Avengers Infinity War
-
మళ్ళీ అవెంజర్స్ కి మంచి రోజులు వస్తాయి.?
-
కొంపముంచిన మంచు.. స్టార్ నటుడి పరిస్థితి విషమం
అమెరికాలో కురుస్తున్న మంచు తుపాను కారణంగా హాలీవుడ్ స్టార్ నటుడు ప్రమాదానికి గురయ్యారు. ది అవెంజర్స్ నటుడు, కెప్టెన్ అమెరికా ఫేమ్ స్టార్ యాక్టర్ జెరెమి రెన్నర్కు ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నటుడిని వెంటనే స్థానికులు అతడిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ వార్త విన్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జెరెమి రెన్నర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇటీవల అమెరికాలో మంచు తుపాను కారణంగా దారుణ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. దీంతో అవి తొలగించటానికి అక్కడి ప్రజలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచును తొలగిస్తుండగా హాలీవుడ్ స్టార్ యాక్టర్, అవెంజర్స్ ఫేమ్ జెరెమి రెన్నర్ ప్రమాదానికి గురయ్యారు. తన భారీ వాహనంతో మంచును తొలగిస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. -
యువతను ఆకట్టుకునేలా హాలీవుడ్ సినిమా రేంజ్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్
Punjab Chief Minister Charanjit Singh Channi portrayed as superhero Thor: కరోనా మహమ్మారి సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఎలక్షన్ కమిషన్ రోడ్ షోలు, ర్యాలీలను నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తమదైన వ్యూహాలతో ప్రజలను ఆకర్షించేలా ప్రచారాలకు సనద్దమయ్యారు. అందులో భాగంగానే పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ని స్ఫూర్తిగా తీసుకుంది. అయితే మార్వెల్ కామిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ హాలీవుడ్ చిత్రంలో క్రిస్ హేమ్స్‌వర్త్, మార్క్ రుఫాలో, క్రిస్ ఎవాన్స్, తదితర నటులు నటించారు. ఈ మేరకు ఈ అవెంజర్స్ చిత్రంలో థోర్స్ పాత్రలో చరణ్ జిత్ సింగ్ చన్నీ ముఖాన్ని, రాహుల్ గాంధీని బ్రూస్ బ్యానర్ అకా ది హల్క్‌గా ఒక యుద్ధ సన్నివేశానికి సంబంధించిన వీడియోని చిత్రీకరించారు. అయితే ఇందులో నవజ్యోత్ సింగ్ సిద్ధూని కెప్టెన్ అమెరికాతో పోల్చారు. అంతేకాదు ఈ అవెంజర్స్ సినిమాలో దేవుళ్ల సినిమాల్లో ఉన్నట్టుగా ఉరుములు మెరుపులతో కూడి యుద్దం చేస్తున్న సన్నీవేశాన్ని చిత్రీకరించారు. ఆ వీడియోలో నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖాలను గ్రహాంతరవాసుల పాత్రలతో వారిని శత్రువులుగా చిత్రీకరించారు. పైగా పంజాబ్‌లో లోక్ కాంగ్రెస్ అనే తన సొంత పార్టీని స్థాపించిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ (సీఏడీ) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌లను దుష్ట గ్రహాంతరవాసులు పాత్రలుగా చిత్రీకరించారు. బ్యాక్ గ్రౌండ్లో థీమ్ సాంగ్‌తో మిస్టర్ చన్నీ ఎంట్రీ అయ్యి స్టార్మ్బ్రేకర్(గొడ్డలి ఆకారంలో ఉండే ఆయుధం)ని ఉపయోగించి గ్రహాంతరవాసులందరి గొంతులను కోస్తున్నట్టుగా వీడియో రూపోందించారు. పంజాబ్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దుష్టశక్తుల నుండి తమ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఏమైన చేస్తాం అని వీడియో చివరలో వినిపిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు హాలీవుడ్ అవెంచర్స్ మూవీలోని యుద్ధ సన్నివేశాన్ని ఎడిట్ చేసిన క్లిప్పింగ్ వీడియోతోపాటు "పంజాబ్‌లో కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి వస్తుంది" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ హాలీవుడ్ మూవీకి భారతదేశంలో విపరీతమైన అభిమానులు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లోని యువత ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాన్ని ఎంచుకుంది. ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బాలీవుడ్ పాట 'మస్త్ కలందర్'ను ఎడిట్ చేసిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. We will do whatever it takes to redeem our beloved state from the clutches of evil forces working against the interest of Punjab and its people. #CongressHiAyegi pic.twitter.com/6lVxqkN4VC — Punjab Congress (@INCPunjab) January 24, 2022 -
ఆ సినిమా కోసం రూ. 524 కోట్లు తీసుకున్నాడట
ప్రపంచవ్యాప్తంగా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ ఫీవర్ పట్టుకుంది. ఈ సూపర్ హీరో సిరీస్‌లో ఇదే లాస్ట్ సినిమా కావడంతో వసూళ్లు కూడా భారీగానే ఉన్నాయ్. ఇప్పటికే ఎండ్‌గేమ్ ప్రపంచవ్యాప్తంగా రూ. 8000 కోట్లు వసూళ్లు సాధించినట్లు సమాచారం. అంతేకాక ఈ సినిమాలో నటించిన వారికి కూడా భారీ పారితోషికాలే అందినట్లు సమాచారం. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ వసూళ్ల నుంచి వచ్చే మొత్తంలో వాటా కావాలని రాబర్ట్ డౌనీ జూనియర్ ముందుగానే మార్వెల్ సంస్థ అధినేత కెవిన్ ఫీజ్‌తో ఒప్పందం చేసుకున్నారట. ఇక అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కోసం డౌనీ ఏకంగా 75 మిలియన్ అమెరికన్ డాలర్ల(రూ. 524 కోట్లు) భారీ పారితోషికాన్ని తీసుకున్నట్లు సమాచారం. దాంతో హాలీవుడ్లో ఇంత భారీ పారితోషికం అందుకున్న అతి కొద్ది మంది నటుల్లో రాబర్ట్ డౌనీ ఒకరుగా నిలిచారు. అవెంజర్స్ సిరీస్‌లో రాబర్డ్ డౌనీ ఐరన్ మ్యాన్ పాత్ర పోషించాడు. ఇక ఎండ్‌గేమ్ సినిమాలో కూడా రాబర్డ్ డౌనీయే లీడ్ రోల్ పోషించాడు. అంతేకాక స్పైడర్ మ్యాన్ హోం కమింగ్ సినిమాలో కూడా డౌనీ కూడా కనిపిస్తాడు. అయితే ఈ చిత్రం కోసం కేవలం మూడు రోజులు మాత్రమే పని చేసిన డౌనీ ఒక్క రోజుకు 5 మిలియన్ డాలర్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇక ‘అవెంజర్స్’లో థార్ పాత్రలో నటించిన క్రిస్ హెమ్స్‌వర్త్ ఈ సిరీస్ నుంచి ఐదు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ డీల్ నుంచి హెమ్స్‌వర్త్‌కు ముట్టిన మొత్తం 15 మిలియన్ డాలర్ల నుంచి 20(రూ. 139 కోట్లు ) మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. కెప్టెన్ అమెరికా పాత్రలో నటించిన క్రిస్ ఇవాన్స్ కూడా దాదాపు 20 మిలియన్ డాలర్ల మొత్తాన్ని పారితోషికంగా తీసుకున్నారు. -
అవెంజర్స్ : థానోస్‌గా స్వామి నిత్యానంద..!
మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హీరో సీరిస్‌లో చివరి సినిమా అవడంతో అవెంజర్స్ ; ఎండ్‌గేమ్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. హాలీవుడ్‌తో పాటు చైనా, భారత్‌లాంటి ఆసియా దేశాల్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇక సూపర్ హీరోస్ అందరూ కలిసి విలన్ థానోస్‌ను ఎలా అంతమొందించారనేదే అవెంజర్స్ ; ఎండ్‌గేమ్ కథ. అయితే, ఇండియాలో మాత్రం మరో థానోస్ పుట్టుకొచ్చాడు. ఓ కథానాయికతో శంగారకేళీలు సాగిస్తూ దొరికిపోయిన స్వామి నిత్యానందే థానోస్. తనను తాను దేవుని బిడ్డను అని చెప్పుకునే నిత్యానందను విలన్‌గా చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. (చదవండి : బాహుబలిని దాటలేకపోయిన ‘అవెంజర్స్’) అవెంజర్స్ ; ఇన్ఫినిటీ వార్ సినిమాలో కథానాయకుడు డాక్టర్ స్ట్రేంజ్, విలన్ థానోస్ మధ్య జరిగే ఫైట్ సీన్‌కు స్పూఫ్గా వచ్చిన ఈ వీడియోలో నిత్యానందను అతీతమైన శక్తులుగల వాడిగా చూపించారు. ఇక థానోస్ ఆటలు కట్టించేందుకు లక్షలాది మార్గల్లో యత్నించే డాక్టర్ స్ట్రేంజ్‌ను నిత్యానంద అలవోకగా ఓడిస్తాడు. మంత్ర శక్తితో మట్టికరిపిస్తాడు. కొంతకాలం క్రితం తనకు మూడో కన్ను ఉందని, దైవ రహస్యాలు తెలుసునని నిత్యానంద చెప్పిన విషయం తెలిసిందే. పశువులకు తమిళ, సంస్కృత భాషలు కూడా నేర్పిస్తానని చెప్పుకొచ్చాడు. ‘అవెజంర్స్ రీలోడెడ్ ; 2020 సినిమా ట్రైలర్‌ను అప్పుడే విడుదల చేశారా’ అంటూ ఒకరు, అసలైన ఎండ్‌గేమ్ ఇదేనంటూ మరొకరు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. The asli Avengers Endgame. pic.twitter.com/h1ZrjdYWTa — Kaveri (@ikaveri) 29 April 2019 -
గూగుల్‌లో థానోస్ అని సెర్చ్ చేస్తే ఏమౌతుందో తెలుసా?
ట్రెండింగ్‌లో ఉన్న విషయాలను క్యాష్ చేసుకోవటంలో గూగుల్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అవెంజర్స్ ఎండ్‌గేమ్ రిలీజ్ రోజున ఓ సరికొత్త మేజిక్‌ను గూగుల్ యూజర్స్ అనుభూతి చెందేలా చేసింది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమా చూసిన వారికి క్లైమాక్స్ గుర్తుండే ఉంటుంది. థానోస్ తన హ్యాండ్ గ్లౌజ్‌తో చిటికె వేయగానే కొన్ని పాత్రలు బూడిదలా మారి వాష్ అవుట్ అవుతాయి.. ఇది సీను. ఇక విషయానికి వస్తే గూగుల్‌లో సెర్చ్ ఇంజన్(కంప్యూటర్, మొబైల్)లో మనం థానోస్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకు థానోస్ చేతికి ధరించే హ్యాండ్ గ్లౌజ్.. రైట్ సైడ్‌లో కన్పిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే.. అది ఒక చిటికె వేస్తుంది. అప్పుడు జరగుతుందో మేజిక్. గూగుల్ తెరపై కనిపించే సెర్చ్ రిజల్ట్స్‌లో చాలా వరకు మాయం అవుతాయి. అప్పటి వరకు లక్షల్లో చూపిస్తున్న సెర్చ్ రిజల్ట్స్ సైతం దారుణంగా కిందకు పడిపోతాయి. Do a google search for Thanos Click the infinity gauntlet Search results: Mr search engine, I don't feel so good..#ENDGAME #Thanos pic.twitter.com/FM6rxk5h7l — Albert Aydin (@albertaydin) April 24, 2019 -
‘అంతమయ్యే ఆట’కు.. అంతులేని జనాలు
‘అవేంజర్స్ ఎండ్‌గేమ్’ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దీనికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. టికెట్ల కోసం జనాలు క్యూ కడుతున్నారు. బుధవారం ఈ సినిమా టికెట్లకు ఓపెనింగ్ మొదలు కావడంతో నగరంలోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద ఉదయం 7 గంటల నుంచే కి.మీ మేర యువత బారులు తీరారు. మార్వెల్ సిరీస్‌లో అవేంజర్ సినిమాలో ఇది చివరిది. దీంతో ఈ చిత్రానికి హైప్ క్రియేట్ అయింది. కొంత మంది తల్లులు తమ పిల్లల కోసం కూడా క్యూలో నిల్చోవడం విశేషం. -
రజనీ ఐరన్‌మేన్.. సల్మాన్ హల్క్
.. పాత్రలకు బాగా సెట్ అవుతారని అభిప్రాయపడ్డారు ‘అవెంజర్స్’ దర్శకుడు జోయి రుస్సో. ‘అవెంజర్స్’ సిరీస్‌లో వస్తున్న చివరి చిత్రం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’. ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా ఏప్రిల్ 26న రిలీజ్ కానుంది. ‘ఇన్ఫినిటీ వార్’ కేవలం ఇండియాలోనే సుమారు 200 కోట్లుపైగా వసూలు చేసింది. ‘ఎండ్ గేమ్’ ప్రమోషన్స్ కోసం ఇండియా వచ్చిన దర్శకుడు జోయి రుస్సో ఇండియన్ సినిమాల గురించి మాట్లాడుతూ – ‘‘కొన్నాళ్లుగా ‘అవెంజర్స్’ సినిమాలతోనే స్పెండ్ చేస్తున్నాను. ప్రపంచ సినిమా చూసే తీరక కూడా లేదు. ‘అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్స్’ చిత్రంలో ఓ యాక్షన్ సన్నివేశానికి రజనీకాంత్ నటించిన ‘యందిరన్’ (రోబో) క్లైమాక్స్ స్ఫూర్తినిచ్చింది’’ అన్నారు. మరి అవెంజర్స్ పాత్రల్లో రజనీకాంత్‌ను, సల్మాన్‌ఖాన్‌ను నటింపజేయాలనుకుంటే ఏ పాత్రలు వాళ్లకు సూట్ అవుతాయి అనే ప్రశ్న ఆయన ముందుంచితే– ‘‘రజనీ ఐరన్‌మేన్, సల్మాన్ హల్క్ పాత్రల్లో బావుంటారు’’ అన్నారు. -
సూపర్... సూపర్... సూపర్... హీరో
ప్రపంచాన్ని అంతం చేయడానికి ఎన్ని శక్తులు పుట్టుకొచ్చినా వాటిని అంతమొందించేందుకు ఒక హీరో పుట్టుకొస్తాడు. విలన్‌కే అంత పవర్ ఉంటే హీరోకు ఇంకెంత పవర్ ఉండాలి? సూపర్ పవర్ ఉండాలి కదూ? అలాంటి సూపర్ పవర్స్‌తో మనల్ని సంవత్సరాలుగా కట్టిపడేస్తోన్న సూపర్ హీరోలందరూ ఒకేసారి తెరపై కనిపిస్తే? ఆ సంబరం ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. ‘ఐరన్‌మేన్’, ‘స్పైడర్‌మేన్’, ‘కెప్టెన్ అమెరికా’, ‘బ్లాక్‌పాంథర్’.. ఇలా సూపర్ హీరోలుగా ఎన్నో అడ్వెంచర్స్ చేసి మనల్ని మెప్పించిన సూపర్ హీరో క్యారెక్టర్స్ అందరూ ఏకమై ఒక పెద్ద శక్తిపై పోరాడేందుకు చేసే యుద్ధమే ‘అవెంజర్స్’. ఈ సిరీస్‌లో మూడో సినిమా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఒక్క సినిమా కోసమే సూపర్ హీరో సినిమా ఫ్యాన్స్ అంతా సంవత్సర కాలంగా ఎదురుచూస్తూ వచ్చారు. మన ఇండియన్ సినిమాకు ‘బాహుబలి’ లాంటిది హాలీవుడ్‌కు ఈ సినిమా. అవెంజర్స్ ప్రత్యేకతలేంటీ? హాలీవుడ్ టాప్ ఫోర్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్కి కారణం ఏంటీ? తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే! మార్వెల్స్ మ్యాజిక్.... మార్వెల్ కామిక్స్ది ఒక చరిత్ర. కామిక్ పుస్తకాలతో దశాబ్దాలుగా ఎందరో సూపర్ హీరోలను సృష్టించిన మార్వెల్, ఆ సూపర్ హీరోలనే సినిమాలుగానూ తీసుకొచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సూపర్ హీరోలు ఇండియన్ సినిమా ఫ్యాన్స్‌కూ తెగ కిక్ ఇచ్చేస్తుంటారు. అవెంజర్స్.. ఈ సూపర్ హీరోలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి చేయించే యుద్ధం. 2012లో ‘అవెంజర్స్’ సిరీస్‌లో మొదటి సినిమా వచ్చింది. ఇది అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఆ తర్వాత 2015లో ‘అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ వచ్చింది. అదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఇక ఇప్పుడు 2018లో తాజాగా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ వచ్చేసింది. ఇదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంటూ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతోంది. 2019లో ఈ కొత్త సినిమాకు సీక్వెల్ రానుంది. అవెంజర్స్‌లో సూపర్ హీరోలంతా ఈ ప్రపంచాన్ని కాపాడ్డానికే కష్టపడుతుంటారు. ఒక్కో సినిమాలో ఒక్కో విలన్. ఇన్ఫినిటీ వార్ కథేంటీ? ఇన్ఫినిటీ వార్‌లో థానోస్‌పై యుద్ధం చేస్తున్నారు మన సూపర్ హీరోలంతా. ప్రపంచాన్ని జయించే శక్తిని సంపాదించి, ఈ ప్రపంచాన్నంతా తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తుంటాడు థానోస్. అందుకు ఎంతటి విధ్వంసానికైనా వెనుకాడడు. ఆ థానోస్‌ను ఎదుర్కొని, ప్రపంచాన్ని కాపాడ్డానికి సూపర్ హీరోలంతా ఏకమై ఒక యుద్ధం చేయాలి. అలాంటి ఇలాంటి యుద్ధం కాదది. థానోస్‌ను ఎదుర్కోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఐరన్‌మేన్, హల్క్, స్పైడర్‌మేన్ తదితర మార్వెల్ సృష్టించిన సూపర్ హీరోలంతా తమకు మాత్రమే సాధ్యమయ్యే విన్యాసాలు, అడ్వెంచర్స్ చేస్తూ థానోస్ పనిపడతారు. ఆద్యంతం కట్టిపడేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఇన్ఫినిటీ వార్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అవెంజర్స్ టీమ్...మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో పందొమ్మిదో సినిమాగా ఇన్ఫినిటీ వార్‌ను తీసుకొచ్చింది. ఆంథోని రుస్సో, జాయ్ రుస్సో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాబర్ట్ డోనీ జూనియర్ ఐరన్‌మేన్‌గా, క్రిస్ హెమ్స్‌వర్త్ హల్క్‌గా, క్రిస్ ఈవన్స్ కెప్టెన్ అమెరికాగా, ఛద్విక్ బోస్మన్ బ్లాక్పాంథర్గా, స్కార్లెట్ జోహన్సన్ బ్లాక్ విడోగా నటించిన ఈ సినిమాలో ఎక్కడ చూసినా, ఏ సమయంలో చూసినా, స్క్రీన్ నిండా స్టార్సే కనిపిస్తారు. ఆ స్టార్స్ చేసే సందడి థియేటర్లలో అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఒక్కో క్యారెక్టర్‌కూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం కూడా ఇన్ఫినిటీ వార్‌కు ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. బడ్జెట్ ‘హీరో’... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ను ఒక సినిమాటిక్ అద్భుతంలా తెరకెక్కించాలన్నది మార్వెల్ స్టూడియోస్ కల. ఆ కలకు తగ్గట్టే బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ, విజువల్ వండర్‌గా ఇన్ఫినిటీ వార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు అయిన బడ్జెట్ కూడా అంతా ఇంతా కాదు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఇన్ఫినిటీ వార్ తెరకెక్కింది. ఇది హాలీవుడ్ చరిత్రలో టాప్ 4 బడ్జెట్ సినిమాల్లో ఒకటి. అంత బడ్జెట్ పెట్టారు కాబట్టే, ఇంత మంది స్టార్స్ ఒక దగ్గరికి రావడం, ఇంత బెస్ట్ ఔట్పుట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడం జరుగుతోందని అంటారు ఫ్యాన్స్. బాక్సాఫీస్ ‘సూపర్ హీరో’... టాప్ 4లో చోటు... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ బడ్జెట్లో దాదాపు 300 మిలియన్ డాలర్లతో హీరో అయితే, బాక్సాఫీస్ వద్ద సూపర్ హీరో రేంజ్లో నాలుగో వారంలోకి అడుగు పెట్టేసరికి 1.7 బిలియన్ డాలర్లు (సుమారు 11 వేల కోట్ల రూపాయలు) వసూలు చేసి 2 బిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రభంజనమే సృష్టిస్తూ వచ్చిందీ సినిమా. ఇండియన్ బాక్సాఫీస్‌పై ఇన్ఫినిటీ ‘వార్’! ఇండియన్ సినిమా అభిమానులకు సూపర్ హీరో సినిమాలంటే పిచ్చి అభిమానమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక్కడ సూపర్‌హీరోలకు చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వర్గాల వాళ్లూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్ఫినిటీ వార్ కోసం వీళ్లంతా ఏడాది ప్రారంభం నుంచే ఎదురుచూస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు రెండు వేల థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. కేవలం మొదటిరోజే 30 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి, ఈ ఏడాది బాలీవుడ్లో అన్ని సినిమాల ఓపెనింగ్ డే రికార్డులను బద్దలు కొట్టింది ఇన్ఫినిటీ వార్. ఇదే జోరు ఈరోజుకీ కొనసాగుతూండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పటికే 200కోట్ల మార్క్‌ను కూడా దాటేసి (మూడోవారం ముగిసేసరికి 215 కోట్ల రూపాయలు), ‘ది జంగిల్ బుక్’ రికార్డును కూడా బ్రేక్ చేసి ఇండియాలో ఇప్పటికే పెద్ద బ్లాక్‌బస్టర్‌గా ఇన్ఫినిటీ వార్ నిలిచింది. 200 కోట్ల మార్క్‌ను చేరుకున్న మొదటి హాలీవుడ్ సినిమా ఇదే! మే నెలంతా పిల్లలకు సెలవులే కావడంతో ఇన్ఫినిటీ వార్ ఇండియాలో ఇంకొన్ని రోజులు ఇలాగే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. విచిత్రంగా ఇప్పటివరకూ మార్వెల్ సినిమాలు పరిచయం లేని వాళ్లు కూడా అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ గురించి ఆసక్తిగా తెలుసుకుంటూ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి! ప్రపంచాన్ని అంతం చేయడానికి ఎన్ని శక్తులు పుట్టుకొచ్చినా వాటిని అంతమొందించేందుకు ఒక హీరో పుట్టుకొస్తాడు. విలన్‌కే అంత పవర్ ఉంటే హీరోకు ఇంకెంత పవర్ ఉండాలి? సూపర్ పవర్ ఉండాలి కదూ? అలాంటి సూపర్ పవర్స్‌తో మనల్ని సంవత్సరాలుగా కట్టిపడేస్తోన్న సూపర్ హీరోలందరూ ఒకేసారి తెరపై కనిపిస్తే? ఆ సంబరం ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. ‘ఐరన్‌మేన్’, ‘స్పైడర్‌మేన్’, ‘కెప్టెన్ అమెరికా’, ‘బ్లాక్‌పాంథర్’.. ఇలా సూపర్ హీరోలుగా ఎన్నో అడ్వెంచర్స్ చేసి మనల్ని మెప్పించిన సూపర్ హీరో క్యారెక్టర్స్ అందరూ ఏకమై ఒక పెద్ద శక్తిపై పోరాడేందుకు చేసే యుద్ధమే ‘అవెంజర్స్’. ఈ సిరీస్‌లో మూడో సినిమా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఒక్క సినిమా కోసమే సూపర్ హీరో సినిమా ఫ్యాన్స్ అంతా సంవత్సర కాలంగా ఎదురుచూస్తూ వచ్చారు. మన ఇండియన్ సినిమాకు ‘బాహుబలి’ లాంటిది హాలీవుడ్‌కు ఈ సినిమా. అవెంజర్స్ ప్రత్యేకతలేంటీ? హాలీవుడ్ టాప్ ఫోర్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్కి కారణం ఏంటీ? తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే! మార్వెల్స్ మ్యాజిక్.... మార్వెల్ కామిక్స్ది ఒక చరిత్ర. కామిక్ పుస్తకాలతో దశాబ్దాలుగా ఎందరో సూపర్ హీరోలను సృష్టించిన మార్వెల్, ఆ సూపర్ హీరోలనే సినిమాలుగానూ తీసుకొచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సూపర్ హీరోలు ఇండియన్ సినిమా ఫ్యాన్స్‌కూ తెగ కిక్ ఇచ్చేస్తుంటారు. అవెంజర్స్.. ఈ సూపర్ హీరోలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి చేయించే యుద్ధం. 2012లో ‘అవెంజర్స్’ సిరీస్‌లో మొదటి సినిమా వచ్చింది. ఇది అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఆ తర్వాత 2015లో ‘అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ వచ్చింది. అదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఇక ఇప్పుడు 2018లో తాజాగా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ వచ్చేసింది. ఇదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంటూ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతోంది. 2019లో ఈ కొత్త సినిమాకు సీక్వెల్ రానుంది. అవెంజర్స్‌లో సూపర్ హీరోలంతా ఈ ప్రపంచాన్ని కాపాడ్డానికే కష్టపడుతుంటారు. ఒక్కో సినిమాలో ఒక్కో విలన్. ఇన్ఫినిటీ వార్ కథేంటీ? ఇన్ఫినిటీ వార్‌లో థానోస్‌పై యుద్ధం చేస్తున్నారు మన సూపర్ హీరోలంతా. ప్రపంచాన్ని జయించే శక్తిని సంపాదించి, ఈ ప్రపంచాన్నంతా తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తుంటాడు థానోస్. అందుకు ఎంతటి విధ్వంసానికైనా వెనుకాడడు. ఆ థానోస్‌ను ఎదుర్కొని, ప్రపంచాన్ని కాపాడ్డానికి సూపర్ హీరోలంతా ఏకమై ఒక యుద్ధం చేయాలి. అలాంటి ఇలాంటి యుద్ధం కాదది. థానోస్‌ను ఎదుర్కోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఐరన్‌మేన్, హల్క్, స్పైడర్‌మేన్ తదితర మార్వెల్ సృష్టించిన సూపర్ హీరోలంతా తమకు మాత్రమే సాధ్యమయ్యే విన్యాసాలు, అడ్వెంచర్స్ చేస్తూ థానోస్ పనిపడతారు. ఆద్యంతం కట్టిపడేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఇన్ఫినిటీ వార్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అవెంజర్స్ టీమ్...మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో పందొమ్మిదో సినిమాగా ఇన్ఫినిటీ వార్‌ను తీసుకొచ్చింది. ఆంథోని రుస్సో, జాయ్ రుస్సో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాబర్ట్ డోనీ జూనియర్ ఐరన్‌మేన్‌గా, క్రిస్ హెమ్స్‌వర్త్ హల్క్‌గా, క్రిస్ ఈవన్స్ కెప్టెన్ అమెరికాగా, ఛద్విక్ బోస్మన్ బ్లాక్పాంథర్గా, స్కార్లెట్ జోహన్సన్ బ్లాక్ విడోగా నటించిన ఈ సినిమాలో ఎక్కడ చూసినా, ఏ సమయంలో చూసినా, స్క్రీన్ నిండా స్టార్సే కనిపిస్తారు. ఆ స్టార్స్ చేసే సందడి థియేటర్లలో అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఒక్కో క్యారెక్టర్‌కూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం కూడా ఇన్ఫినిటీ వార్‌కు ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. బడ్జెట్ ‘హీరో’... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ను ఒక సినిమాటిక్ అద్భుతంలా తెరకెక్కించాలన్నది మార్వెల్ స్టూడియోస్ కల. ఆ కలకు తగ్గట్టే బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ, విజువల్ వండర్‌గా ఇన్ఫినిటీ వార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు అయిన బడ్జెట్ కూడా అంతా ఇంతా కాదు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఇన్ఫినిటీ వార్ తెరకెక్కింది. ఇది హాలీవుడ్ చరిత్రలో టాప్ 4 బడ్జెట్ సినిమాల్లో ఒకటి. అంత బడ్జెట్ పెట్టారు కాబట్టే, ఇంత మంది స్టార్స్ ఒక దగ్గరికి రావడం, ఇంత బెస్ట్ ఔట్పుట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడం జరుగుతోందని అంటారు ఫ్యాన్స్. బాక్సాఫీస్ ‘సూపర్ హీరో’... టాప్ 4లో చోటు... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ బడ్జెట్లో దాదాపు 300 మిలియన్ డాలర్లతో హీరో అయితే, బాక్సాఫీస్ వద్ద సూపర్ హీరో రేంజ్లో నాలుగో వారంలోకి అడుగు పెట్టేసరికి 1.7 బిలియన్ డాలర్లు (సుమారు 11 వేల కోట్ల రూపాయలు) వసూలు చేసి 2 బిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రభంజనమే సృష్టిస్తూ వచ్చిందీ సినిమా. -
నేను సూపర్ విలన్ భార్యను
మనీలా : పాపులారిటీ ఉన్న వాళ్ల పేర్లను వాడుకుని ప్రచారం పొందడం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. ఆఖరికి కామిక్ విలన్‌ను కూడా వదలటం లేదు కొందమంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విజయపథంలో దూసుకుపోతున్న అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లోని విలన్ థానోస్ తన భర్తంటూ ఫిలిప్పీన్స్ సెనేటర్ ట్విటర్లో పోస్టులు పెట్టారు. వివరాలలోకి వెళితే.. మే 5న ఫిలిప్పీన్స్ సెనేటర్ నాన్సీ బినయ్ ఇన్ఫినిటీ వార్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన మాయోయావోలో ఫోటోలు దిగి ట్విటర్లో ఉంచారు. కొద్ది రోజుల తర్వాత ఓ పార్టీలో పాల్గొన్న ఆమె తలపై వైకింగ్స్ కిరీటాన్ని ధరించి థానోస్ భార్యను తానే అని ప్రకటించుకున్నారు. మరి ఆమె అవెంజర్స్ సినిమా చూసి ఇలా మాట్లాడారా? లేదా ఫిలిప్పీన్స్ పర్యాటక రంగాన్ని పాపులర్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నారో అని తెలియక తలలు పట్టుకుంటున్నారు అక్కడి వారు. కామిక్ విలన్ మనిషిని ఏట్లా పెళ్లి చేసుకుంటాడు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. “I am the wife of Thanos,” Sen @nancybinay exclaims in jest as well-wishers sing “Happy birthday” | via @sherieanntorres pic.twitter.com/ez9oa2bjhy — ABS-CBN News (@ABSCBNNews) May 10, 2018 -
అమితాబ్.. మీ కంటే ఆరాధ్య బెటర్
సాక్షి, ముంబై: ముక్కుసూటి మనిషి అయిన దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు నాన్చటం తెలీదు. ఏ విషయంపైన అయినా సరే చాలా ఓపెన్‌గా మాట్లాడుతుంటారు. ట్వీటర్లో ఆయన చేసే పోస్టులు కూడా సరదాగా. తాజాగా అవెంజర్స్ ఇన్ఫినిటీ చిత్రాన్ని చూసిన ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘సర్.. తప్పుగా అనుకోకండి. అవెంజర్స్ సినిమా చూశా. కానీ, సినిమా చూస్తున్నంత సేపు ఏం జరుగుతుందో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు’ అంటూ సరదాగా ఓ ట్వీటేశారు. దానికి స్పందించిన అవెంజర్స్ ఫ్యాన్స్ ఆయనికి కౌంటర్ ఇచ్చే యత్నం చేశారు. ‘అవెంజర్స్ సిరీస్‌లో వరస బెట్టి సినిమాలన్నీ చూస్తే మీకు అసలు విషయం అర్థమౌతుంది’ ఆయన ఓ వ్యక్తి ట్వీట్ చేయగా.. ‘ ఈ విషయంలో మీ కంటే మీ మనవరాలు ఆరాధ్య బెటర్. ఆమెకు సినిమా బాగా అర్థమై ఉంటుంది’ అంటూ మరో వ్యక్తి సెటైర్ పేల్చాడు. చిన్న పిల్లలకు ఆ సూపర్ హీరోస్ గురించి బాగా తెలుసని, కాబట్టి మీ ముద్దుల మనవరాలిని అడిగి కథ మొత్తం తెలుసుకోవాలని మరో వ్యక్తి ట్వీట్ చేశారు. సరదాగా మెగాస్టార్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ డాలర్ల వసూళ్లు చేసిన ఈ చిత్రం ఇండియాలో రూ.230 కోట్లు వసూలు చేసింది. ఇన్ఫినిటీ స్టోన్స్ సాయంతో సగం విశ్వాన్ని నాశనం చేయాలని యత్నించే థానోస్, అతన్ని అడ్డుకునేందుకు అవెంజర్స్ చేసే పోరాటలతో ఇన్ఫినిటీ వార్ తెరకెక్కింది. T 2803 -T 2003 - अच्छा भाई साहेब , बुरा ना मानना , एक पिक्चर देखने गाए , 'AVENGERS' ... कुछ समझ में नहीं आया की picture में हो क्या रहा है !!!🤪🤪🤪🤪🤪🤪🤪😠😠😠 — Amitabh Bachchan (@SrBachchan) 13 May 2018 -
రికార్డు బ్రేక్: 11 రోజుల్లో 6 వేల కోట్ల కలెక్షన్లు..
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ చిత్రం అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం కొనసాగిస్తోంది. విడుదలైన 11 రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ల (మన కరెన్సీలో దాదాపు రూ.6,432 కోట్లు) వసూళ్లు రాబట్టింది. తద్వారా ఈ ఫీట్‌ను వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు స్టార్ వార్స్: ది ఫోర్స్ అవెకెన్స్ చిత్రం(12 రోజుల్లో రాబట్టింది) పేరిట ఉంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ది వాల్ట్ డిస్నీ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. శుక్రవారం ఒక్క రోజే 70 మిలియన్ డాలర్లను వసూలు చేసిందని తెలిపారు. మున్ముందు ఈ చిత్రం మరిన్ని రికార్డులు బద్ధలు కొట్టే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ కలెక్షన్ల విషయంలో ఇన్ఫినిటీ వార్ మొదటి స్థానంలో ఉండగా.. ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్ రెండో స్థానంలో, స్టార్ వార్స్: ది ఫోర్స్ అవెకెన్స్ చిత్రం మూడో స్థానంలో ఉన్నాయి. మరోవైపు భారత్‌లో ఇన్ఫినిటీ వార్ ఈ చిత్రం రూ. 200 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. రాబర్ట్ డౌనీ జూనియర్(ఐరన్ మ్యాన్), క్రిస్ ప్రాట్, క్రిస్ హెమ్స్ వర్త్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, స్కార్లెట్ జాన్సన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆంథోని రుస్సో, జోయ్ రుస్సో దర్శకత్వం వహించారు. మార్వెల్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇన్ఫినిటీ స్టోన్స్ సాయంతో సగం విశ్వాన్ని నాశనం చేయాలని యత్నించే విలన్ థానోస్.. అతన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే అవెంజర్స్ సూపర్ హీరోలు.. వాళ్ల మధ్య జరిగే పోరాటాలు, చివరకు ఓ ట్విస్ట్‌తో అవెంజర్స్ ఇన్ఫినిటీ చిత్రం రూపొందింది. ఈ చిత్రం తరువాయి భాగం వచ్చే ఏడాది సమ్మర్లో(మే 3, 2019 అని ప్రకటించారు) విడుదల కానుంది. -
సూపర్ హీరో స్పానిష్ కష్టాలు
సూపర్ హీరో అంటే ఏదైనా చేయగలడు. ఆకాశానికి నిచ్చెన వేసేయగలడు. విలన్స్‌ని సింగిల్ పంచ్‌తో మటాష్ చేయగలడు. ప్రపంచాన్ని వినాశనం నుంచి కాపాడగలడు. కానీ ఆఫ్‌స్క్రీన్ ఆ సూపర్ హీరో మాస్క్ తీసేసిన తర్వాత అతను కూడా మనందరిలాంటి సాధారణ మనిషే. ‘అవెంజర్స్’లో థార్ కూడా అందుకు మినహాయింపు కాదు. ‘థార్’ క్యారెక్టర్ ప్లే చేసిన క్రిస్ హెమ్స్‌వర్త్‌కు స్పానిష్ మాట్లాడటం సరిగ్గా రాదట. ఇంట్లో శ్రీమతి మాట్లాడే స్పానిష్ మాటలు సరిగ్గా అర్థం కాకపోయినా ‘ఆహా.. ఓహో..’ అంటూ తలాడిస్తాడట ఈ ఆస్ట్రేలియన్ సూపర్ హీరో. స్పానిష్ కష్టాలు గురించి క్రిస్ మాట్లాడుతూ ‘‘నేను బయట సూపర్ హీరో కావచ్చు. కానీ ఇంట్లో మాత్రం కాదు. నేనొక్కడినే ఇంట్లో స్పానిష్‌తో ఇబ్బంది పడుతుంటాను. మా వైఫ్, పిల్లలు అందరూ చక్కగా స్పానిష్ మాట్లాడుకుంటుంటారు. కొన్నిసార్లు ఒకటీ అరా వాక్యం స్పానిష్‌లో మాట్లాడేసి ‘యా.. యా..’ మీరు చెప్పింది రైట్ అని శృతిలో కలిపేస్తుంటాను. ఏదైనా గొడవ జరిగేటప్పుడు నా భార్య కోపంగా ఏదోటి అంటుంది. అసలు తనేమందో దానికి తిరిగి నేనేమనాలో అర్థం కాదు. సో ఎక్కువగా గొడవపడటం కూడా మానేశా’’ అని ఆయన పేర్కొన్నారు. అదన్నమాట... సూపర్ హీరో స్పానిష్ కష్టాలు. -
అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కాపీ కొట్టారా?
సాక్షి, వెబ్‌డెస్క్: మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విలన్ థానోస్ నుంచి కాపాడేందుకు సూపర్ హీరోలు చేసే సాహసాలు, ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు... భారీ విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ ఇలా అన్ని విభాగాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే ఈ సినిమాపై ఇప్పుడు కాపీ చేశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. హ్యారీ పాటర్ సిరీస్‌లోని సన్నివేశాలను ఎత్తేసి ఇన్ఫినిటీ వార్‌ను రూపొందించారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్ఫిలోని చాలా మట్టుకు సన్నివేశాలను.. హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్లోని సీన్లతో పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. హ్యారీ పాటర్ సిరీస్‌ల్లోని ది సెంట్రల్ క్వెస్ట్.. వోల్దెమార్ట్ చనిపోయే సన్నివేశం.. డీమెంటర్స్-రెడ్స్కల్ మధ్య పోలికలు.. మ్యాడ్ఊ మూడీ కన్నును థోర్ కంటితో పోలుస్తూ కాపీ కొట్టారంటూ వాదిస్తున్నారు. మరికొందరు జేకే రౌలింగ్(హ్యారీ పాటర్ రచయిత్రి) నుంచి రాయల్టీ తీసుకోవాల్సిందేనంటూ చమక్కులు పేలుస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే విదేశీ మార్కెట్‌తోపాటు భారత్‌లోనూ అవెంజర్స్ ప్రభంజనం కొనసాగుతోంది. తొలిరోజు రూ. 30 కోట్లు(2000 వేల స్క్రీన్లలో మాత్రమే విడుదలైంది) వసూలు చేసిన ఈ చిత్రం.. వీకెండ్లో భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది. Watching the Avengers: Infinity War feels like watching Harry Potter and the Deathly Hallows — Niekholois (@Khloivillaverde) 28 April 2018 Curious question, I've only seen 3 Harry Potter movies... How many Harry Potter Flicks do I need to see to catch up for Avengers: Infinity War??? #AvengersInfinityWar #InfinityGauntlet — ᴹᶦᶜʳᵒ (@Micromonics) 28 April 2018 The truth has been revealed. Harry Potter was fake. It was Thanos who killed Voldemort.#Avengers #InfinityWar #ThanosTheRealHero #Avengers4 pic.twitter.com/L0zMl0GujS — Abhishek D (@abh1shekdas) 28 April 2018 Hello, Avengers? JK Rowling called and wants some royalties. #horcruxes #HarryPotter — Jeffrey Pugh (@JeffreyCPugh) 28 April 2018 ఇన్ఫినిటీ స్టోన్స్ సాయంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకునే విలన్ థానోస్.. అతని నుంచి ప్రపంచాన్ని కాపాడానికి సూపర్ హీరోలు.. వాళ్లు చేసే పోరాటాల నేపథ్యంతో అవెంజర్స్ ఇన్ఫినిటీ చిత్రం రూపొందింది. ఆంథోని రుస్సో, జోయ్ రుస్సో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాబర్ట్ డౌనీ జూనియర్(ఐరన్ మ్యాన్), క్రిస్ ప్రాట్, క్రిస్ హెమ్స్ వర్త్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, స్కార్లెట్ జాన్సన్ తదితరులు నటించారు. -
సూపర్ హీరోలు దిగిపోతున్నారు
ఇంకొక్క మూడు రోజుల్లో కమర్షియల్ సినిమాలకు బాబు లాంటి సినిమా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మార్వెల్ కామిక్స్ సూపర్ హీరో పాత్రలన్నీ ఒకే సినిమాలో, ఒకేసారి కనిపించే సంబరం కావడంతో సాధారణంగానే ‘అవెంజర్స్’కు అభిమానుల్లో పిచ్చి క్రేజ్ ఉంది. దీనికి తోడు ఇప్పటికే ట్రైలర్ అభిమానులకు ఇవ్వాల్సిన కిక్ అంతా ఇచ్చేసింది. ట్రైలరే ఇలా ఉంటే ఇంక సినిమా ఎలా ఉంటుందో అని ఇప్పట్నుంచే అభిమానులు టికెట్లు బుక్ చేస్కోవడం మొదలుపెట్టేశారు. ఇండియాలోనూ అవెంజర్స్ సిరీస్‌కు లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియాలోనూ ఈ శుక్రవారం (ఏప్రిల్ 27న) భారీ ఎత్తున అవెంజర్స్ విడుదలవుతోంది. కెప్టెన్ అమెరికా, ఐరన్‌మేన్, స్పైడర్‌మేన్ లాంటి సూపర్ హీరో క్యారెక్టర్స్ సినిమా అంతా కనిపించనున్నాయి. అడుగడుగునా యాక్షనే! ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఫస్ట్ వీకెండ్‌కే ఈ సినిమా 250 మిలియన్ డాలర్లు (సుమారు 1,600 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. పాజిటివ్ టాక్గనక వస్తే అవెంజర్స్‌ను బాక్సాఫీస్ వద్ద ఎవ్వరూ ఆపలేరని టాక్ వస్తోంది. మరి ఇన్ని అంచనాల మధ్య వస్తోన్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే!! -
అవెంజర్స్ ఎదుర్కోబోయే సూపర్‌విలన్ థానోస్
యంసీయు (మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్)లో చాలా తక్కువ టైమ్‌లోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న సూపర్ విలన్ థానోస్. ఇదివరకు ‘గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ, అవెంజర్స్ ఏజ్ ఆఫ్ ఆల్ట్రన్స్’ సినిమాల్లో కనిపించారు. అది కూడా పూర్తి స్థాయి పాత్రలో కాదు... కేవలం లిమిటెడ్ రోల్లో కనిపించారు. కానీ, ‘అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’లో పూర్తి స్థాయి విలన్‌గా కనిపించనున్నారు థానోస్. అవెంజర్స్ అందరూ కలిసి ఈ విలన్ ఆకృత్యాలను అడ్డుకొని అతని మీద ఎలా గెలిచారన్నది ఈ సినిమా కథ. థానోస్ క్యారెక్టర్ గురించి కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ ప్లే చేసిన క్రిస్ ఈవన్ మాట్లాడుతూ – ‘‘అవెంజర్స్ ఎదుర్కోబోయే అతి పెద్ద సూపర్‌విలన్ థానోస్. అవెంజర్స్ ఫ్యాన్స్‌కు, థానోస్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా సూపర్ ఎంటర్టైనింగ్గా ఉండబోతోంది. ఆ క్యారెక్టర్‌తో తలపడటాన్ని మేమెంతో ఎంజాయ్ చేశాం. అందరు సూపర్ హీరోస్ కలిసి ఒకే సినిమాలో కనబడటం మార్వెల్స్లో బెస్ట్ థింగ్’’ అని పేర్కొన్నారు. ‘అవెంజర్స్–ఇన్ఫినిటీ వార్’ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్లో థానోస్ క్యారెక్టర్‌కు హీరో రానా దగ్గుబాటి డబ్బింగ్ చెప్పడం విశేషం. -
తానొస్కి వాయిస్ ఇవ్వడం ఓ థ్రిల్
‘‘మార్వెల్ కామిక్స్ చదువుతూ పెరిగాను. సూపర్ హీరోల కథలను ఆకట్టుకునేలా, వివిధ భాగాలుగా చెప్పడం మార్వెల్ సినిమాల గొప్పతనం. ‘ఎవెంజర్స్– ఇన్ఫినిటీ వార్’లో సూపర్ విలన్ తానొస్‌కు డబ్బింగ్ చెప్పడం థ్రిల్లింగ్‌గా ఉంది’’ అన్నారు రానా. మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న హాలీవుడ్ చిత్రం ‘ఎవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్’. ఈ సినిమా ఈ నెల 27న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 2డీ, 3డీ, ఐమాక్స్ 3డీలో విడుదల కానుంది. డిస్నీ ఇండియా ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది. ‘ఎవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్’లో మార్వెల్ సినిమాల్లోని సూపర్ హీరోలు అందరూ కలిసి ప్రపంచ వినాశనానికి పూనుకున్న సూపర్ విలన్ తానోస్తో తలపడనున్నారట. రానా మాట్లాడుతూ– ‘‘పాత్రల్ని సృష్టించి ప్రపంచవ్యాప్త ప్రేక్షకులతో కనెక్టయ్యేలా చేయడంలో మార్వెల్ది తిరుగులేని స్థాయి. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా నా ఫేవరెట్ క్యారెక్టర్స్. ఎవెంజర్స్లాంటి సూపర్ హీరోలను ముప్పుతిప్పలు పెట్టే సూపర్ విలన్ తానొస్ పాత్రకు వాయిస్ ఇవ్వడం గుడ్ ఎక్స్పీరియన్స్’’ అన్నారు. -
ఎంటర్టైన్మెంట్ ఇన్ఫినిటీ
సమ్మర్ వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయ్.. పిల్లలకు సెలవులు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు చక్కగా సినిమాలు చూసే టైమ్. సాయంకాలాలు అలా థియేటర్లలో వాలిపోయి సినిమాలను ఎంజాయ్ చేసే టైమ్. మరి మనకు సమ్మర్ అప్పుడే వచ్చేసింది కానీ యూఎస్‌లో ఇంకో రెండు నెలలు వెయిట్ చెయ్యాలి సమ్మర్‌కు. మనకైతే సమ్మర్ వేడిని పుట్టించేందుకు వాళ్ల స్ప్రింగ్ సీజ్న్లోనే భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ మొదలుకొని ‘డెడ్‌పూల్ 2’ వరకు ఇండియన్ అభిమానులను అలరించేందుకు హాలీవుడ్ రెడీ అయిపోయింది. ఆ సినిమాలను ఒకసారి పలకరించుకొద్దాం.. అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’.. సమ్మర్లో ఈ ఒక్క సినిమా కోసం యాక్షన్ సినిమా అభిమానులందరూ పిచ్చి పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. అది అలాంటి ఇలాంటి సినిమా కాదు కాబట్టి ఓపెనింగ్స్ కూడా అదిరిపోయేలా ఉంటాయని ట్రేడ్ భావిస్తోంది. సూపర్‌మేన్, స్పైడర్ మేన్, ఐరన్ మేన్.. ఇలా మనల్ని మెప్పించిన సూపర్ హీరోలంతా ఒక దగ్గర చేరి ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే? అంతమంది సూపర్‌హీరోలు ఒకేసారి ఫైట్స్ చేస్తూ ఉంటే? అవెంజర్స్ అందుకు స్పెషల్. మార్వెల్ కామిక్స్ క్రియేట్ చేసిన సూపర్హీరోలంతా ఉంటారు ఈ సినిమాలో. వాళ్లు చేసే యాక్షన్, అడ్వెంచర్సే ఈ సినిమాకు హైలైట్. ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది అవెంజర్స్. ఈ సమ్మర్లో ఇదే అతిపెద్ద సినిమా. డెడ్‌పూల్ 2 అవెంజర్స్ రిలీజైన సరిగ్గా మూడు వారాలకు వస్తుంది ‘డెడ్‌పూల్ 2’. 2016లో వచ్చిన ‘డెడ్‌పూల్’కు సీక్వెల్ ఇది. అవెంజర్స్‌లో ఒక క్యారెక్టర్ అయిన డెడ్‌పూల్‌ను ఫుల్‌లెంగ్త్ రోల్లో ఎంజాయ్ చేయడానికి ‘డెడ్‌పూల్ 2’ చూడాల్సిందే మరి! సూపర్‌హీరో జానర్లో ఒక కొత్త ప్రయోగమైన డెడ్‌పూల్ తరహాలోనే సీక్వెల్ కూడా ఉంటుందట. ట్రైలర్ అయితే సినిమా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుందని స్పష్టం చేసేసింది. మే 18న విడుదలవుతోన్న ఈ సినిమాకు ఇండియాలోనూ భారీ క్రేజ్ ఉండడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్ మనకు సమ్మర్ అప్పుడప్పుడే పూర్తవుతూ, చిరుజల్లులు పలకరించే సమయానికి సీజన్‌ను గ్రాండ్‌గా ఎండ్ చేసేందుకు ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’ సినిమా వచ్చేస్తోంది. జురాసిక్ పార్క్ నుంచి మొదలుపెడితే జురాసిక్ వరల్డ్ వరకూ ఈ సిరీస్ గురించి చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద చరిత్ర. సాధారణంగానే జురాసిక్ పార్క్ సిరీస్‌కు ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకు ఏమాత్రం తక్కువ లేకుండా ఈ కొత్త సినిమా వస్తోంది. 2015లో వచ్చిన జురాసిక్ వరల్డ్‌తో పోల్చితే ఎన్నోరెట్లు ఎక్కువ అడ్వెంచర్లు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది. ట్రైలర్ ఇప్పటికే అభిమానులకు ఇవ్వాల్సిన కిక్ అంతా ఇచ్చేస్తోంది. జూన్ 22న ఈ సినిమా విడుదలవుతోంది. హాలీవుడ్ రికార్డులను తిరగరాసే సినిమాగా ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’కు ప్రచారం కల్పిస్తోంది యూనివర్సల్ పిక్చర్స్. పసిఫిక్ రిమ్ అప్రైజింగ్ మొన్నీమధ్యే బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్ అందుకున్న గెలెర్మో డెల్తోరో గుర్తున్నాడు కదా? ఆయన దర్శకత్వంలో 2013లో వచ్చిన ‘పసిఫిక్ రిమ్’ సినిమాకు సీక్వెలే ఈ ‘పసిఫిక్ రిమ్ అప్రైజింగ్’. గెలెర్మో ఈసారి నిర్మాతగానే వ్యవహరించగా, స్టీవెన్ ఎస్ డెనైట్ దర్శకత్వం వహించారు. సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ ఆన్ అడ్వెంచర్లు, యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. గత వారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడిప్పుడే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఇండియాలోనూ భారీ ఎత్తునే ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా దర్శకుడికి ఇది డెబ్యూట్. డెబ్యూట్‌తోనే ఇంత భారీ బడ్జెట్ సినిమాతో స్టీవెన్మెప్పించడం విశేషం. రెడీ ప్లేయర్ వన్ సూపర్‌స్టార్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కొత్త సినిమా ‘రెడీ ప్లేయర్ వన్’ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 2045లో జరిగే సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమాకు అంతటా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మాస్టర్ స్టోరీటెల్లర్ అన్న తన స్థాయికి తగ్గట్టే స్పీల్బర్గ్ చేసిన ఈ ప్రయోగానికి ఇండియాలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. సమ్మర్‌ను సూపర్ కూల్ గా మొదలుపెట్టిన సినిమా ‘రెడీ ప్లేయర్ వన్’ అనే చెప్పుకోవాలి. ర్యాంపేజ్ ర్యాంపేజ్ కూడా సైన్స్ ఫిక్షన్ జానర్ కథే! ఒక విచిత్రమైన ప్రయోగంతో చిన్నపాటి గొరిల్లా భయంకరమైన మృగంలా మారిపోతుంది. ఆ తర్వాత అది చేసే విధ్వంసం, ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. దాన్నుంచి ఈ ప్రపంచాన్ని హీరో ఎలా కాపాడాడన్నదే సినిమా. భారీ యాక్షన్ అడ్వెంచర్స్‌తో సినిమా నడుస్తుంది. ట్రైలర్ ఇప్పటికే అడ్వెంచర్ సినిమా అభిమానులకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తోంది. డ్వేన్ జాన్సన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు బ్రాడ్ పేటోన్ దర్శకత్వం వహించారు.ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది. పిల్లలే టార్గెట్‌గా సమ్మర్లో ఈ సినిమామంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ భావిస్తోంది. మరి ఈ భారీ బడ్జెట్ సినిమాల్లో మనకు సమ్మర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా ఏదో, ఏ సినిమా ఎంతెంత వసూళ్లు రాబడుతుందో ఎదురుచూడాలి. -
అవెంజర్స్‌తో జతకట్టిన భళ్లాల దేవ
సాక్షి, హైదరాబాద్ : హాలీవుడ్ సినిమాలో మన తెలుగు నటుడా అని ఆశ్చర్యపోకండి. రానా దగ్గుబాటి హాలీవుడ్లో జతకట్టింది నటనతో కాదు..సినిమాలో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పడం ద్వారా ఆ రూట్లో ఎంట్రీ ఇచ్చారు. అవెంజర్స్ సిరీస్‌లోనే భారీ అంచనాలతో విడుదల కాబోతున్న చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. ఈ సినిమాలో హీరోలను ఢీ కొట్టే సింగిల్‌మన్ ఆర్మీ.. అదే విలన్ తానోస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారట రానా. మరో సారి భళ్లాలదేవ విలనిజాన్ని తెర మీద వినబోతున్నారు ప్రేక్షకులు. రానా మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి మార్వెల్ కామిక్స్ చదువుతూ, సినిమాలు చూస్తూ పెరిగానన్నారు. మార్వెల్ సంస్థ ఎవ్వరూ ఊహించని విధంగా మంచి కథలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరిస్తోందన్నారు. ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా నచ్చిన పాత్రలని ఆయన తెలిపారు. ఈ సినిమాలో విలన్ తానో పాత్రకు డబ్బింగ్ చెప్పటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో రానా డబ్బింగ్ చెప్పినట్లు గానే ఇతర భాషల్లో కూడా అక్కడి నటీనటులతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు నిర్మాతలు. -
బాక్సాఫీస్ రైడర్
‘బ్లాక్‌పాంథర్’ జోరు మెల్లిగా తగ్గింది. వచ్చే నెల విడుదలయ్యే ‘అవెంజర్స్’కు ఇప్పట్నుంచే హంగామా మొదలైంది. ఇక ఈ మధ్యన కూడా కొన్ని సినిమాలు వస్తున్నా ఈ రెండు పెద్ద సినిమాల స్థాయి మాత్రం ఇంకో సినిమాకు లేదు. అయినప్పటికీ గత శుక్రవారం విడుదలైన ‘టూంబ్ రైడర్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఎలీసియా వికాండర్ మెయిన్ లీడ్ చేసిన ఈ సినిమా ఆద్యంతం యాక్షన్ అడ్వెంచర్ ఎపిసోడ్స్‌తో అభిమానులను మెప్పిస్తోంది. ముఖ్యంగా ఎలీసియా యాక్టింగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెరికాలో ఈ వారం టాప్ ప్లేస్‌లో టూంబ్ రైడరే ఉంది. ఇక ఇండియాలోనూ ఈ సినిమాకు మొదట్నుంచీ మంచి ప్రమోషన్స్ చేయడంతో ఓపెనింగ్స్ బాగున్నాయి. రోర్ ఉతౌగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు.. అదే పేరుతో వచ్చి, పాపులర్ అయిన వీడియో గేమ్ ప్రేరణ. -
సూపర్ హీరోల హంగామా!
హాట్ హాట్ సమ్మర్. ఏప్రిల్ నెలాఖరు. అప్పటికి మన తెలుగు సూపర్‌స్టార్ మహేశ్ బాబు, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాల హడావుడి మామూలుగా ఉండదు. సరిగ్గా ఆ హడావుడి మధ్యే ఒక హాలీవుడ్ సినిమా వస్తోంది. ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ ఆ సినిమా పేరు. అలాంటి ఇలాంటి సినిమా కాదది. హాలీవుడ్లో మాస్కే మాస్ అనే సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎటు చూసినా సూపర్ హీరోలే! మార్వెల్ కామిక్స్ సృష్టించిన సూపర్ హీరోలు ఐరన్‌మేన్, స్పైడర్‌మేన్, బ్లాక్‌పాంథర్.. ఇలా గత పదేళ్లుగా సూపర్‌హీరోలుగా మనల్ని మెప్పించిన వాళ్లందరూ ఉంటారు. వాళ్లు చేసే భారీ యాక్షన్, సమాజాన్ని కాపాడడానికి వాళ్లు చేసే అడ్వెంచర్స్‌తో ఆ సినిమా అదిరిపోనుంది. ఈమధ్యే విడుదలైన ట్రైలర్ సినిమా అభిమానులకు పండగే ఇవ్వనుందని స్పష్టం చేస్తోంది. భారీ బడ్జెట్‌తో మార్వెల్ స్టూడియో సూపర్‌హీరో సిరీస్‌లో 19వ సినిమాగా తెరకెక్కిన ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ మొత్తం రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ఏప్రిల్ 27, 2018న విడుదలవుతోంటే, దానికి సీక్వెల్ అయిన రెండో భాగం 2019లో రానుంది. ఒక్క సూపర్ హీరో ఉంటేనే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హంగామా చేసేస్తుంది. ఇక సినిమా నిండా సూపర్ హీరోలే అయితే? అందులోనూ ఐమాక్స్, 3డీ వర్షన్స్‌లో చూస్తే? థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇందుకు ఎక్కువ కాలం ఆగక్కర్లేదు. ఇంకొక్క నెలే.. ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ అందరికీ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు వచ్చేస్తోంది. -
అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ ట్రైలర్
సాక్షి, హైదరాబాద్ : అత్యంత శక్తిమంతమైన శత్రువును ఎదుర్కొనేందుకు ఐరన్ మ్యాన్, థోర్, హల్క్ ఇలా ఎవెంజర్స్ అందరూ ఒక్కటయ్యారు. విశ్వాన్ని తన అదుపు ఆజ్ఞల్లోకి తెచ్చుకునేందుకు అవసరమైన ఇన్ఫినిటీ స్టోన్స్‌ను సేకరించేందుకు ప్రయత్నిస్తున్న ఈవిల్ థానోస్‌ను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్ చిత్రానికి చెందిన ఆఖరి ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రానికి ఆంథోని రస్సో, జోయ్ రస్సోలు దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వ రక్షణకు హీరోలందరూ కలసి సిద్ధమవుతున్న రెండు నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్‌ను చిత్ర టీం శుక్రవారం విడుదల చేసింది. మరి మీరు ఈ ట్రైలర్‌ను ఓ సారి చూసెయ్యండి. -
అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ ట్రైలర్