‘మీపై అసహ్యం వేస్తుంది నాన్న’ : మస్క్‌ కుమార్తె | Elon Musk's Daughter Vivian Wilson Slams Father | Sakshi
Sakshi News home page

‘మీపై అసహ్యం వేస్తుంది నాన్న’ : మస్క్‌ కుమార్తె

Published Fri, Sep 13 2024 11:13 AM | Last Updated on Sat, Oct 5 2024 1:55 PM

Elon Musk's Daughter Vivian Wilson Slams Father

అమెరికన్‌ పాప్‌ సూపర్‌ స్టార్‌ టేలర్‌ స్విఫ్ట్‌పై ఎలోన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన కుమార్తె వివియన్‌ జెన్నా విల్సన్‌ స్పందించారు. తన తండ్రి  స్విప్ట్‌పై చేసిన కామెంట్స్‌ అసహ్యం కలుగుతున్నాయని, మహిళల్ని ద్వేషించే వ్యక్తి మస్క్‌ అంటూ విమర్శలు గుప్పించారు.  

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలని అభ్యర్థులు డొనాల్డ్‌  ట్రంప్‌, కమలా హారిస్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య తొలి డిబేట్‌ జరిగింది. ఆ డిబేట్‌పై టేలర్‌ స్విప్ట్‌ స్పందించారు. త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను హరిస్‌కు మద్దతు పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా పోస్ట్‌లో వెల్లడించారు.  

ఇదీ చదవండి : కేజ్రీవాల్‌కు బెయిల్‌

ఆ పోస్ట్‌పై స్పందించిన ఎలోన్‌ మస్క్‌ స్విప్ట్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై వివియన్‌ జెన్నా విల్సన్‌ మాట్లాడుతూ స్విప్ట్‌పై తన తండ్రి చేసిన కామెంట్లు అత్యంత హేయం. అసహ్యకరంగా ఉంది. ఈ సందర్భంగా నా అభిమానులు ఒకటే చెప్పాలను అనుకుంటున్నారు. మీతో ఎవరైనా ఇలా మాట్లాడతారేమో..మాట్లాడన్వికండి అని సలహా ఇచ్చారు.

నాన్నంటే నచ్చదు
ఎలోన్‌ మస్క్‌ మాజీ భార్య జస్టిన్‌ విల్సన్‌తో 2008లో విడాకులు తీసుకున్నారు. మస్క్‌ - జస్టిన్‌ దంపతులకు జేవియర్‌ అలెగ్జాండర్‌,గ్రిఫ్ఫిన్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. అందులో జేవియర్‌ అలెగ్జాండర్‌ అమ్మాయిగా మారి తన పేరును వివియన్‌ జెన్నా విల్సన్‌గా మార్చుకుంది. తన తండ్రితో కలిసి జీవించకపోవడంతో పాటు ఆకారం లేదా ఇతర ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు జెన్నా గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.

ఎలాన్ మస్క్‎పై సొంత కూతురే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement