
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల పోలింగ్ సందర్భంగా విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ రోజు టెక్ దిగ్గజం గూగుల్‌పై టెస్లా అధినేత, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ గట్టి మద్దతుదారు ఇలాన్ మస్క్ ఎక్స్(ట్విటర్)లో ఫిర్యాదు చేశారు. ట్రంప్‌కు ఎక్కడ ఓటేయ్యాలి(వేర్ టు ఓట్ ట్రంప్) అని గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో టైప్ చేస్తే హారిస్ అని చూపిస్తోందని రిపబ్లికన్ మద్దతుదారులు చేసిన పోస్టును మస్క్ రీపోస్టు చేశారు.
Are others seeing this too? https://t.co/mlwRY08hgo
— Elon Musk (@elonmusk) November 5, 2024
గూగుల్ కమలాహారిస్‌కు కావాలనే మద్దతిస్తోందని రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ఆరోపించారు. ఈ విషయమై సోషల్‌మీడియాలో పోస్టులతో హోరెత్తించారు. గూగుల్‌పై దుమ్మెత్తిపోశారు. దీంతో గూగుల్ కంపెనీ స్పందించింది.టెక్సాస్‌లో ఒక కౌంటీ పేరు హారిస్ అవడం వల్లే సెర్చ్ ఇంజిన్ అలా చూపిస్తోందని,హారిస్ కౌంటీలోనూ ఒక పోలింగ్ కేంద్రం ఉందని క్లారిటీ ఇచ్చింది.ఈ లొకేషన్‌లో ఓటు వేయాలని సెర్చ్ ఇంజిన్ చూపిస్తోందని గూగుల్ తెలిపింది. క్లారిటీ ఇచ్చినందుకుగాను గూగుల్‌కు మస్క్ థ్యాంక్స్ చెప్పారు.
Thanks for the clarification https://t.co/JReZUGiWF8
— Elon Musk (@elonmusk) November 5, 2024
ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్‌లో ట్విస్ట్