అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌ కాపీ కొట్టారా? | Avengers Infinity War Lifted Lot from Harry Potter | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 29 2018 9:42 AM | Last Updated on Sun, Apr 29 2018 9:42 AM

Avengers Infinity War Lifted Lot from Harry Potter - Sakshi

ఇన్ఫినిటీ వార్‌ చిత్రంలో ఓ సన్నివేశం

సాక్షి, వెబ్‌డెస్క్‌: మార్వెల్‌ స్టూడియోస్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విలన్ థానోస్ నుంచి కాపాడేందుకు సూపర్ హీరోలు చేసే సాహసాలు, ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు... భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌, మ్యూజిక్‌ ఇలా అన్ని విభాగాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే ఈ సినిమాపై ఇప్పుడు కాపీ చేశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. హ్యారీ పాటర్ సిరీస్‌లోని సన్నివేశాలను ఎత్తేసి ఇన్ఫినిటీ వార్‌ను రూపొందించారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా ఇన్ఫిలోని చాలా మట్టుకు సన్నివేశాలను.. హ్యారీ పాటర్‌ అండ్‌ ది డెత్లీ హాలోస్‌లోని సీన్లతో పోలుస్తూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. హ్యారీ పాటర్‌ సిరీస్‌ల్లోని ది సెంట్రల్‌ క్వెస్ట్‌.. వోల్దెమార్ట్‌ చనిపోయే సన్నివేశం.. డీమెంటర్స్‌-రెడ్‌స్కల్‌ మధ్య పోలికలు..  మ్యాడ్ఊ మూడీ కన్నును థోర్‌ కంటితో పోలుస్తూ కాపీ కొట్టారంటూ వాదిస్తున్నారు. మరికొందరు జేకే రౌలింగ్‌(హ్యారీ పాటర్‌ రచయిత్రి) నుంచి రాయల్టీ తీసుకోవాల్సిందేనంటూ చమక్కులు పేలుస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే విదేశీ మార్కెట్‌తోపాటు భారత్‌లోనూ అవెంజర్స్‌ ప్రభంజనం కొనసాగుతోంది. తొలిరోజు రూ. 30 కోట్లు(2000 వేల స్క్రీన్లలో మాత్రమే విడుదలైంది) వసూలు చేసిన ఈ చిత్రం.. వీకెండ్‌లో భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది. 

ఇన్ఫినిటీ స్టోన్స్‌ సాయంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకునే విలన్ థానోస్.. అతని నుంచి ప్రపంచాన్ని కాపాడానికి సూపర్ హీరోలు.. వాళ్లు చేసే పోరాటాల నేపథ్యంతో అవెంజర్స్ ఇన్ఫినిటీ చిత్రం రూపొందింది. ఆంథోని రుస్సో, జోయ్‌ రుస్సో  ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాబర్ట్ డౌనీ జూనియర్(ఐరన్‌ మ్యాన్‌), క్రిస్ ప్రాట్, క్రిస్ హెమ్స్ వర్త్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, స్కార్లెట్ జాన్సన్ తదితరులు నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement