Esha Deol
-
థియేటర్లో అసభ్య ప్రవర్తన.. వెంటనే చేయి పట్టుకుని: హీరోయిన్
బాలీవుడ్ నటి ఇషా డియోల్ పరిచయం అక్కర్లేని పేరు. హేమమాలిని వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ టాప్ జోడీ ధర్మేంద్ర-హేమమాలినిల పెద్ద కూతురే ఇషా. కేవలం 21 ఏళ్ల వయసులోనే 'కోయి మేరే దిల్ సే పూచే' అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇషా.. గతంలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. పుణేలో తాను నటించిన దస్ మూవీ ప్రీమియర్ షోలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. అందరితో పాటు నేను కూడా ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లాను.. అదే సమయంలో ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడని ఇషా వెల్లడించింది. దీంతో వెంటనే అతన్ని చేయి పట్టుకుని లాగి అక్కడే చెంపదెబ్బ కొట్టానని.. ఇలాంటి వారిని అస్సలు ఉపేక్షించవద్దని ఆ సంఘటనను గుర్తు చేసుకుంది. నా చుట్టూ బౌన్సర్లు ఉన్నప్పటికీ ఇలా జరిగిందని పేర్కొంది. కాగా.. ఈషా చివరిసారిగా హంటర్ టూటేగా నహీ తోడేగా అనే షోలో కనిపించింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ హీరో హీరోయిన్ అనే చిత్రంలో కనిపించనుంది.భర్తతో విడాకులుకాగా.. హీరోయిన్ ఈషా డియోల్ కొద్ది నెలల క్రితమే విడాకులు తీసుకుంది. 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకున్న ఈమెకు రాధ్య, మిరాయ అని ఇద్దరు కూతుర్లున్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకులు ప్రకటించారు. -
రిలేషన్షిప్లో అబ్బాయిలు చేసేది చాలా తప్పు: హీరోయిన్
ప్రముఖ నటి హేమమాలిని కూతురు, హీరోయిన్ ఈషా డియోల్ కొద్ది నెలల క్రితమే విడాకులు తీసుకుంది. 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకున్న ఈమెకు రాధ్య, మిరాయ అని ఇద్దరు కూతుర్లున్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకులు ప్రకటించారు.ఓ మంచి తోడు దొరికినా సరే..విడాకుల తర్వాత ఈషా డియోల్ తొలిసారి రిలేషన్షిప్ గురించి మాట్లాడింది. 'రిలేషన్షిప్లో మీ పార్ట్నర్తో సమానంగా ఉండాలి. ఆర్థిక విషయాల గురించి చెప్పట్లేదు. ఇద్దరి లైఫ్‌స్టైల్ ఒకటై ఉండాలంటున్నాను. అక్కడ తేడా వచ్చిందంటే మాత్రం మీ బంధంలో ఇబ్బందులు తప్పవు. అయితే అబ్బాయిలకు ఓ మంచి తోడు దొరికినా సరే.. మళ్లీ వేరే అమ్మాయిలపై మనసు పారేసుకుంటారు. ఇది చాలా తప్పు.ఒక్కదాన్నే రోజంతా..ఇకపోతే మంచి రిలేషన్షిప్లో ఫ్రెండ్షిప్ ఉండాల్సిందే! అప్పుడు నువ్వు ఏం చేయాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా కూడా అవతలివారి పర్మిషన్ అవసరం ఉండదు. అలాగే మనం చేసే పనికి అడ్డు పడకుండా ఉంటారు. నా విషయానికి వస్తే నా ప్రపంచం నాది. నేను ఒక్కదాన్నే రోజంతా సరదాగా గడిపేయగలను. అలా ఉండటం నాకెంతో ఇష్టం కూడా! నాలాంటివారికి ఆ పర్సనల్ స్పేస్ ఇవ్వాలి' అని చెప్పుకొచ్చింది.సినిమాల విషయానికి వస్తే.. ఈషా డియోల్.. కోయి మేరే దిల్సే పూచె, కుచ్ తో హై, యువ, ధూమ్, కాల్, షాదీ నెం.1, నో ఎంట్రీ, జస్ట్ మ్యారీడ్, హైజాక్.. ఇలా ఎన్నో హిందీ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. హీరోహీరోయిన్ అనే చిత్రంతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
12 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న హీరోయిన్.. కారణమేంటి?
ప్రముఖ హీరోయిన్ హేమమాలిని కూతురు ఈషా డియోల్ విడాకులు తీసుకుంది. తల్లి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె నటిగా పలు సినిమాల్లో కథానాయికగా చేసింది. మధ్యలో పెళ్లితో కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించినప్పటికీ.. ఓటీటీల్లో నటిస్తోంది. అలాంటిది ఈమె ఇప్పుడు విడాకులు తీసుకుందనే విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్) బాలీవుడ్ టాప్ జోడీ ధర్మేంద్ర-హేమమాలినిల పెద్ద కూతురు ఈషా డియోల్. 21 ఏళ్ల వయసులోనే అంటే 2002లోనే 'కోయి మేరే దిల్ సే పూచే' అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 2008వరకు దాదాపు ఆరేళ్లలో 30కి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కాస్త స్పీడ్ తగ్గించింది. 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకుని ఓ మూడేళ్లు నటనకు బ్రేక్ ఇచ్చింది. ఈషా-భరత్ దంపతులకు 2017లో అమ్మాయి పుట్టగా, 2019లో అబ్బాయి పుట్టాడు. ఏమైందో ఏమో గానీ గత కొన్నాళ్ల నుంచి ఈషా డియోల్, భర్త నుంచి విడాకులు తీసుకోనుందనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ వీళ్లిద్దరూ ప్రకటన ఇచ్చారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, పిల్లలు మాత్రం తమకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చారు. అయితే విడిపోవడానికి కారణం ఏంటనేది మాత్రం బయటకు చెప్పలేదు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడేమో ఇలా?) -
భర్తకు దూరంగా ఉండటంపై మొదటిసారి స్పందించిన హేమమాలిని
బీటౌన్ సీనియర్ నటుడు ధర్మేంద్ర హేమమాలినిని వివాహం చేసుకున్నప్పటికీ, తన మొదటి భార్య నుంచి ధర్మేంద్ర విడాకులు తీసుకోలేదు. దీంతో తన కుమార్తెలు ఈషా, అహ్నాలతో కలిసి ప్రస్తుతం హేమ ఉంటున్నారు. వీరిద్దరి వివాహం 1980లోనే అయింది. కానీ వేర్వేరు ఇళ్లలో ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భర్త నుంచి వేరుగా ఉండటంపై హేమమాలిని స్పందించారు. (ఇదీ చదవండి: పవన్ 'బ్రో' విషయంలో సీరియస్ అయిన థమన్..!) మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌తో ధర్మేంద్ర ఇంటర్వ్యూయర్ ఆమెను ఫెమినిస్ట్ ఐకాన్‌గా పరిగణిస్తూ.. మీరు ఒంటరిగా ఉండేందుకు ఇది కూడా ఒక కారణమనే చెప్పవచ్చా అనే ప్రశ్నకు హేమా ఇలా చెప్పుకొచ్చారు. 'నేను స్త్రీవాదానికి చిహ్నమా..? (నవ్వుతూ). ఎవరూ భర్తకు దూరంగా ఉండాలని కోరుకోరు. జీవితం ఏదిస్తుందో అది జరుగుతుంది. దానిని మనం స్వీకరించాల్సిందే. ప్రతి స్త్రీకి భర్త, పిల్లలు కావాలని కోరుకుంటుంది. కానీ ఎక్కడో ఆ లెక్కలు తప్పుతాయి. లేకపోతే, ఎవరికీ తమ జీవితాన్ని ఇలా గడపాలని అనిపించదు. అని హెమ తెలిపారు. 'బాధపడటం లేదు' 'భర్తకు దూరంగా ఉండటంలో నేను బాధపడటం లేదు. నాతో నేను సంతోషంగా ఉన్నాను. నాకు నా ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను వారిని చాలా బాగా పెంచాను. అయితే, అతను (ధర్మేంద్ర) ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. ప్రతిచోటా. పిల్లలకు తొందరగా పెళ్లి చేయాలి అని భయపడేవాడు. నేను ఇది జరుగుతుంది అనే చెప్పేదానిని. సరైన సమయం వచ్చినప్పుడు, సరైన వ్యక్తి వస్తాడు అని ఆయనకు ధైర్యం చెప్పేదాన్ని. భగవంతుడు, గురువుల ఆశీర్వాదంతో నా పిల్లల ఇద్దరి పెళ్లిల్లు అయిపోయాయి. మేమిద్దరం అనుకున్నది ప్రతిదీ జరిగింది.' అని హేమ అన్నారు. రెండో భార్య హేమమాలిని, పిల్లలతో ధర్మేంద్ర హేమమాలినిని ధర్మేంద్ర మొదటిసారి కలిసినప్పుడు ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్‌లకు ఇద్దరు కుమారులు - సన్నీ డియోల్,బాబీ డియోల్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు అజీత, విజేత ఉన్నారు. ఇటీవల, ధరమేంద్ర మనవడు కరణ్ డియోల్ వివాహం జరిగింది. హేమమాలిని కుటుంబం నుంచి ఎవరూ ఆ పెళ్లికి హాజరు కాలేదు. దీంతో భార్య, కుమార్తెల కోసం ఒక భావోద్వేగ పోస్ట్ కూడా ధర్మేంద్ర రాశారు. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్) -
అలా అయితే నటించేందుకు రెడీ: హీరోయిన్
మంచి స్కిప్ట్‌తో వస్తే తమిళ సినిమాల్లో నటించడానికి నేను రెడీ అంటోంది బాలీవుడ్ భామ ఈషా డియోల్. చైన్నెలోని వేళచ్చేరిలో ఉన్న పల్లాడియం- ఫీనిక్స్ మార్కెట్‌సిటీలో లగ్జరీ షాపింగ్ ఫెస్టివల్ 2023ని ఆమె ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీ వరకు పల్లాడియంలో అన్ని దుకాణాల్లో 40 శాతం వరకు తగ్గింపులను అందిస్తున్నారు.ఈ సందర్భంగా బాలీవుడ్ తార ఈషా డియోల్ తన షాపింగ్ అనుభవాన్ని సందర్శకులతో పంచుకున్నారు. (ఇది చదవండి: ధోనీ ఫస్ట్ సినిమా ట్రైలర్.. అలాంటి కాన్సెప్ట్‌తో!) పల్లాడియంలో షాపింగ్ చేయడం తనకు చాలా ఇష్టమని ఈషా డియోల్ తెలిపారు. తమిళనాడులో పుట్టి పెరిగానని.. తమిళం అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. అలాగే మంచి కథలతో వస్తే తమిళ సినిమాల్లో నటించడాని తాను రెడీ అని చెప్పారు. ఈషా డియోల్ ప్రసంగంతో దుకాణదారులు, అభిమానులు, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే! ) View this post on Instagram A post shared by Esha Deol Takhtani (@imeshadeol) -
ఇంట్లో పెళ్లికి డుమ్మా కొట్టిన భార్యాపిల్లలు.. సోషల్ మీడియాలో నటుడి భావోద్వేగం
బాలీవుడ్ నటదిగ్గజం ధర్మేంద్ర మనవడు కరణ్ డియోల్ ఓ ఇండివాడైన సంగతి తెలిసిందే! దృష ఆచార్యతో అతడు ఏడడుగులు నడిచాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే ఈ పెళ్లికి ధర్మేంద్ర భార్యాకూతురు డుమ్మా కొట్టారు. అదేంటి? కుటుంబంలోని వ్యక్తి పెళ్లికి రాకపోవడం ఏంటనుకుంటున్నారా? అయితే ముందు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలుసుకోవాల్సిందే! మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌తో ధర్మేంద్ర మొదటి భార్య.. నలుగురు సంతానం ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు. అతడు 19 ఏళ్ల వయసులోనే ప్రకాశ్ కౌర్‌ను పెళ్లాడాడు. వీరికి సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత, అజీత అని నలుగురు సంతానం. ఇటీవల పెళ్లి చేసుకున్న కరణ్.. సన్నీ డియోల్ తనయుడు! సుమారు 70 ఏళ్లుగా ధర్మేంద్ర- ప్రకాశ్ కౌర్ కలిసి జీవిస్తున్నారు. ఇకపోతే అతడికి పెళ్లైన విషయం తెలిసి కూడా నటి హేమమాలిని ధర్మేంద్రను ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు ఈషా, అహానా సంతానం. వీరిని సన్నీ డియోల్.. కరణ్ పెళ్లికి రావాలని ఆహ్వానించినప్పటికీ ఈ కుటుంబం మాత్రం వేడుకకు వచ్చేందుకు మొగ్గు చూపలేదు. పెళ్లి పందిట్లో హేమమాలిని, ఆమె కూతుర్లు ఎక్కడా కనిపించనేలేదు. ధర్మేంద్ర పిలవకపోవడంతోనే వాళ్లు రాలేదని ప్రచారం జరిగింది. రెండో భార్య హేమమాలిని, పిల్లలతో ధర్మేంద్ర పిలవనందుకే క్షమాపణలు! ఈ క్రమంలో ధర్మేంద్ర సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యాడు. 'హేమ, నా డార్లింగ్ పిల్లలు ఇషా, అహానా.. అల్లుళ్లు తక్తానీ, వోహ్రా.. మిమ్మల్ని నేను ఎంతగానో గౌరవిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వయసు పైబడటం, అనారోగ్యం నాకో విషయాన్ని గుర్తు చేశాయి. నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సింది. కానీ..' అంటూ వాక్యాన్ని సగంలోనే ఆపేస్తూ క్షమించండి అన్నట్లుగా చేతులు జోడించిన ఎమోజీని జత చేస్తూ పోస్ట్ పెట్టాడు. View this post on Instagram A post shared by Dharmendra Deol (@aapkadharam) చదవండి: రెండో భర్తకు విడాకులు.. కారణాలు అనవసరం అంటున్న నటి -
అమ్మ అనుమతిస్తే ఆమె బయోపిక్‌లో నటిస్తా!
చెన్నై : అమ్మ అనుమతిస్తే ఆమె బయోపిక్‌లో నటించడానికి సిద్ధమని నటి హేమమాలిని కూతురు, బాలీవుడ్ కథానాయకి ఇషాడియోల్ పేర్కొన్నారు. ఈ బ్యూటీ బుధవారం చెన్నైలో సందడి చేశారు. కలర్స్ సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన క్లోమాంటిక్ టెక్నాలజీ వెయిట్ లాస్ అనే ప్రొడక్ట్ పరిచయ కార్యక్రమం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. ఇషాడియోల్ మాట్లాడుతూ క్రోమాటిక్ టెక్నాలజీ విధానం ద్వారా తాను 16 కిలోలు తగ్గానని చెప్పారు. ఆమె విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ మాతృభాష తమిళమేనని అన్నారు. చెన్నై అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. రసం తాగడానికి చెన్నై వస్తుంటానని చెప్పారు. నటుడు సూర్య అంటే చాలా ఇష్టమని తెలిపారు. అవకాశం వస్తే మళ్లీ తమిళంలో నటించడానికి సిద్ధమేనని చెప్పారు. మీ అమ్మ బయోపిక్‌లో నటిస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ అమ్మ అనుమతిస్తే ఆ చిత్రంలో నటించడానికి సిద్ధమేనని ఇషా డియోల్ చెప్పారు. చదవండి: పెళ్ళిలో అజయ్ దేవ్‌గణ్ డబ్బులు ఆఫర్ చేశాడు! చదవండి: డివిలియర్స్‌పై మనసుపడ్డ షాహిద్ భార్య! -
బాలీవుడ్ హీరోయిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్
ముంబయి: సెలెబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు ఇలా చాలా మంది సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటారు. తమకు సంబందించిన ప్రతి విషయాన్నిసోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఒక్కోసారి సాధారణ ప్రజలతో పాటు సెలెబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు కూడా హ్యాకింగ్ కి గురి అవుతూ ఉంటాయి. చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఇషా డియోల్ యొక్క ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయినట్లు తన ట్విటర్ లో పేర్కొంది. తన అభిమానులు ఎవరు కూడా నా ప్రొఫైల్ నుంచి ఎలాంటి మెసేజ్‌లు, పోస్ట్‌లు వచ్చిన స్పందించవద్దు అని అప్రమత్తం చేసింది. అంతే కాకుండా పలు స్క్రీన్ షాట్ లను తన ట్విటర్ లో షేర్ చేసుకుంది. ఇటీవల కాలంలో ఆశా భోంస్లే, ఊర్మిళ మాటోండ్కర్, సుస్సాన్ ఖాన్, విక్రమంత్ మాస్సే, ఫరా ఖాన్ వంటి ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల హ్యాక్ విషయం మనకు తెలిసిందే.(చదవండి: టాలీవుడ్ హీరోపై కేసు నమోదు) This morning my official Instagram account imeshadeol got Hacked , so please don’t reply to any msg if you received any from my Instagram account. Sorry for the inconvenience. Insta Id : imeshadeol pic.twitter.com/AbLg79WxIY — Esha Deol (@Esha_Deol) January 10, 2021 -
‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’
లాక్డౌన్ విధించిన నాటి నుంచి సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఆరోగ్యానికి సంబంధించిన రుమార్లు తెగ ప్రచారం అవుతున్నాయి. ఫలానా నటి / నటుడు అనారోగ్యం పాలయ్యారని.. ఆస్పత్రిలో చేరారంటూ పుకార్లు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. చివరకు సదరు వ్యక్తి స్వయంగా తెర మీదకు వచ్చి.. నాకేమి కాలేదు.. ఆరోగ్యంగా ఉన్నాను అంటూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా ప్రసిద్ధ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని కూడా ఈ పుకార్ల బారిన పడ్డారు. ఆమె ఆరోగ్యం బాగాలేదు.. ఆస్పత్రిలో చేరారనే వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరలయ్యాయి. దాంతో అభిమానులు, సన్నిహితుల నుంచి ఒకటే ఫోన్లు. ఈ బాధ తట్టుకోలేక చివరికి ‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు హేమ మాలిని. (ఆయనతోనే జీవితం అనుకున్నా.. అందుకే..) View this post on Instagram Dear All, Thank you so much for showing your concern. I am absolutely fine with the blessing of Lord Krishna. Radhey Radhey. You all stay home, stay safe. A post shared by Dream Girl Hema Malini (@dreamgirlhemamalini) on Jul 11, 2020 at 11:20pm PDT ‘నేను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా వార్తలు వస్తోన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో నా అభిమానులు, నా మంచి కోరే వారికి ఓ విషయం తెలియజేయాలనుకున్నాను. అవన్నీ రూమర్స్. నాకు ఏమీ కాలేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. దేవుడి దయతో అంతా బాగానే ఉంది’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు హేమ మాలిని. 28 సెకన్ల నిడివి కలిగిన వీడియోను తన ఇంటి నుంచే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే హేమ మాలిని ఈ వీడియోను పోస్ట్ చేయడానికి ముందే ఈ వార్తలపై ఆమె కూతురు ఈషాడియోల్ స్పందించారు. తన తల్లి డ్రీమ్ గర్ల్ హేమ మాలిని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆమె ట్వీట్ చేశారు. అంతేకాక హేమ మాలిని ఆరోగ్యంపై ఆందోళన చెందిన అభిమానులకు, తమ పట్ల చూపిస్తోన్న ప్రేమకు ఈషా డియోల్ కృతజ్ఞతలు తెలిపారు.(నాన్నా! నేనున్నాను!!) My mother @dreamgirlhema is fit & fine 🧿 ! The news regarding her health is absolutely fake so please don’t react to such rumours! Thanks to everyone for their love & concern . ♥️🙏🏼 — Esha Deol (@Esha_Deol) July 12, 2020 -
‘కలకాలం మీరు ఇలాగే ఉండాలి.. అమ్మానాన్నా’
‘‘అమ్మా, నాన్నా నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మీరిలాగే కలకాలం కలిసి ఉండాలని.. ప్రేమ, సంతోషం, ఆరోగ్యం మీకు ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను! ప్రేమతో ఇషా, భరత్, రాధ్యా, మియూ’’అంటూ అలనాటి బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమమాలిని, నటుడు ధర్మేంద్రకు వారి తనయ, నటి ఇషా డియోల్ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇషా సోదరి అహానా సైతం హేమ, ధర్మేంద్రలకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సోషల్ మీడియా వేదికగా వారికి శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు స్పందించిన హేమ మాలిని తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా బాలీవుడ్లో డ్రీమ్‌గర్ల్‌గా ఓ వెలుగు వెలిగిన హేమ మాలినిని పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది హీరోలు ప్రయత్నించి విఫలమయ్యారు. సంజీవ్ కుమార్, జితేంద్ర ఆ జాబితాలో ప్రముఖులు. (మన కథ ముగిసింది: నీతూ కపూర్) ఇక జితేంద్ర హేమ మాలిని ఇంట్లో వాళ్లను ఒప్పించి.. తన ప్రేమను పెళ్లి పీటలదాకా తీసుకువచ్చాడు. మద్రాసులో వివాహం చేసుకోవడానికి తేదీ ఖరారు చేయించాడు. కానీ అప్పటికే హేమతో కలిసి షోలే, సీతా ఔర్ గీతా, దిలాగీ, డ్రీమ్‌గర్ల్ వంటి చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర.. ఆ పెళ్లిని అడ్డుకుని ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. దీంతో 1959లో ధర్మేంద్ర జీవితంలో రెండో భార్యగా హేమమాలిని అడుగుపెట్టారు. ఇద్దరూ వైవాహిక బంధంలో కొనసాగి ఆ తర్వాత దూరం దూరంగా ఉంటున్నా ఎన్నడూ ఒకరినొకరు విమర్శించుకోలేదు. అంతేకాదు ధర్మేంద్ర జీవితంలోకి తాను ప్రవేశించినప్పటికీ ఆయనను ఏనాడు తన కుటుంబం నుంచి వేరు చేయలేదని హేమ మాలిని పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన తనకోసమే పుట్టారని భావిస్తానని.. ఆయనతో జీవితం పంచుకోవడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని భర్తపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇక హేమమాలిని ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.(లాక్‌డౌన్‌తో గెలుద్దాం: హేమ పిలుపు) View this post on Instagram Happy wedding anniversary my darling parents! My mamma & papa I love u both soooooooo much & pray to god to bless you both with infinite years of togetherness ,love , happiness & the best of health !🧿🤗 @dreamgirlhemamalini @aapkadharam Love you , Esha , Bharat,Radhya & Miu ♥️♥️♥️♥️♥️♥️💕 A post shared by Esha Deol (@imeshadeol) on May 1, 2020 at 9:46pm PDT Dharam ji & I thank all those who have wished us on our wedding anniversary today. It is your blessings & good wishes that have always been with us all through these years🙏 pic.twitter.com/tEtO6L4Boj — Hema Malini (@dreamgirlhema) May 2, 2020 -
ఆనందంలో ఈషా డియోల్
బాలీవుడ్ నటి ఈషా డియోల్ రెండో సారి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కాగా, తన కూతురు పేరు మిరయా తక్తానీ అని తెలిపారు. హేమ మాలిని, ధర్మేంద్రల కూతురైన ఈషా.. భరత్ తక్తానీని 2012లో పెళ్లి చేసుకోగా.. అక్టోబర్ 2017 ఈ దంపతులకి రాధ్య జన్మించింది. తాజాగా తనకు రెండోసారి ఆడపిల్ల జన్మించిందని, ఆ సంతోషాన్ని అభిమానులతో కలిసి పంచుకున్నారు. రెండో కాన్పు ద్వారా ఆడబిడ్డ జన్మించిందని ఇషా డియోల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. మీ ప్రేమ, ఆశీర్వాదానికి ధన్యవాదాలు అని ఇషా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పెళ్ళి తర్వాత ఇషా డియోల్ పూర్తిగా సినిమాలకి దూరమయ్యారు. 2002లో కోయి మేరే దిల్ సే పూచ్చే చిత్రంతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈషా డియోల్.. ధూమ్, యువ, నో ఎంట్రీ, ధస్ చిత్రాలతో ఈషా బాగా పాపులర్ అయ్యారు. తనకి మరో కూతురు జన్మించడంతో హేమమాలని దంపతులు సంతోషంగా ఉన్నారని ఈషా పేర్కొన్నారు. -
ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్
హేమామాలిని కూతురు, బాలీవుడ్ నటి ఇషా డియోల్ త్వరలో అమ్మ కాబోతున్నది. ఇషా డియోల్-భరత్ తఖ్తానీ దంపతులు త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని గతంలోనే తల్లి హేమామాలిని ట్విట్టర్ లో వెల్లడించింది. తాజాగా బేబీ బంప్ తో ఉన్న ఇషా ఫొటో సోషల్ మీడియలో దర్శనమిచ్చింది. ఇషా బాల్యపు స్నేహితురాలు శిలార్న వాజే అలియాస్ ఛెఫ్ చిన్నూ తామిద్దరి ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. చిన్నూ కూడా గర్భవతియే. ఇద్దరూ బేబీ బంప్ తో ఉన్న ఫొటోను దిగి పోస్టు చేసింది. తాము డబుల్ హ్యాపీగా ఉన్నట్టు ఈ ఫొటోకు కామెంట్ పెట్టింది. ఈ ఫొటో ఈషా అభిమానులను అలరిస్తోంది. -
మీ దయతో మా అమ్మ కోలుకుంటోంది
ముంబయి: రోడ్డు ప్రమాదానికి గురైన తన తల్లి, బీజేపీ నేత హేమమాలిని ఇప్పుడిప్పుడే కోలుకుంటుందోని ఆమె కూతురు నటి ఇషాడియోల్ తెలిపింది. తన అభిమానుల ఆశీర్వాదం వల్లే మెల్లగా కోలుకుంటున్నారని, వెంటనే అన్ని రకాలుగా కోలుకునేందుకు తన తల్లి సూపర్ ఉమెన్ కాదుగా అని చెప్పింది. సినీ నిర్మాత సుభాష్ ఘాయ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇషా డియోల్ పాల్గొన్న సందర్భంలో అక్కడికొచ్చినవారంతా మీ తల్లిగారు కోలుకున్నారా అని ప్రశ్నించగా ఆమె స్పందించింది. 'ఆమె(హేమమాలిని) ఇప్పుడిప్పుడే మీ ఆశీర్వాదం, అభినందనల వల్ల కోలుకుంటోంది. ఇదొక రకంగా చాలా సంతోషించాల్సిన, ఆహ్వానించాల్సిన విషయం. ఈ రోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే అందుకు మా అమ్మే కారణం. ఇప్పటికీ సాంప్రదాయ బద్ధమైన జీవితం గడుపుతూ ఎప్పటికప్పుడూ నాకు స్ఫూర్తినిస్తుంది. స్వచ్ఛమైన హృదయాన్ని కలిగిన వారిలో మా అమ్మకు తొలిస్ధానం ఇస్తాను' అని ఇషా డియోల్ చెప్పింది. గత కొన్ని రోజుల కిందట రాజస్థాన్‌లో హేమమాలిని ప్రయాణిస్తున్న కారు ఓ కారును ఢీకొనడంతో అందులోని చిన్నపాప చనిపోగా హేమమాలిని గాయపడ్డారు. ఆమె కారు మితిమీరిన వేగంతో వెళ్లడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని, చిన్నపాపచనిపోవడానికి కారణమయ్యారని తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. -
శిల్ప, లారా, దియా బాటలో ఇషా
ముంబై: బాలీవుడ్ అలనాటి డ్రీమ్‌గర్ల్ హేమమాలిని తనయ, యువ నటి ఇషా డియోల్ నిర్మాతగా కొత్త అవతారమెత్తనున్నారు. ఇషా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిత్రాలను నిర్మించనున్నారు. సంఖ్యాశాస్త్రవేత్తతో సంప్రదించిన అనంతరం ఈ పేరు పెట్టారు. ఇషాయే ఈ విషయాలను వెల్లడించారు. నిర్మాతలుగా మారిన బాలీవుడ్ ముద్దుగుమ్మలు శిల్పాశెట్టి, లారా దత్తా, దియా మీర్జా తదితరుల జాబితాలో తాజాగా ఇషా చేరారు. మరో నటి జూహీ చావ్లాకు కూడా సినీ నిర్మాణంలో భాగస్వామ్యముంది. 32 ఏళ్ల ఇషా 2012లో వ్యాపారవేత్త భరత్ టఖ్టానిని వివాహం చేసుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందించిన యువ చిత్రంలో ఆమె నటించారు. -
హేమమాలిని కూతురి మెహందీ ఫంక్షన్