ప్రముఖ హీరోయిన్ హేమమాలిని కూతురు ఈషా డియోల్ విడాకులు తీసుకుంది. తల్లి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె నటిగా పలు సినిమాల్లో కథానాయికగా చేసింది. మధ్యలో పెళ్లితో కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించినప్పటికీ.. ఓటీటీల్లో నటిస్తోంది. అలాంటిది ఈమె ఇప్పుడు విడాకులు తీసుకుందనే విషయం చర్చనీయాంశంగా మారిపోయింది.
(ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్)
బాలీవుడ్ టాప్ జోడీ ధర్మేంద్ర-హేమమాలినిల పెద్ద కూతురు ఈషా డియోల్. 21 ఏళ్ల వయసులోనే అంటే 2002లోనే 'కోయి మేరే దిల్ సే పూచే' అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 2008వరకు దాదాపు ఆరేళ్లలో 30కి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కాస్త స్పీడ్ తగ్గించింది. 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకుని ఓ మూడేళ్లు నటనకు బ్రేక్ ఇచ్చింది.
ఈషా-భరత్ దంపతులకు 2017లో అమ్మాయి పుట్టగా, 2019లో అబ్బాయి పుట్టాడు. ఏమైందో ఏమో గానీ గత కొన్నాళ్ల నుంచి ఈషా డియోల్, భర్త నుంచి విడాకులు తీసుకోనుందనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ వీళ్లిద్దరూ ప్రకటన ఇచ్చారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, పిల్లలు మాత్రం తమకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చారు. అయితే విడిపోవడానికి కారణం ఏంటనేది మాత్రం బయటకు చెప్పలేదు.
(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడేమో ఇలా?)
Comments
Please login to add a commentAdd a comment