అవెంజర్స్‌ : థానోస్‌గా స్వామి నిత్యానంద..! | Avengers Spoof Video Swami Nityanand As Thanos | Sakshi
Sakshi News home page

అవెంజర్స్‌ : థానోస్‌గా స్వామి నిత్యానంద..!

Published Mon, Apr 29 2019 8:09 PM | Last Updated on Mon, Apr 29 2019 8:37 PM

Avengers Spoof Video Swami Nityanand As Thanos - Sakshi

థానోస్‌ ఆటలు కట్టించేందుకు లక్షలాది మార్గల్లో యత్నించే డాక్టర్‌ స్ట్రేంజ్‌ను నిత్యానంద అలవోకగా ఓడిస్తాడు.

మార్వెల్‌ సంస్థ తెరకెక్కించిన సూపర్‌ హీరో సీరిస్‌లో చివరి సినిమా అవడంతో అవెంజర్స్‌ ; ఎండ్‌గేమ్‌కు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. హాలీవుడ్‌తో పాటు చైనా, భారత్‌లాంటి ఆసియా దేశాల్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇక సూపర్‌ హీరోస్‌ అందరూ కలిసి విలన్‌ థానోస్‌ను ఎలా అంతమొందించారనేదే అవెంజర్స్‌ ; ఎండ్‌గేమ్‌ కథ. అయితే, ఇండియాలో మాత్రం మరో థానోస్‌ పుట్టుకొచ్చాడు. ఓ కథానాయికతో శంగారకేళీలు సాగిస్తూ దొరికిపోయిన స్వామి నిత్యానందే థానోస్‌. తనను తాను దేవుని బిడ్డను అని చెప్పుకునే నిత్యానందను విలన్‌గా చూపిస్తూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.
(చదవండి : బాహుబలిని దాటలేకపోయిన ‘అవెంజర్స్‌’)

అవెంజర్స్‌ ; ఇన్ఫినిటీ వార్‌ సినిమాలో కథానాయకుడు డాక్టర్‌ స్ట్రేంజ్‌, విలన్‌ థానోస్‌ మధ్య జరిగే ఫైట్‌ సీన్‌కు స్పూఫ్‌గా వచ్చిన ఈ వీడియోలో నిత్యానందను అతీతమైన శక్తులుగల వాడిగా చూపించారు. ఇక థానోస్‌ ఆటలు కట్టించేందుకు లక్షలాది మార్గల్లో యత్నించే డాక్టర్‌ స్ట్రేంజ్‌ను నిత్యానంద అలవోకగా ఓడిస్తాడు. మంత్ర శక్తితో మట్టికరిపిస్తాడు. కొంతకాలం క్రితం తనకు మూడో కన్ను ఉందని, దైవ రహస్యాలు తెలుసునని నిత్యానంద చెప్పిన విషయం తెలిసిందే. పశువులకు తమిళ, సంస్కృత భాషలు కూడా నేర్పిస్తానని చెప్పుకొచ్చాడు. ‘అవెజంర్స్‌ రీలోడెడ్‌ ; 2020 సినిమా ట్రైలర్‌ను అప్పుడే విడుదల చేశారా’ అంటూ ఒకరు, అసలైన ఎండ్‌గేమ్‌ ఇదేనంటూ మరొకరు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement