Dharmendra Apologises To Hema Malini, Shares Emotional Note For His Wife And Daughters - Sakshi
Sakshi News home page

Dharmendra: స్టార్‌ నటుడి ఇంట పెళ్లి.. భార్యాకూతురు డుమ్మా.. భావోద్వేగంతో..

Published Thu, Jun 29 2023 9:31 PM | Last Updated on Fri, Jun 30 2023 10:01 AM

Dharmendra: Could Have Spoken Personally To You But - Sakshi

బాలీవుడ్‌ నటదిగ్గజం ధర్మేంద్ర మనవడు కరణ్‌ డియోల్‌ ఓ ఇండివాడైన సంగతి తెలిసిందే! దృష ఆచార్యతో అతడు ఏడడుగులు నడిచాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే ఈ పెళ్లికి ధర్మేంద్ర భార్యాకూతురు డుమ్మా కొట్టారు. అదేంటి? కుటుంబంలోని వ్యక్తి పెళ్లికి రాకపోవడం ఏంటనుకుంటున్నారా? అయితే ముందు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలుసుకోవాల్సిందే!


మొదటి భార్య ప్రకాశ్‌ కౌర్‌తో ధర్మేంద్ర

మొదటి భార్య.. నలుగురు సంతానం
ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు. అతడు 19 ఏళ్ల వయసులోనే ప్రకాశ్‌ కౌర్‌ను పెళ్లాడాడు. వీరికి సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌, విజేత, అజీత అని నలుగురు సంతానం. ఇటీవల పెళ్లి చేసుకున్న కరణ్‌.. సన్నీ డియోల్‌ తనయుడు! సుమారు 70 ఏళ్లుగా ధర్మేంద్ర- ప్రకాశ్‌ కౌర్‌ కలిసి జీవిస్తున్నారు. ఇకపోతే అతడికి పెళ్లైన విషయం తెలిసి కూడా నటి హేమమాలిని ధర్మేంద్రను ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు ఈషా, అహానా సంతానం. వీరిని సన్నీ డియోల్‌.. కరణ్‌ పెళ్లికి రావాలని ఆహ్వానించినప్పటికీ ఈ కుటుంబం మాత్రం వేడుకకు వచ్చేందుకు మొగ్గు చూపలేదు. పెళ్లి పందిట్లో హేమమాలిని, ఆమె కూతుర్లు ఎక్కడా కనిపించనేలేదు. ధర్మేంద్ర పిలవకపోవడంతోనే వాళ్లు రాలేదని ప్రచారం జరిగింది.


రెండో భార్య హేమమాలిని, పిల్లలతో ధర్మేంద్ర

పిలవనందుకే క్షమాపణలు!
ఈ క్రమంలో ధర్మేంద్ర సోషల్‌ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యాడు. 'హేమ, నా డార్లింగ్‌ పిల్లలు ఇషా, అహానా.. అల్లుళ్లు తక్తానీ, వోహ్రా.. మిమ్మల్ని నేను ఎంతగానో గౌరవిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వయసు పైబడటం, అనారోగ్యం నాకో విషయాన్ని  గుర్తు చేశాయి. నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సింది. కానీ..' అంటూ వాక్యాన్ని సగంలోనే ఆపేస్తూ క్షమించండి అన్నట్లుగా చేతులు జోడించిన ఎమోజీని జత చేస్తూ పోస్ట్‌ పెట్టాడు.

చదవండి: రెండో భర్తకు విడాకులు.. కారణాలు అనవసరం అంటున్న నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement