Jeremy Renner
-
నా 30 ఎముకలు విరిగిపోయాయి.. మీ అందరికీ కృతజ్ఞతలు
మంచు తొలగిస్తూ తీవ్ర గాయాల పాలైన హాలీవుడ్ స్టార్ హీరో జెరెమీ రెన్నర్. ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు. తాజాగా ఆయన తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఓ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కొత్త ఏడాదిలో తెల్లవారుజామున మంచు ప్రమాదంలో జెరెమీ రెన్నర్ తీవ్రంగా గాయపడ్డారు. జెరెమీ రెన్నర్ తన ఇన్స్టాలో రాస్తూ..'న్యూ ఇయర్ రోజున మంచు గడ్డల కింద నలిగిపోయా. నా 30 ఎముకలు విరిగిపోయాయి. కొత్త ఏడాదిలో రిజల్యూషన్లు అన్నీ ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నా. కానీ నా కుటుంబంలో విషాదం నింపింది. కానీ మీ అందరి ప్రేమతో మళ్లీ కోలుకుంటున్నా. త్వరలోనే బలంగా తిరిగివస్తా' అంటూ ఆసుపత్రి బెడ్లో డాక్టర్ తన కాలును చాచి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Jeremy Renner (@jeremyrenner) -
కొంపముంచిన మంచు.. స్టార్ నటుడి పరిస్థితి విషమం
అమెరికాలో కురుస్తున్న మంచు తుపాను కారణంగా హాలీవుడ్ స్టార్ నటుడు ప్రమాదానికి గురయ్యారు. ది అవెంజర్స్ నటుడు, కెప్టెన్ అమెరికా ఫేమ్ స్టార్ యాక్టర్ జెరెమి రెన్నర్కు ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నటుడిని వెంటనే స్థానికులు అతడిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ వార్త విన్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జెరెమి రెన్నర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇటీవల అమెరికాలో మంచు తుపాను కారణంగా దారుణ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. దీంతో అవి తొలగించటానికి అక్కడి ప్రజలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచును తొలగిస్తుండగా హాలీవుడ్ స్టార్ యాక్టర్, అవెంజర్స్ ఫేమ్ జెరెమి రెన్నర్ ప్రమాదానికి గురయ్యారు. తన భారీ వాహనంతో మంచును తొలగిస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది.