![Jeremy Renner broke over 30 bones in deadly snow plough accident - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/22/jeremy.gif.webp?itok=kcfpyH9E)
మంచు తొలగిస్తూ తీవ్ర గాయాల పాలైన హాలీవుడ్ స్టార్ హీరో జెరెమీ రెన్నర్. ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు. తాజాగా ఆయన తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఓ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కొత్త ఏడాదిలో తెల్లవారుజామున మంచు ప్రమాదంలో జెరెమీ రెన్నర్ తీవ్రంగా గాయపడ్డారు.
జెరెమీ రెన్నర్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'న్యూ ఇయర్ రోజున మంచు గడ్డల కింద నలిగిపోయా. నా 30 ఎముకలు విరిగిపోయాయి. కొత్త ఏడాదిలో రిజల్యూషన్‌లు అన్నీ ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నా. కానీ నా కుటుంబంలో విషాదం నింపింది. కానీ మీ అందరి ప్రేమతో మళ్లీ కోలుకుంటున్నా. త్వరలోనే బలంగా తిరిగివస్తా' అంటూ ఆసుపత్రి బెడ్‌లో డాక్టర్ తన కాలును చాచి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment