
దేశీ ఫౌండేషన్ మోడల్స్‌కు మద్దతుగా ఉంటాం
గూగుల్ గ్లోబల్ హెడ్ భాటియా వెల్లడి
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) అభివృద్ధికి భారత్‌లో అనువైన పరిస్థితులు ఉన్నాయని టెక్ దిగ్గజం గూగుల్ గ్లోబల్ హెడ్ (గవర్నమెంట్ అఫైర్స్, పబ్లిక్ పాలసీ) కరణ్ భాటియా తెలిపారు. దేశీయంగా ఫౌండేషన్ మోడల్స్‌ను రూపొందించుకోవాలన్న భారత్ ఆకాంక్షలను సాకారం చేసేందుకు గూగుల్ తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు.
ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సర్వే ప్రకారం ఎకానమీపై ఏఐ సానుకూల ప్రభావాలు అంతర్జాతీయ సగటుతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువగా ఉంటాయని వెల్లడైనట్లు భాటియా చెప్పారు. దేశీయంగా పలు భాషలు ఉన్నందున స్థానిక పరిస్థితులకు అనుగుణమైన సాధనాలను రూపొందించడం కోసం దేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. వీటి రూపకల్పనలో గూగుల్ కూడా ముఖ్యపాత్ర పోషించగలదని వివరించారు.ఇప్పటికే ఐఐఎస్‌సీతో కలిసి ’ప్రాజెక్ట్ వాణి’పై పని చేస్తున్నామని, గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను ప్రవేశపెట్టామని భాటియా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment