ట్రెండింగ్‌లో ఉన్న విషయాలను క్యాష్ చేసుకోవటంలో గూగుల్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అవెంజర్స్ ఎండ్‌గేమ్ రిలీజ్ రోజున ఓ సరికొత్త మేజిక్‌ను గూగుల్ యూజర్స్ అనుభూతి చెందేలా చేసింది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమా చూసిన వారికి క్లైమాక్స్ గుర్తుండే ఉంటుంది. థానోస్ తన హ్యాండ్ గ్లౌజ్‌తో చిటికె వేయగానే కొన్ని పాత్రలు బూడిదలా మారి వాష్ అవుట్ అవుతాయి.. ఇది సీను.
ఇక విషయానికి వస్తే గూగుల్‌లో సెర్చ్ ఇంజన్(కంప్యూటర్, మొబైల్)లో మనం థానోస్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకు థానోస్ చేతికి ధరించే హ్యాండ్ గ్లౌజ్.. రైట్ సైడ్‌లో కన్పిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే.. అది ఒక చిటికె వేస్తుంది. అప్పుడు జరగుతుందో మేజిక్. గూగుల్ తెరపై కనిపించే సెర్చ్ రిజల్ట్స్‌లో చాలా వరకు మాయం అవుతాయి. అప్పటి వరకు లక్షల్లో చూపిస్తున్న సెర్చ్ రిజల్ట్స్ సైతం దారుణంగా కిందకు పడిపోతాయి.
Do a google search for Thanos
— Albert Aydin (@albertaydin) April 24, 2019
Click the infinity gauntlet
Search results: Mr search engine, I don't feel so good..#ENDGAME #Thanos pic.twitter.com/FM6rxk5h7l
Comments
Please login to add a commentAdd a comment