ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్
ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్
Published Wed, Jun 7 2017 4:27 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM
హేమామాలిని కూతురు, బాలీవుడ్ నటి ఇషా డియోల్ త్వరలో అమ్మ కాబోతున్నది. ఇషా డియోల్-భరత్ తఖ్తానీ దంపతులు త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని గతంలోనే తల్లి హేమామాలిని ట్విట్టర్ లో వెల్లడించింది. తాజాగా బేబీ బంప్ తో ఉన్న ఇషా ఫొటో సోషల్ మీడియలో దర్శనమిచ్చింది.
ఇషా బాల్యపు స్నేహితురాలు శిలార్న వాజే అలియాస్ ఛెఫ్ చిన్నూ తామిద్దరి ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. చిన్నూ కూడా గర్భవతియే. ఇద్దరూ బేబీ బంప్ తో ఉన్న ఫొటోను దిగి పోస్టు చేసింది. తాము డబుల్ హ్యాపీగా ఉన్నట్టు ఈ ఫొటోకు కామెంట్ పెట్టింది. ఈ ఫొటో ఈషా అభిమానులను అలరిస్తోంది.
Advertisement
Advertisement