండో పెళ్లి చేసుకుని తన జీవితంలోకి స్వాగతించాడు.
తాజాగా ఓ షోకి హాజరైన ఆమెకు.. ధర్మేంద్ర మొదటి భార్యను చూస్తే అసూయ కలగలేదా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికామె స్పందిస్తూ.. ఏరోజూ నాకు అసూయ పుట్టలేదు. అందుకే నేనిప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాను. లవ్‌లో ఉన్నప్పుడు ప్రేమను పంచాలే తప్ప ఇతరత్రా వాటిని ఆశించకూడదు. నువ్వు ప్రేమించే వ్యక్తి నీకు అంతకన్నా ఎక్కువ ప్రేమను పంచుతున్నప్పుడు ఏదో చిన్నచిన్న విషయాల కోసం అతడిని ఎందుకు టార్చర్ చేస్తాం?
తను నన్ను బాగా చూసుకున్నాడు కాబట్టే నేనెప్పుడూ బాధపడలేదు, తనపై కోప్పడలేదు, టార్చర్ పెట్టలేదు. అందుకే ఇప్పటికీ మేము ఒకరికొకరం ప్రేమ ఇచ్చిపుచ్చుకుంటున్నాం. మా మధ్యలోకి దేన్నీ దూరనివ్వం. అతడి సమస్యలు నాకు తెలుసు కాబట్టి కొన్నికొన్ని సందర్భాల్లో నేను సర్దుకుపోతాను. మనం ఏదైనా ఇస్తే దానికి రెట్టింపు మనకు లభిస్తుంది. అది ప్రేమేనని నేను నమ్ముతాను. ఆ ప్రేమకు విలువ ఇవ్వాలన్నది నా అభిప్రాయం' అని చెప్పుకొచ్చింది నటి. కాగా ధర్మేంద్ర- హేమమాలినిలకు 1981లో ఇషా డియోల్, 1985లో అహనా డియోల్ జన్మించారు.
Comments
Please login to add a commentAdd a comment