Ahana Deol
-
భర్తకు దూరంగా ఉండటంపై మొదటిసారి స్పందించిన హేమమాలిని
బీటౌన్ సీనియర్ నటుడు ధర్మేంద్ర హేమమాలినిని వివాహం చేసుకున్నప్పటికీ, తన మొదటి భార్య నుంచి ధర్మేంద్ర విడాకులు తీసుకోలేదు. దీంతో తన కుమార్తెలు ఈషా, అహ్నాలతో కలిసి ప్రస్తుతం హేమ ఉంటున్నారు. వీరిద్దరి వివాహం 1980లోనే అయింది. కానీ వేర్వేరు ఇళ్లలో ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భర్త నుంచి వేరుగా ఉండటంపై హేమమాలిని స్పందించారు. (ఇదీ చదవండి: పవన్ 'బ్రో' విషయంలో సీరియస్ అయిన థమన్..!) మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌తో ధర్మేంద్ర ఇంటర్వ్యూయర్ ఆమెను ఫెమినిస్ట్ ఐకాన్‌గా పరిగణిస్తూ.. మీరు ఒంటరిగా ఉండేందుకు ఇది కూడా ఒక కారణమనే చెప్పవచ్చా అనే ప్రశ్నకు హేమా ఇలా చెప్పుకొచ్చారు. 'నేను స్త్రీవాదానికి చిహ్నమా..? (నవ్వుతూ). ఎవరూ భర్తకు దూరంగా ఉండాలని కోరుకోరు. జీవితం ఏదిస్తుందో అది జరుగుతుంది. దానిని మనం స్వీకరించాల్సిందే. ప్రతి స్త్రీకి భర్త, పిల్లలు కావాలని కోరుకుంటుంది. కానీ ఎక్కడో ఆ లెక్కలు తప్పుతాయి. లేకపోతే, ఎవరికీ తమ జీవితాన్ని ఇలా గడపాలని అనిపించదు. అని హెమ తెలిపారు. 'బాధపడటం లేదు' 'భర్తకు దూరంగా ఉండటంలో నేను బాధపడటం లేదు. నాతో నేను సంతోషంగా ఉన్నాను. నాకు నా ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను వారిని చాలా బాగా పెంచాను. అయితే, అతను (ధర్మేంద్ర) ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. ప్రతిచోటా. పిల్లలకు తొందరగా పెళ్లి చేయాలి అని భయపడేవాడు. నేను ఇది జరుగుతుంది అనే చెప్పేదానిని. సరైన సమయం వచ్చినప్పుడు, సరైన వ్యక్తి వస్తాడు అని ఆయనకు ధైర్యం చెప్పేదాన్ని. భగవంతుడు, గురువుల ఆశీర్వాదంతో నా పిల్లల ఇద్దరి పెళ్లిల్లు అయిపోయాయి. మేమిద్దరం అనుకున్నది ప్రతిదీ జరిగింది.' అని హేమ అన్నారు. రెండో భార్య హేమమాలిని, పిల్లలతో ధర్మేంద్ర హేమమాలినిని ధర్మేంద్ర మొదటిసారి కలిసినప్పుడు ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్‌లకు ఇద్దరు కుమారులు - సన్నీ డియోల్,బాబీ డియోల్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు అజీత, విజేత ఉన్నారు. ఇటీవల, ధరమేంద్ర మనవడు కరణ్ డియోల్ వివాహం జరిగింది. హేమమాలిని కుటుంబం నుంచి ఎవరూ ఆ పెళ్లికి హాజరు కాలేదు. దీంతో భార్య, కుమార్తెల కోసం ఒక భావోద్వేగ పోస్ట్ కూడా ధర్మేంద్ర రాశారు. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్) -
ఇంట్లో పెళ్లికి డుమ్మా కొట్టిన భార్యాపిల్లలు.. సోషల్ మీడియాలో నటుడి భావోద్వేగం
బాలీవుడ్ నటదిగ్గజం ధర్మేంద్ర మనవడు కరణ్ డియోల్ ఓ ఇండివాడైన సంగతి తెలిసిందే! దృష ఆచార్యతో అతడు ఏడడుగులు నడిచాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే ఈ పెళ్లికి ధర్మేంద్ర భార్యాకూతురు డుమ్మా కొట్టారు. అదేంటి? కుటుంబంలోని వ్యక్తి పెళ్లికి రాకపోవడం ఏంటనుకుంటున్నారా? అయితే ముందు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలుసుకోవాల్సిందే! మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌తో ధర్మేంద్ర మొదటి భార్య.. నలుగురు సంతానం ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు. అతడు 19 ఏళ్ల వయసులోనే ప్రకాశ్ కౌర్‌ను పెళ్లాడాడు. వీరికి సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత, అజీత అని నలుగురు సంతానం. ఇటీవల పెళ్లి చేసుకున్న కరణ్.. సన్నీ డియోల్ తనయుడు! సుమారు 70 ఏళ్లుగా ధర్మేంద్ర- ప్రకాశ్ కౌర్ కలిసి జీవిస్తున్నారు. ఇకపోతే అతడికి పెళ్లైన విషయం తెలిసి కూడా నటి హేమమాలిని ధర్మేంద్రను ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు ఈషా, అహానా సంతానం. వీరిని సన్నీ డియోల్.. కరణ్ పెళ్లికి రావాలని ఆహ్వానించినప్పటికీ ఈ కుటుంబం మాత్రం వేడుకకు వచ్చేందుకు మొగ్గు చూపలేదు. పెళ్లి పందిట్లో హేమమాలిని, ఆమె కూతుర్లు ఎక్కడా కనిపించనేలేదు. ధర్మేంద్ర పిలవకపోవడంతోనే వాళ్లు రాలేదని ప్రచారం జరిగింది. రెండో భార్య హేమమాలిని, పిల్లలతో ధర్మేంద్ర పిలవనందుకే క్షమాపణలు! ఈ క్రమంలో ధర్మేంద్ర సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యాడు. 'హేమ, నా డార్లింగ్ పిల్లలు ఇషా, అహానా.. అల్లుళ్లు తక్తానీ, వోహ్రా.. మిమ్మల్ని నేను ఎంతగానో గౌరవిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వయసు పైబడటం, అనారోగ్యం నాకో విషయాన్ని గుర్తు చేశాయి. నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సింది. కానీ..' అంటూ వాక్యాన్ని సగంలోనే ఆపేస్తూ క్షమించండి అన్నట్లుగా చేతులు జోడించిన ఎమోజీని జత చేస్తూ పోస్ట్ పెట్టాడు. View this post on Instagram A post shared by Dharmendra Deol (@aapkadharam) చదవండి: రెండో భర్తకు విడాకులు.. కారణాలు అనవసరం అంటున్న నటి -
ఆమెకు వీడ్కోలు.. శ్రద్ధాతో రొమాన్స్, చివరకు.. ఆదిత్య రాయ్ బ్రేకప్ స్టోరీ
ఆదిత్య రాయ్ కపూర్..సినిమా హీరోగా కన్నా ప్రేమికుడిగానే ఫేమస్. అతని విఫల ప్రేమ గాథే ఈ ‘మొహబ్బతే’లో... సిద్ధార్థ రాయ్ కపూర్ తమ్ముడిగా కాకుండా సొంత గుర్తింపుతోనే రాణిస్తున్నాడు ఆదిత్య రాయ్ కపూర్. అలాంటి ఐడెంటిటీ, సింప్లిసిటీ తోవలోనే నడుస్తున్న అహానా డియోల్ అంటే మనసు పడ్డాడు. అహానా ఎవరంటే.. ధర్మేంద్ర, హేమమాలినిల రెండో కూతురు. అమ్మ, నాన్న ఫేమ్‌తో కాకుండా స్వీయ ప్రతిభతోనే గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయం.. ప్రయత్నం ఆమెది. అందుకే సంజయ్ లీలాభన్సాలీ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది. ‘గుజారిష్’ సినిమాకు పనిచేయసాగింది. ఆ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్ది కూడా ముఖ్య భూమిక. ఆ షూటింగ్‌లోనే ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఇద్దరి ఆలోచన, ఆచరణ ఒకటే అవడంతో త్వరగానే స్నేహం కుదిరింది. ‘గుజారిష్’ విడుదలయ్యేలోపు ఆ ఇద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించింది. చెట్టపట్టాల్, చాటింగ్, అవుట్స్కట్స్లో హ్యాంగవుట్స్ ఈ లవ్ స్టోరీలోనూ షెడ్యూల్ అయ్యాయి. ఈ ప్రేమను ఆశీర్వదించే వాళ్లకంటే ఆ జంటను చూసి ఆందోళన చెందిన వాళ్లే ఎక్కువ.. అయ్యో.. చక్కటి కెరీర్‌ను ప్రేమ పాశంతో కట్టేసుకుంటున్నారే అని. అయినా నాలుగేళ్లు ఆ మోహంలో పడి కొట్టుకుపోయారిద్దరూ. అప్పుడు కలగజేసుకున్నారు ఇరువైపు పెద్దలు. పని మీదే దృష్టిపెట్టండని హెచ్చరించారు. లక్ష్యం గుర్తొచ్చింది ఇద్దరికీ. కలల్లోంచి బయటకు వచ్చారు. ఇద్దరి గమ్యం ఒకటే అయినా కలిసి చేయాల్సిన ప్రయాణం కాదని అర్థం చేసుకున్నారు. స్నేహపూర్వకంగానే వీడ్కోలు చెప్పుకున్నారు తమ ప్రేమకు. విడివిడిగా ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. ఆ బ్రేకప్ తర్వాత.. ఆదిత్య రాయ్ మళ్లీ ప్రేమలో పడ్డాడు. శ్రద్ధా కపూర్‌తో. ‘ఆశికీ 2’ సినిమా సెట్స్ మీద. ఈ ఇద్దరూ కలసి నటించిన తొలి సినిమా అది. ఆ జంట కెమిస్ట్రీకి బాక్సాఫీస్ బ్రహ్మరథం పట్టింది. ఆ సినిమా విషాదంతం కావడంతో బాధపడ్డారు. నిజ జీవితంలో ఈ ఇద్దరు జతకూడితే బాగుండు అని ఆశపడ్డారు అభిమానులు. వాళ్లు ఆశించినట్టుగానే మిత భాషి అయిన ఆదిత్యకు గలగలా మాట్లాడుతూ చలాకీగా ఉండే శ్రద్ధా అంటే ఇష్టం ఏర్పడింది. అలా ఆమె తన ఎదురుగా ఉండి మాట్లాడుతుంటే చాలు.. అంతకన్నా జీవితానికింకేం కావాలి అనుకున్నాడు. ఆ మాటే ఆమెతో చెప్పాడు. స్వచ్ఛమైన నవ్వుతో ‘ఓకే’ అంది. ఆ ప్యార్ కంటిన్యూ అయింది. లేట్ నైట్ పార్టీలు.. ఏ కొంచెం టైమ్ దొరికినా ఏకాంతవాసాలు.. హాలీడేయింగ్లతో కాలాన్ని క్వాలిటీగా మలచుకున్నారు. పెళ్లితో శుభం కార్డ్ వేసుకుంటారనే భావించారు బాలీవుడ్ జనాలు. అయితే.. ‘ఆశికీ 2’ సినిమా స్క్రిప్ట్లాగే సాగింది వాళ్ల ప్రేమ కథ. శ్రద్ధా కపూర్ నటించిన సినిమాలు సక్సెస్ అవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ పైకి వెళ్లిపోయింది. ఆదిత్య రాయ్ కపూర్‌కు మాత్రం ఇంకా స్ట్రగుల్ తప్పలేదు. అతని మనసులో ఎక్కడో ఓడిపోతున్న భావన. తగ్గట్టుగానే శ్రద్ధా తల్లిదండ్రులు ఆమె మీద ఆంక్షలు పెట్టారట.. ఆదిత్యతో చెలిమికి హద్దులు పెట్టుకోమని. శ్రద్ధా లెక్క చేయకపోయినా.. ఆదిత్య గ్రహించాడు. ఏ చలాకితనాన్నయితే జీవితాంతం తోడుగా కావాలనుకున్నాడో ఆ చలాకితనం నుంచి దూరం కోరుకోసాగాడు. ఆమె సక్సెస్ అతనిలో ఆత్మన్యూనత పెంచసాగింది. అది అసూయగా మారకముందే ఆ బంధంలోంచి బయటపడాలనుకున్నాడు. ఆదిత్యను అర్థం చేసుకున్న శ్రద్ధా అతనికి స్పేస్ ఇచ్చింది. పక్కకు తప్పుకున్నాడు. అతని నిర్ణయాన్ని గౌరవించింది ఆమె. అలా ఇద్దరూ విడిపోయారు. కాని మంచి స్నేహితులుగా మిగిలిపోయారు. అయితే..ఈ జంట తమ ప్రేమ కథను ఎప్పుడూ ఒప్పుకోలేదు. చాలా పత్రికలు.. చానెళ్లు వాళ్ల మధ్య ఉన్న చనువు గురించి ప్రశ్నల వర్షం కురిపించినా బయటపడలేదు. ‘నేను సింగిలే. నా రిలేషన్షిప్ స్టేటస్ మారలేదు. నా దృష్టిలో ప్రేమ ఒక బాధ్యత. ఆ బాధ్యతను మోసేందుకు సిద్ధమయ్యాకే నచ్చిన మనిషితో కమిట్ అవుతా. ప్రస్తుతానికి నేను, శ్రద్ధా గుడ్ ఫ్రెండ్స్‌మి అంతే’ అని ఆదిత్య రాయ్ కపూర్, ‘ఆశికీ 2 సినిమా షూటింగప్పుడు, తర్వాత.. మాకు మంచి అనుభూతులను మిగిల్చింది. మాకు అంటే నాకు, ఆదిత్యకే కాదు మోహిత్ సూరి (దర్శకుడు)కి కూడా. అలా ఆ సినిమా మమ్మల్ని మంచి స్నేహితులుగా మార్చింది. స్నేహం తప్ప మా మధ్య ఇంకేం లేదు. ఆ స్నేహాన్ని జీవితాంతం కాపాడుకుంటాం’ అని శ్రద్ధా కపూర్ చెప్పారు. - ఎస్సార్ -
‘ఆహనా’ పెళ్లంటూ..
ఒకప్పటి బాలీవుడ్ అందాల నటి హేమామాలిని, కండల వీరుడు ధర్మేంద్ర చిన్న కుమార్తె ఆహనా డియోల్ పెళ్లి రిసెప్షన్ ఢిల్లీలో అంగరంగవైభవంగా జరిగింది. ఆహనా వివాహం ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ వోరాతో ముంబైలో ఈ నెల రెండో తేదీన జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని కపషేరా సరిహద్దులో ఉన్న పెళ్లికొడుకు ఫాంహౌస్‌లో బుధవారం రిసెప్షన్‌ను భారీగా హంగులతో ఏర్పాటుచేశారు. ఇక్కడ జరిగిన వేడుకలో సినీ రంగానికి చెందిన నటుడు ప్రతీక్ బబ్బర్ మాత్రమే కనిపించారు. ఆహనా పెద్దక్క అయిన ఈషా తన భర్త భరత్ తక్తానీ సహా సందడి చేసింది. రిసెప్షన్‌కు ఎల్కే అద్వానీ, ఫరూక్ అబ్దుల్లా, రాజీవ్ శుక్లా, అబ్దుల్లా, రేణుకా చౌదరి, సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, ప్రఫుల్ పాటిల్, సురేష్ కల్మాడీ వంటి వివిధ పార్టీలకు చెందిన బడా రాజకీయ నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ముంబైలో ఈ నూతన జంట ఇచ్చిన రిసెప్షన్‌కు బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అతడి భార్య జయ, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్, రేఖా, దీపికా పడుకొనే, సోనాక్షి సిన్హా తదితరులు హాజరైన విషయం తెలిసిందే. కాగా, ఆహనా డియోల్‌కు వరుసకు సోదరులైన సన్నీ, బాబీడియోల్లు ముంబై, ఢిల్లీలో జరిగిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకపోవడం గమనార్హం. -
దీపికా,రణవీర్‌లు అలా చేశారట!
దీపికా పదుకొనే, రణవీర్ రొమాన్స్, అఫైర్‌పై వస్తున్న వార్తల్లో కొతేమి లేదు. ‘రామ్‌లీలా’ చిత్రం షూటింగ్లో దగ్గరైన వీరిద్దరూ మధ్య బంధం మరింత బలంగా మారిందని తరచుగా గాసిప్స్ రూపంలో వార్తలు వింటునే ఉన్నాం. అయితే వీరద్దరూ ఒకర్ని విడిచి మరొకరు ఉండడంలేదనే వార్తకు ధర్మెంద్ర, హేమామాలిని ముద్దుల కూతురు అహనా డియోల్ పెళ్లి మరింత బలం చేకూర్చింది. పెళ్లిలో దీపికా, రణ్‌వీర్‌ల హడావిడి కొత్త జంటను కూడా సిగ్గుపడేలా చేసిందట. పెళ్లికి హాజరైన వీరిద్దరూ ఒకరిచేతులో మరొకరు చేతులు వేసుకుని.. క్షణమైనా విడిచి ఉండలేమనే భావనను కలిగించారట. కలిసి ముచ్చటిస్తూ, ఒకరి చెవిలో మరొకరు గుసగుసలు, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇద్దరూ అతిధులకు ఆనందాన్ని పంచినట్టు ప్రత్యక్ష సాక్ష్యుల కథనం. అంతేకాకుండా వేదికపై రామ్‌లీలా, గుండే చిత్రాల్లోని పాటలకు జోష్‌తో స్టేప్పులేసి ఆనందంలో మునిగి తేలారు. చాన్స్ దొరికినప్పుడల్లా దీపికాను ముద్దులతో రణ్వీర్ ముంచెత్తారట. -
సోదరి వివాహానికి బాబీ, సన్నీడియోల్ దూరం!
సోదరి ఇషా డియోల్ పెళ్లికి గైర్హాజరైన సన్నీ, బాబీ డియోల్ లు అహనా పెళ్లికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలనాటి బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, ప్రకాశ్జీల సంతానం సన్నీ, బాబీ డియోల్ కాగా, ధర్మేంద్ర రెండవ భార్య సినీనటి హేమమాలినిలకు ఇషా, అహనా డియోలు ఇద్దరు కూతుళ్లు. ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్న కారణంగా 2012 లో జరిగిన ఇషా డియోల్ వివాహానికి హాజరుకాలేదు. అయితే అహనా పెళ్లికి హాజరుకాకపోవడం వెనుక ఎలాంటి కారణాలు లేవని సన్నిహితులు వెల్లడించారు. ఇషా, అహనా, బాబీ, సన్నీ డియోల మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయన్నారు. అహనా పెళ్లి కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన మెహందీ వేడుకలో ఇషా డియోల్ జారి కింద పడిపోవడంతో ఆమె భుజానికి స్వల్పంగా గాయమైంది. చేతికి ఉన్న కట్టుతోనే వివాహ వేడుకల్లో ఇషా హడావిడి చేస్తోంది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ వోరా తో అహనా వివాహం ఆదివారం సాయంత్రం ముంబైలోని ఐటీసీ మరాఠాలో జరుగనుంది. ఈ వివాహానికి బాలీవుడ్ కు చెందిన షారుక్ ఖాన్ తోపాటు పలువురు తారలు, రాజకీయ నేతల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, రాజ్ థాకరేలు హాజరుకానున్నారు. -
హేమమాలిని కూతురి మెహందీ ఫంక్షన్