తానొస్‌కి వాయిస్‌ ఇవ్వడం ఓ థ్రిల్‌ | Watch Rana Daggubati play Thanos for Telugu Avengers Infinity War | Sakshi
Sakshi News home page

తానొస్‌కి వాయిస్‌ ఇవ్వడం ఓ థ్రిల్‌

Published Sat, Apr 14 2018 1:19 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

Watch Rana Daggubati play Thanos for Telugu Avengers Infinity War - Sakshi

రానా

‘‘మార్వెల్‌ కామిక్స్‌ చదువుతూ పెరిగాను. సూపర్‌ హీరోల కథలను ఆకట్టుకునేలా, వివిధ భాగాలుగా చెప్పడం మార్వెల్‌ సినిమాల గొప్పతనం. ‘ఎవెంజర్స్‌– ఇన్ఫినిటీ వార్‌’లో సూపర్‌ విలన్‌ తానొస్‌కు డబ్బింగ్‌ చెప్పడం థ్రిల్లింగ్‌గా ఉంది’’ అన్నారు రానా. మార్వెల్‌ స్టూడియోస్‌ నుంచి వస్తున్న హాలీవుడ్‌ చిత్రం ‘ఎవెంజర్స్‌ – ఇన్ఫినిటీ వార్‌’. ఈ సినిమా ఈ నెల 27న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 2డీ, 3డీ, ఐమాక్స్‌ 3డీలో విడుదల కానుంది.

డిస్నీ ఇండియా ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది. ‘ఎవెంజర్స్‌ – ఇన్ఫినిటీ వార్‌’లో మార్వెల్‌ సినిమాల్లోని సూపర్‌ హీరోలు అందరూ కలిసి ప్రపంచ వినాశనానికి పూనుకున్న సూపర్‌ విలన్‌ తానోస్‌తో తలపడనున్నారట. రానా మాట్లాడుతూ– ‘‘పాత్రల్ని సృష్టించి ప్రపంచవ్యాప్త ప్రేక్షకులతో కనెక్టయ్యేలా చేయడంలో మార్వెల్‌ది తిరుగులేని స్థాయి. ఐరన్‌ మ్యాన్, కెప్టెన్‌ అమెరికా నా ఫేవరెట్‌ క్యారెక్టర్స్‌. ఎవెంజర్స్‌లాంటి సూపర్‌ హీరోలను ముప్పుతిప్పలు పెట్టే సూపర్‌ విలన్‌ తానొస్‌ పాత్రకు వాయిస్‌ ఇవ్వడం గుడ్‌ ఎక్స్‌పీరియన్స్‌’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement