అమెరికాలోని యూజర్ల కోసం గల్ఫ్ ఆఫ్ మెక్సికో(Gulf of Mexico) పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికా(Gulf of America)గా మార్చాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్(Google Maps) ఇటీవల ముఖ్యమైన అప్డేట్ను ప్రకటించింది. పేర్ల మార్పునకు సంబంధించి జియోగ్రాఫిక్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఎన్ఐఎస్)కు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇంటీరియర్ సమాచారం అందించింది. దాంతో గూగుల్ మ్యాప్స్‌లో ఈ మేరకు త్వరలో అప్డేట్ చేస్తామని ఆల్ఫాబెట్ ఇంక్. తెలిపింది.
అమెరికా యూజర్ల కోసం గల్ఫ్ ఆఫ మెక్సికోను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’ అనే కొత్త పేరును ప్రతిబింబించేలా గూగుల్ మ్యాప్స్ ప్లాట్ఫామ్లో అప్డేట్ అందించనుంది. అధికారిక ప్రభుత్వ వర్గాలు పేరు మార్చిన తర్వాత ఈ మార్పు అమల్లోకి రానునున్నట్లు పేర్కొంది. యూఎస్ వెలుపల వినియోగదారుల కోసం, గూగుల్ మ్యాప్స్ స్పష్టత, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి పాత పేరు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను, కొత్త పేరు ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’ను రెండింటినీ డిస్ప్లే చేయనుంది.
ఇదీ చదవండి: చైనా ఏఐ డీప్‌సీక్‌పై ఓపెన్ఏఐ సీఈఓ స్పందన
అధికారిక ప్రభుత్వ వర్గాల్లో పేరు మార్పులకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు గూగుల్ మ్యాప్స్ సదరు పేరు మార్పులు చేయడం ఆనవాయితీ. గల్ఫ్ ఆఫ్ అమెరికా అప్డేట్తో పాటు, గూగుల్ మ్యాప్స్ అమెరికా వినియోగదారుల కోసం మౌంట్ మెకిన్లీని డెనాలీగా పేరు మార్చనుంది. ఒబామా హయాంలో మౌంట్ మెకిన్లీని డెనాలీగా పిలిచేవారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఖచ్చితమైన, సమగ్రమైన భౌగోళిక సమాచారం అందించేందుకు గూగుల్ మ్యాప్స్ సేవలందిస్తోంది. గతంలో సీ ఆఫ్ జపాన్(ఈస్ట్ సీ), పర్షియన్ గల్ఫ్ (అరేబియా గల్ఫ్)ల పేర్లు మార్చడం వల్ల కంపెనీ సవాళ్లను ఎదుర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment