Bloomsbury US CEO Adrienne Vaughan: హ్యారీ పోటర్ బ్లూమ్స్‌బరీ అమెరికా పబ్లిషింగ్ హౌస్ సీఈవో అడ్రియన్ వాఘన్ (45) దుర్మరణం విషాదాన్ని నింపింది. ఇటలీలోని అమాల్ఫీ తీరంలో జరిగిన ఘోర బోటింగ్ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై బ్లూమ్స్‌బరీ అమెరికా తీవ్ర విచారాన్ని ప్రకటించింది. అడ్రియన్ అకాల మరణం తమకు తీరని లోటని వ్యాఖానించింది. ఆమె నేతృత్వంలోనే అమెరికా తమకు అతిపెద్ద మార్కెట్‌గా ఎదిగిందని తెలిపింది.
సీఎన్‌ఎన్ ప్రకారం తన భర్త,ఇద్దరు పిల్లలతో విహార యాత్రంలోఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. అద్దెకు తీసుకున్న స్పీడ్‌బోట్‌లో ప్రయాణిస్తుండగా, 80 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న పెద్ద సెయిలింగ్ బోట్‌ను ఢీకొట్టింది. దీంతో వాఘన్ నీటిలో పడిపోవడంతో, తీవ్ర గాయాల పాలయ్యారు. అత్యవసర సిబ్బంది వచ్చి ఆమెను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే మరణించినట్లు ప్రకటించారు.వాఘన్ భర్త మైక్ వైట్‌కు స్వల్పగాయాలయ్యాయి.వారి ఇద్దరు పిల్లలు లియన్నా (14) మేసన్(11) కు ఎలాంటి గాయాలు కానప్పటికీ, తల్లి మరణంవారిని తీవ్రంగా కలిచి వేసింది.
మరోవైపు బోట్ స్కిప్పర్ ఎలియో పెర్సికోపై వాఘన్ భర్త తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మద్యం సేవించడంతోపాటు, స్మార్ట్‌ఫోన్ వాడుతూనే ఉన్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సలెర్నోలోని ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు ప్రారంభించారు. అటు అనుమానితుడుమద్యం సేవించి, కొకైన్ వాడినట్లు టాక్సికాలజీ పరీక్షలు నిర్ధారించాయి.
కాగా 2021లో బ్లూమ్స్‌బరీ అమెరికాకు హెడ్‌గా నిమిమితులైన వాఘన్ 2020లో అమెరికాలో హ్యారీ పాటర్ పుస్తకాలను ప్రచురించే సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీవోవోగా చేరారు. ఫైనాన్స్‌లో ఎంబీఏతోపాటు NYU స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో గ్రాడ్యుయేట్ అయిన వాఘన్ గతంలో డిస్నీ పబ్లిషింగ్ గ్రూప్, ఆక్స్‌ఫర్డ్ ఫ్రీ ప్రెస్‌కి ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. వాఘన్ నెట్‌వర్త్ దాదాపు 1 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment