మీ దయతో మా అమ్మ కోలుకుంటోంది | Esha Deol: My mother is under recovery and she's getting well with all your blessings | Sakshi
Sakshi News home page

మీ దయతో మా అమ్మ కోలుకుంటోంది

Published Sun, Jul 19 2015 2:03 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

మీ దయతో మా అమ్మ కోలుకుంటోంది - Sakshi

మీ దయతో మా అమ్మ కోలుకుంటోంది

ముంబయి: రోడ్డు ప్రమాదానికి గురైన తన తల్లి, బీజేపీ నేత హేమమాలిని ఇప్పుడిప్పుడే కోలుకుంటుందోని ఆమె కూతురు నటి ఇషాడియోల్ తెలిపింది. తన అభిమానుల ఆశీర్వాదం వల్లే మెల్లగా కోలుకుంటున్నారని, వెంటనే అన్ని రకాలుగా కోలుకునేందుకు తన తల్లి సూపర్ ఉమెన్ కాదుగా అని చెప్పింది. సినీ నిర్మాత సుభాష్ ఘాయ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇషా డియోల్ పాల్గొన్న సందర్భంలో అక్కడికొచ్చినవారంతా మీ తల్లిగారు కోలుకున్నారా అని ప్రశ్నించగా ఆమె స్పందించింది.

'ఆమె(హేమమాలిని) ఇప్పుడిప్పుడే మీ ఆశీర్వాదం, అభినందనల వల్ల కోలుకుంటోంది. ఇదొక రకంగా చాలా సంతోషించాల్సిన, ఆహ్వానించాల్సిన విషయం. ఈ రోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే అందుకు మా అమ్మే కారణం. ఇప్పటికీ సాంప్రదాయ బద్ధమైన జీవితం గడుపుతూ ఎప్పటికప్పుడూ నాకు స్ఫూర్తినిస్తుంది. స్వచ్ఛమైన హృదయాన్ని కలిగిన వారిలో మా అమ్మకు తొలిస్ధానం ఇస్తాను' అని ఇషా డియోల్ చెప్పింది. గత కొన్ని రోజుల కిందట రాజస్థాన్లో హేమమాలిని ప్రయాణిస్తున్న కారు ఓ కారును ఢీకొనడంతో అందులోని చిన్నపాప చనిపోగా హేమమాలిని గాయపడ్డారు. ఆమె కారు మితిమీరిన వేగంతో వెళ్లడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని, చిన్నపాపచనిపోవడానికి కారణమయ్యారని తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement