పచ్చని కుటుంబం చిన్నాభిన్నం కావడానికి ఆడవాళ్లే కారణం కాదంటోంది సీనియర్ నటి అరుణ ఇరానీ. మగవాళ్లే ఇల్లాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారని, కానీ వారిని పక్కనపెట్టి ఇతర మహిళలనే లోకం తప్పుపడుతోందని చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆడవాళ్లు తమ కాపురాలు కూలిపోవడానికి మరో ఆడదే కారణం అని వారిని తిడుతుంటారు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి.. మిమ్మల్ని సంతోషంగా ఉంచే బాధ్యత మీ భర్తది కానీ వేరేవాళ్లది ఎలా అవుతుంది? ముందు అతడిని అదుపులో పెట్టండి. కేవలం ఒకరి సంసారాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఏ అమ్మాయి వివాహేతర సంబంధానికి పూనుకోదు.
ఉదాహరణకు హేమమాలినిని తీసుకోండి. ఆమె ధర్మేంద్ర కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాన్న ఉద్దేశంతో అతడిని పెళ్లి చేసుకుందా? కాదు కదా! ఏదో ఒక కాగితం మీద రాసుకున్నదాన్ని బట్టి అతడు నా భర్త, ఆమె నా భార్య అంటుంటారు, కానీ ఆ పేపర్‌కు పెద్ద విలువేమీ ఉండదు. ప్రేమకు ఉన్న సెక్యూరిటీ పెళ్లికి లేదు. ప్రేమ లేనిచోట పెళ్లి చేసుకున్నా వృధానే.. అయినా ఆల్‌రెడీ పెళ్లైన మగవారితో మళ్లీ ఏడడుగులు నడవడం అంత సులువైన విషయం కాదు. అర్ధరాత్రి నా బిడ్డకేదైనా అయితే ఆ మనిషికి నేను ఫోన్ చేయలేను. అలాంటి బాధలు పడటం ఎందుకని పిల్లలు వద్దనుకున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా అరుణ ఇరానీ 1990లో ఫిలింమేకర్ కుకు కోహ్లిని పెళ్లాడింది. అప్పటికే అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన నటి, కొడుకుతో కలిసి విదేశాలకు
Comments
Please login to add a commentAdd a comment