బీటౌన్ సీనియర్ నటుడు ధర్మేంద్ర హేమమాలినిని వివాహం చేసుకున్నప్పటికీ, తన మొదటి భార్య నుంచి ధర్మేంద్ర విడాకులు తీసుకోలేదు. దీంతో తన కుమార్తెలు ఈషా, అహ్నాలతో కలిసి ప్రస్తుతం హేమ ఉంటున్నారు. వీరిద్దరి వివాహం 1980లోనే అయింది. కానీ వేర్వేరు ఇళ్లలో ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భర్త నుంచి వేరుగా ఉండటంపై హేమమాలిని స్పందించారు.
(ఇదీ చదవండి: పవన్ 'బ్రో' విషయంలో సీరియస్ అయిన థమన్..!)
మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌తో ధర్మేంద్ర
ఇంటర్వ్యూయర్ ఆమెను ఫెమినిస్ట్ ఐకాన్‌గా పరిగణిస్తూ.. మీరు ఒంటరిగా ఉండేందుకు ఇది కూడా ఒక కారణమనే చెప్పవచ్చా అనే ప్రశ్నకు హేమా ఇలా చెప్పుకొచ్చారు. 'నేను స్త్రీవాదానికి చిహ్నమా..? (నవ్వుతూ). ఎవరూ భర్తకు దూరంగా ఉండాలని కోరుకోరు. జీవితం ఏదిస్తుందో అది జరుగుతుంది. దానిని మనం స్వీకరించాల్సిందే. ప్రతి స్త్రీకి భర్త, పిల్లలు కావాలని కోరుకుంటుంది. కానీ ఎక్కడో ఆ లెక్కలు తప్పుతాయి. లేకపోతే, ఎవరికీ తమ జీవితాన్ని ఇలా గడపాలని అనిపించదు. అని హెమ తెలిపారు.
'బాధపడటం లేదు'
'భర్తకు దూరంగా ఉండటంలో నేను బాధపడటం లేదు. నాతో నేను సంతోషంగా ఉన్నాను. నాకు నా ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను వారిని చాలా బాగా పెంచాను. అయితే, అతను (ధర్మేంద్ర) ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. ప్రతిచోటా. పిల్లలకు తొందరగా పెళ్లి చేయాలి అని భయపడేవాడు. నేను ఇది జరుగుతుంది అనే చెప్పేదానిని. సరైన సమయం వచ్చినప్పుడు, సరైన వ్యక్తి వస్తాడు అని ఆయనకు ధైర్యం చెప్పేదాన్ని. భగవంతుడు, గురువుల ఆశీర్వాదంతో నా పిల్లల ఇద్దరి పెళ్లిల్లు అయిపోయాయి. మేమిద్దరం అనుకున్నది ప్రతిదీ జరిగింది.' అని హేమ అన్నారు.
రెండో భార్య హేమమాలిని, పిల్లలతో ధర్మేంద్ర
హేమమాలినిని ధర్మేంద్ర మొదటిసారి కలిసినప్పుడు ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్‌లకు ఇద్దరు కుమారులు - సన్నీ డియోల్,బాబీ డియోల్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు అజీత, విజేత ఉన్నారు. ఇటీవల, ధరమేంద్ర మనవడు కరణ్ డియోల్ వివాహం జరిగింది. హేమమాలిని కుటుంబం నుంచి ఎవరూ ఆ పెళ్లికి హాజరు కాలేదు. దీంతో భార్య, కుమార్తెల కోసం ఒక భావోద్వేగ పోస్ట్ కూడా ధర్మేంద్ర రాశారు.
(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్)
Comments
Please login to add a commentAdd a comment