
చాలామంది ఇప్పుడు ఒకే ఆదాయవనరుపై ఆధారపడకుండా సైడ్ బిజినెస్‌లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రానా (Rana Daggubati) దంపతులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఫుడ్ స్టోర్స్ అనే షాప్‌ను జనవరిలో ప్రారంభించారు. ఇక్కడ కిరాణా సరుకులతో పాటు కూరగాయలు, పండ్లు, మాంసం, దుస్తులు, షూలు, బ్యాగ్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఇలా అన్నీ దొరుకుతాయి. అయితే అన్నీ ప్రీమియం సరుకులే ఉంటాయి. బయట ఎక్కడా దొరకని అంతర్జాతీయ ఐటంస్ ఈ చోట లభించడం విశేషం.
ఖరీదైన కూరగాయలు
ఈ ఫుడ్ స్టోరీస్‌లో స్మూతీస్, జ్యూస్, కాఫీ, చాక్లెట్స్, నూడుల్స్.. ఇలా ఎన్నో ఉన్నాయి. క్రికెటర్ విరాట్ కోహ్లి వంటి ప్రముఖులు ఉపయోగించే వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. విదేశాల్లో మాత్రమే దొరికే ప్రత్యేక చీజ్‌లు, డ్రై ఫ్రూట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఆరు కిలోల మష్రూమ్ ఈ ఫుడ్ స్టోరీస్‌లో ఉంది. దీని విలువ ఏకంగా రూ.5 లక్షలు. మామూలు పుట్టగొడుగులు 100 గ్రాముల ధర రూ.175 నుంచి వెయ్యి రూపాయలపైనే ఉంది.
కొబ్బరి బోండా వెయ్యి రూపాయలు
కూరగాయల్ని సైతం విదేశాలనుంచి తీసుకొస్తారు. మెక్సికో, స్పెయిన్, నెదర్లాండ్స్.. ఇలా ఎన్నో దేశాల నుంచి దిగుమతి చేస్తారు. ఉదాహరణకు నెదర్లాండ్స్ నుంచి తీసుకొచ్చిన టమాట ధర 200 గ్రాములకుగానూ రూ.850గా నిర్ణయించారు. ఒక గ్లాస్ చెరకు రసం రూ.275గా ఉంది. థాయ్‌లాండ్‌కు చెందిన కొబ్బరి బోండాం ఒక్కోటి వెయ్యి రూపాయలని తెలుస్తోంది. ఈ ధరలు చూసిన నెటిజన్లు.. రానా- మిహికా పెట్టిన షాప్ కేవలం ధనవంతులకేనని, సామాన్యులు ఇక్కడ ఏదీ కొనే పరిస్థితి లేదని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment