
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయులకు హెచ్ 1 బీ వీసాలు అంత ఎక్కువగా దక్కకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్ని ఆంక్షలు విధిస్తున్నప్పటికీ గూగుల్, ఫేస్‌బుక్ దిగ్గజ సంస్థల్లో పని చేస్తోన్న భారతీయ టెక్ జనులు మాత్రం ఆ వీసాలను తన్నుకు పోతున్నారు. ఈ రెండు సంస్థలు భారతీయులకు వేతనాలు కూడా ఎక్కువగానే ఇస్తున్నాయి. అంటే ఏడాదికి రెండు మిలియన్ డాలర్లు (దాదాపు 15 కోట్ల రూపాయలు). ఫేస్‌బుక్, గూగుల్ సంస్థల్లో పని చేస్తోన్న భారతీయుల్లో 15 శాతానికిపైగా హెచ్ వన్ బీ వీసాలు కలిగిన వారే.
ఈ రెండు దిగ్గజ సంస్థలు హెచ్ వన్ బీ వీసాలకు చేస్తున్న దరఖాస్తుల్లో 99 శాతం ఆమోద ముద్ర పొందుతున్నాయి. టెక్ నిపుణులైన భారతీయుల సేవలు తమకు అవసరమని, అందుకనే వారికి మంచి వేతనాలు కూడా చెల్లించాల్సి వస్తోందని ఈ సంస్థల యాజమాన్య వర్గాలు తెలియజేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment