
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా నలబైమూడు దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్1బీ వీసా ఉద్యోగుల్ని అప్రమత్తం చేశాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలకు భయపడి దేశాన్ని విడిచి వెళతారేమో.. ఆ పనిచేయొద్దని సూచిస్తున్నాయి. అమెరికా వీడే హెచ్1బీ వీసా దారులు భవిష్యత్‌లో తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుందో,రాదోనన్న అనుమానాల్ని వ్యక్తమవుతున్న తరుణంలో ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి.
వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. అమెరికాలో దిగ్గజ టెక్ కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఐటీ కంపెనీలు తమ హెచ్1బీ వీసా ఉద్యోగుల్ని అలెర్ట్ చేశాయి. దేశాన్ని విడిచి వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించాయి. అమెరికా వదలిసే వారి సొంత దేశాలకు వెళితే.. అలాంటి వారిని అమెరికా ఆహ్వానించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ హైలెట్ చేసింది.
అయితే, హెచ్1బీ వీసాల విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు జన్మత: పౌరసత్వాన్ని రద్దు అమలైతే.. వారి పిల్లలకు ఏ దేశంలోనూ పౌరసత్వం లేకుండా పోయే అవకాశం ఉండదనే ఆందోళన చెందుతున్నారు. అమెరికా పౌరసత్వం లేకపోతే అమెరికాలో అక్రమంగా ఉన్నట్లే కదా అని మాట్లాడుతున్నారు.
అమెరికా ప్రభుత్వం హెచ్1బీ ప్రోగ్రామ్ కింద ప్రతి ఏడాది లాటరీ సిస్టం ద్వారా 65,000 వీసాలను విదేశీయులకు అందిస్తుంది. ఈ వీసా ఉన్న ఉద్యోగులు అమెరికాలో ఉన్నత ఉద్యోగులు, ఆ దేశం ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు దోహదం చేస్తుంటారు. ఈ వీసా ఎక్కువ మంది భారతీయులకు ఇవ్వగా ఆ తర్వాతి స్థానాల్లో చైనా, కెనడా పౌరులకు అందిస్తుంది. హెచ్1బీ వీసా దారుల్ని అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ యాపిల్ కంపెనీలు నియమించుకోవడంలో ముందంజలో ఉన్నాయి. ట్రంప్ కఠినమైన వీసా నియమాల్ని అమలు చేయడం వల్లే ఏర్పడిన అనిశ్చితితో హెచ్1బీ వీసా దారులు మరిన్ని కష్టాల్ని ఎదుర్కోనున్నట్లు నివేదకలు తెలిపాయి.