మంచి స్కిప్ట్‌తో వస్తే తమిళ సినిమాల్లో నటించడానికి నేను రెడీ అంటోంది బాలీవుడ్ భామ ఈషా డియోల్. చైన్నెలోని వేళచ్చేరిలో ఉన్న పల్లాడియం- ఫీనిక్స్ మార్కెట్‌సిటీలో లగ్జరీ షాపింగ్ ఫెస్టివల్ 2023ని ఆమె ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీ వరకు పల్లాడియంలో అన్ని దుకాణాల్లో 40 శాతం వరకు తగ్గింపులను అందిస్తున్నారు.ఈ సందర్భంగా బాలీవుడ్ తార ఈషా డియోల్ తన షాపింగ్ అనుభవాన్ని సందర్శకులతో పంచుకున్నారు.
(ఇది చదవండి: ధోనీ ఫస్ట్ సినిమా ట్రైలర్.. అలాంటి కాన్సెప్ట్‌తో!)
పల్లాడియంలో షాపింగ్ చేయడం తనకు చాలా ఇష్టమని ఈషా డియోల్ తెలిపారు. తమిళనాడులో పుట్టి పెరిగానని.. తమిళం అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. అలాగే మంచి కథలతో వస్తే తమిళ సినిమాల్లో నటించడాని తాను రెడీ అని చెప్పారు. ఈషా డియోల్ ప్రసంగంతో దుకాణదారులు, అభిమానులు, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేశారు.
(ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే! )
Comments
Please login to add a commentAdd a comment