దీపికా,రణవీర్‌లు అలా చేశారట!
దీపికా పదుకొనే, రణవీర్ రొమాన్స్, అఫైర్‌పై వస్తున్న వార్తల్లో కొతేమి లేదు. ‘రామ్‌లీలా’ చిత్రం షూటింగ్‌లో దగ్గరైన వీరిద్దరూ మధ్య బంధం మరింత బలంగా మారిందని తరచుగా గాసిప్స్ రూపంలో వార్తలు వింటునే ఉన్నాం. అయితే వీరద్దరూ ఒకర్ని విడిచి మరొకరు ఉండడంలేదనే వార్తకు ధర్మెంద్ర, హేమామాలిని ముద్దుల కూతురు అహనా డియోల్ పెళ్లి మరింత బలం చేకూర్చింది. పెళ్లిలో దీపికా, రణ్‌వీర్‌ల హడావిడి కొత్త జంటను కూడా సిగ్గుపడేలా చేసిందట.
పెళ్లికి హాజరైన వీరిద్దరూ ఒకరిచేతులో మరొకరు చేతులు వేసుకుని.. క్షణమైనా విడిచి ఉండలేమనే భావనను కలిగించారట. కలిసి ముచ్చటిస్తూ, ఒకరి చెవిలో మరొకరు గుసగుసలు, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇద్దరూ అతిధులకు ఆనందాన్ని పంచినట్టు ప్రత్యక్ష సాక్ష్యుల కథనం. అంతేకాకుండా వేదికపై రామ్‌లీలా, గుండే చిత్రాల్లోని పాటలకు జోష్‌తో స్టేప్పులేసి ఆనందంలో మునిగి తేలారు. చాన్స్ దొరికినప్పుడల్లా దీపికాను ముద్దులతో రణ్‌వీర్ ముంచెత్తారట.