
అమెరికాలో కురుస్తున్న మంచు తుపాను కారణంగా హాలీవుడ్ స్టార్ నటుడు ప్రమాదానికి గురయ్యారు. ది అవెంజర్స్ నటుడు, కెప్టెన్ అమెరికా ఫేమ్ స్టార్ యాక్టర్ జెరెమి రెన్నర్‌కు ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నటుడిని వెంటనే స్థానికులు అతడిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ వార్త విన్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జెరెమి రెన్నర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ఇటీవల అమెరికాలో మంచు తుపాను కారణంగా దారుణ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. దీంతో అవి తొలగించటానికి అక్కడి ప్రజలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచును తొలగిస్తుండగా హాలీవుడ్ స్టార్ యాక్టర్, అవెంజర్స్ ఫేమ్ జెరెమి రెన్నర్ ప్రమాదానికి గురయ్యారు. తన భారీ వాహనంతో మంచును తొలగిస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment