
బాలీవుడ్ నటి ఇషా డియోల్ పరిచయం అక్కర్లేని పేరు. హేమమాలిని వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ టాప్ జోడీ ధర్మేంద్ర-హేమమాలినిల పెద్ద కూతురే ఇషా. కేవలం 21 ఏళ్ల వయసులోనే 'కోయి మేరే దిల్ సే పూచే' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇషా.. గతంలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. పుణేలో తాను నటించిన దస్ మూవీ ప్రీమియర్ షోలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. అందరితో పాటు నేను కూడా ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లాను.. అదే సమయంలో ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడని ఇషా వెల్లడించింది. దీంతో వెంటనే అతన్ని చేయి పట్టుకుని లాగి అక్కడే చెంపదెబ్బ కొట్టానని.. ఇలాంటి వారిని అస్సలు ఉపేక్షించవద్దని ఆ సంఘటనను గుర్తు చేసుకుంది. నా చుట్టూ బౌన్సర్లు ఉన్నప్పటికీ ఇలా జరిగిందని పేర్కొంది. కాగా.. ఈషా చివరిసారిగా హంటర్ టూటేగా నహీ తోడేగా అనే షోలో కనిపించింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ హీరో హీరోయిన్ అనే చిత్రంలో కనిపించనుంది.
భర్తతో విడాకులు
కాగా.. హీరోయిన్ ఈషా డియోల్ కొద్ది నెలల క్రితమే విడాకులు తీసుకుంది. 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకున్న ఈమెకు రాధ్య, మిరాయ అని ఇద్దరు కూతుర్లున్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment