అమ్మ అనుమతిస్తే ఆమె బయోపిక్‌లో నటిస్తా! | Bollywood Actress Esha Deol Says Am A Big Fan of Actor Surya | Sakshi
Sakshi News home page

అమ్మ అనుమతిస్తే ఆమె బయోపిక్‌లో నటిస్తా!

Published Thu, Feb 25 2021 8:01 AM | Last Updated on Thu, Feb 25 2021 8:01 AM

Bollywood Actress Esha Deol Says Am A Big Fan of Actor Surya - Sakshi

చెన్నై : అమ్మ అనుమతిస్తే ఆమె బయోపిక్‌లో నటించడానికి సిద్ధమని నటి హేమమాలిని కూతురు, బాలీవుడ్‌ కథానాయకి ఇషాడియోల్‌ పేర్కొన్నారు. ఈ బ్యూటీ బుధవారం చెన్నైలో సందడి చేశారు. కలర్స్‌ సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన క్లోమాంటిక్‌ టెక్నాలజీ వెయిట్‌ లాస్‌ అనే ప్రొడక్ట్‌ పరిచయ కార్యక్రమం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. ఇషాడియోల్‌ మాట్లాడుతూ క్రోమాటిక్‌ టెక్నాలజీ విధానం ద్వారా తాను 16 కిలోలు తగ్గానని చెప్పారు.

ఆమె విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ మాతృభాష తమిళమేనని అన్నారు. చెన్నై అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. రసం తాగడానికి చెన్నై వస్తుంటానని చెప్పారు. నటుడు సూర్య అంటే చాలా ఇష్టమని తెలిపారు.  అవకాశం వస్తే మళ్లీ తమిళంలో నటించడానికి సిద్ధమేనని చెప్పారు. మీ అమ్మ బయోపిక్‌లో నటిస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ అమ్మ అనుమతిస్తే ఆ చిత్రంలో నటించడానికి సిద్ధమేనని ఇషా డియోల్‌ చెప్పారు. 

చదవండి: పెళ్ళిలో అజయ్‌ దేవ్‌గణ్‌‌ డబ్బులు ఆఫర్‌ చేశాడు!
చదవండి: డివిలియర్స్‌పై మనసుపడ్డ షాహిద్‌ భార్య!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement