రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గూగుల్‌పై విరుచుకుపడ్డారు. గూగుల్ చాలా చెడ్డది, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోంది. షట్‌డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలంటూ గూగుల్‌ను పరోక్షంగా హెచ్చరించారాయన.
ట్రంప్‌పై ఇటీవలె హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత బైడెన్ తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష రేసులోకి వచ్చారు. అయితే అప్పటి నుంచి గూగుల్ ట్రంప్ వ్యతిరేక సమాచారం అందిస్తోందనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ సైతం ఈ విషయంలో ఓ ట్వీట్ కూడా ఇచ్చారు. అయితే..
జులై 13న తనపై హత్యాయత్నం జరిగితే.. దానికి సంబంధించిన ఫోటోలు, ఇతరత్రా సమాచారం గూగుల్‌లో అందుబాటులో లేదని ట్రంప్ ఆరోపించారు. అయితే ట్రంప్ ఆరోపణను తోసిపుచ్చిన గూగుల్.. ఆ హత్యాయత్నానికి సంబంధించిన ప్రశ్నలకు ఆటోకంప్లీట్ అంచనాలను అందించడం లేదని వివరణ ఇచ్చింది. రాజకీయ హింసకు సంబంధించిన సమాచారం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ట్రంప్ కోసం గూగుల్ సెర్చ్ చేస్తే.. కమలా హారిస్‌కు సంబంధించిన వార్తలు వస్తున్నాయని కూడా కొందరు చెబుతున్నారు. ఇది రాజకీయ స్పెక్ట్రమ్‌లో విస్తరించిన సమస్య కావొచ్చని, కొన్ని వార్తలు స్వయంచాలకంగా రూపొందించబడి, కాలక్రమేణా మారుతూ ఉంటాయని గూగుల్ తెలిపింది. మొత్తంమీద, ఈ రకమైన ప్రిడిక్షన్, లేబులింగ్ సిస్టమ్‌లు అల్గారిథమిక్ అని గూగుల్ పేర్కొంది.
మా సిస్టమ్‌లు బాగా పనిచేస్తున్నప్పుడు కొన్ని సార్లు ఊహించని సమస్యలు తలెత్తవచ్చు. సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కారాయించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని గూగుల్ పేర్కొంది. సమస్య పరిష్కారమైన తరువాత మీకు సెర్చ్ చేసే సమాసం సులభంగా కనిపిస్తుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment