Boating
-
సాహసకృత్యాలకు చిరునామా మయూరి ఎకో పార్క్
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ‘మయూరి హరితవనం’ (ఎకో అర్బన్ పార్క్) ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ పార్క్ వనవిహార కేంద్రంగా రూపుదిద్దుకుంది. జిల్లా కేంద్రం అప్పన్నపల్లి శివారులోని ఈ ఎకో అర్బన్ పార్క్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఈ నేచర్పార్క్ అర్బన్ లంగ్స్ స్పేస్ పర్యాటక కేంద్రంగా మారుతోంది. 2,087 ఎకరాల్లో మయూరి పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకుల ఆహ్లాదం కోసం అన్ని రకాల వసతులు ఉండడంతో ఎకో పార్క్‌కు సందర్శకుల తాకిడి అధికమైంది. ఎకో అర్బన్ పార్కులో సౌకర్యాలు పార్క్‌లో చిల్డ్రన్స్ పార్క్, బటర్‌ఫ్లై గార్డెన్, కరెన్సీ పార్క్, రోజ్ గార్డెన్, రాశీవనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం, హెర్బల్ గార్డెన్లు పర్యాటకులకు అమితంగా ఆకర్షిస్తున్నాయి. పార్క్‌లో మాకావ్ ఎన్‌క్లోజర్, స్వాన్ పాండ్, హిల్‌వ్యూ పాయింట్, ప్రత్యేకంగా జంగిల్ సఫారీ, ఫ్లాగ్ పాయింట్, ఆస్ట్రిచ్ బర్డ్ ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. ఆకట్టుకుంటున్న అడ్వెంచర్ గేమ్‌లు పార్క్‌లో పెద్దల కోసం ఏర్పాటు చేసిన జిప్‌లైన్, జిప్సైకిల్, చిన్నారులకు జిప్సైకిల్, జిప్‌లైన్ తదితర అడ్వెంచర్ గేమ్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్దల జిప్ సైకిల్ రూ.150, జిప్‌లైన్ రూ.70, చిన్నారుల జిప్సైకిల్ రూ.30, జిప్‌లైన్ రూ.30గా నిర్ణయించారు. జిప్సైకిల్ రానుపోను 600 మీటర్లు, జిప్‌లైన్ 200 మీటర్ల వరకు ఉంటుంది. వీకెండ్ రోజుల్లో ముఖ్యంగా చిన్నారులు, యువత జిప్ సైకిల్, జిప్ లైన్‌పై హుషారుగా సందడి చేస్తున్నారు. పార్క్‌లో అడల్ట్, చిల్డ్రన్స్ బోటింగ్‌తోపాటు నేచర్ నైట్ క్యాంపింగ్ సైట్ అందుబాటులో ఉంది.అడవిలో జంగిల్ సఫారీ పార్క్‌లో జంగిల్ సఫారీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పార్క్ నుంచి అడవిలో రానుపోను 14 కిలోమీటర్లు ఈ జంగిల్ సఫారీ ఉంటుంది. పార్క్ నుంచి ప్రారంభమయ్యే ఈ సఫారీ గోల్ బంగ్లా వాచ్ టవర్ వరకు తీసుకెళ్లి తిరిగి పార్క్‌కు చేరుకుంటుంది. సఫారీలో నెమళ్లు, జింకలు, ఇతర జంతువులను తిలకించే అవకాశం ఉంటుంది. రూ.2 వేలు చెల్లించి 8 మంది జంగిల్ సఫారీ చేయవచ్చు. మరిన్ని సాహస క్రీడల ఏర్పాటు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా మయూరి పార్క్‌లో భవిష్యత్‌లో మరిన్ని సాహస క్రీడలను ఏర్పాటు చేస్తాం. రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, ట్రెక్కింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. జంగిల్ సఫారీకి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. – సత్యనారాయణ, డీఎఫ్‌వో, మహబూబ్‌నగర్ -
యానాం: బోటులో మంటలు.. ఒకరు సజీవదహనం
సాక్షి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. యానాంలోని దరియాలతిప్ప వద్ద ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బోటులో చిక్కుకున్న వ్యక్తి సజీవదహనమయ్యారు. వివరాల ప్రకారం.. యానాంలో బోటు ప్రమాదం జరిగింది. దరియాలతిప్ప వద్ద బోటులో నుంచి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బోటులో చిక్కుకున్న గంగాద్రి అనే వ్యక్తి మంటల్లో సజీవదహనమయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక, ప్రమాదానికి గురైన బోటు భైరవపాలెం నుంచి గౌతమి నది నుంచి దరియాలతిప్పకు వచ్చినట్టు గుర్తించారు. -
‘26/11’ తరువాత కూడా నిర్లక్ష్యం వీడని ముంబై పోలీసులు..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2008, నవంబరు 26న జరిగిన ఉగ్ర దాడిని ఎవరూ మరచిపోలేరు. ఈ ఘటన దరిమిలా నగరానికి ఆనుకుని ఉన్న పలు బీచ్‌లలో గట్టి నిఘా ఏర్పాటు చేసేందుకు ముంబై పోలీసులు 46 స్పీడ్ బోట్లను కొనుగోలు చేశారు. అయితే వీటిలో ప్రస్తుతం ఎనిమిది మాత్రమే పనిచేస్తుడటం చూస్తే, ముంబై పోలీసుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతుంది. నాడు ముంబై పోలీసులు కొనుగోలు చేసిన బోట్లలో పసుపు, నీలి రంగులతో కూడిన ఒక బోటు అటు భూమి.. ఇటు సముద్రం.. రెండింటిలోనూ నావిగేట్ చేస్తుంది. ఇది ముంబై పోలీస్ లాంచ్ సెక్షన్‌లోని పేవర్-బ్లాక్ బ్యాక్‌యార్డ్‌లో ఉంది. ఇదే కార్యాలయం ముందు దాదాపు డజను స్పీడ్బోట్లు మురికిపట్టిన టార్పాలిన్ షీట్ కింద ఇనుప స్టాండ్లకు అతుక్కుని కనిపిస్తాయి. మహారాష్ట్రలో 2008లో జరిగిన ఉగ్రదాడుల తర్వాత ముంబై పోలీసులు కొనుగోలు చేసిన 46 బోట్లలో కొన్ని బోట్లు వృథాగా పడివున్నాయి. నగరంలోని 114 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతంపై నిఘా ఉంచడం కోసం ఈ బోట్లు కొనుగోలు చేశారు. వీటిలో ఎనిమిది బోట్లు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయి. 2008, నవంబరు 26న 10 మంది పాకిస్తానీ లష్కరే తోయిబా తీవ్రవాదులు కరాచీ నుండి అరేబియా సముద్రం దాటి పోర్ బందర్ మీదుగా వచ్చి, ఫిషింగ్ ట్రాలర్‌ను హైజాక్ చేసి, బుద్వార్ పార్క్ సమీపం నుంచి ముంబై తీరానికి చేరుకున్నారు. 26/11 తీవ్రవాద దాడులలో 160 మంది మరణించారు. 300 మందికి పైగా జనం గాయపడ్డారు. నాటి రోజుల్లో ముంబై పోలీసులకు సముద్రంలో పెట్రోలింగ్ చేయడానికి కేవలం నాలుగు ఫైబర్ గ్లాస్ బోట్లు మాత్రమే ఉండేవి. ముంబై దాడుల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం హైస్పీడ్ బోట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనను ఆమోదించింది. దాడులు జరిగిన తరువాత మూడేళ్లలో డిపార్ట్మెంట్ మొత్తం 46 బోట్లను కొనుగోలు చేసింది. వీటిలో 23 స్పీడ్ బోట్లు, 19 ఉభయచర బోట్లు, నాలుగు అధునాతన ఉభయచర ‘సీలెగ్’ బోట్లు ఉన్నాయి. పోలీసుల నిఘా కార్యకలాపాలకు ఉపయోగపడే లక్ష్యంతో వీటిని కొనుగోలు చేశారు. ఈ బోట్లు సముద్రంతో పాటు భూభాగంలో అనుమానితులను ట్రాక్ చేయడంలో పోలీసులకు సహాయం అందించనున్నాయి. అయితే ప్రస్తుతం ఈ బోట్లలో ఎనిమిది స్పీడ్ బోట్లు మాత్రమే పని చేస్తున్నాయి. 19 ఉభయచర బోట్లు, నాలుగు ‘సీలెగ్’లు వృథాగా పడివున్నాయి. ఇకనైనా పోలీసులు మేల్కొని వృథాగా ఉన్న ఈ బోట్లను వినియోగంలోకి తెచ్చి, ముంబైకి ఉగ్రవాదుల ముప్పు నుంచి మరింత రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు. ఇది కూడా చదవండి: పైసా కూడా లేకుండా పోటీకి దిగిన అభ్యర్థులు వీరే! -
KTR: సరదా రామన్న.. స్వయంగా బోటు నడుపుతూ షికారు (ఫొటోలు)
-
పశ్చిమ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం
పశ్చిమాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి కేప్ వెర్డే దీవుల్లో పడవ బోల్తా పడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 60 మందికి పైగా మరణించారని,38 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) అధికారులు తెలిపారు. దీనిని అల్ జజీరా వెల్లడించింది. పశ్చిమ ఆఫ్రికా తీరానికి దాదాపు 620 కిలోమీటర్ల (385 మైళ్లు) దూరంలోని ద్వీప దేశమైన కేప్ వెర్డే నుంచి ఒక ఫిషింగ్ బోట్ నెల రోజుల క్రితం సెనెగల్ నుండి బయలుదేరింది. మీడియా తెలిపిన వివరాల ప్రకారం గినియా-బిస్సౌకు చెందిన ఒక పౌరునితో సహా 38 మందిని అర్థరాత్రి వేళ పడవ ప్రమాదం నుండి రక్షించినట్లు సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాల్ ద్వీపానికి 320 కిలోమీటర్ల (200 మైళ్లు) దూరంలో స్పెయిన్ ఫిషింగ్ బోట్ ఈ ఓడను గుర్తించింది. స్పానిష్ మైగ్రేషన్ అడ్వకేసీ గ్రూప్ వాకింగ్ బోర్డర్స్ ఈ ఓడను భారీ ఫిషింగ్ బోట్‌గా పేర్కొంది. ఈ పడవను పిరోగ్ అంటారు. ఇది 100 మంది శరణార్థులు, వలసదారులతో జూలై 10న సెనెగల్ నుండి బయలుదేరింది. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేప్ వెర్డేలో నెలకొన్న పేదరికం, యుద్ధ వాతావరణం కారణంగా వేలాదిమంది ఇక్కడి నుంచి బయటపడేందుకు ఇటువంటి ప్రమాదకరమైన ప్రయాణం చేస్తూ, తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఏమాత్రం రక్షణలేని పడవలు లేదా స్మగ్లర్లు అందించే మోటరైజ్డ్ పడవలలో వీరంతా ప్రయాణిస్తుంటారని అల్ జజీరా తెలిపింది. ఇది కూడా చదవండి: ఒకసారి మంత్రి కుమారుడు, మరోసారి మనుమడు.. మధ్యలో తారలకు లేఖలు.. బ్లఫ్ మాస్టర్ స్టోరీ! -
స్మార్ట్ఫోనే కొంపముంచిందా? పాపులర్ పబ్లిషింగ్ హౌస్ సీఈవో దుర్మరణం
Bloomsbury US CEO Adrienne Vaughan: హ్యారీ పోటర్ బ్లూమ్స్బరీ అమెరికా పబ్లిషింగ్ హౌస్ సీఈవో అడ్రియన్ వాఘన్ (45) దుర్మరణం విషాదాన్ని నింపింది. ఇటలీలోని అమాల్ఫీ తీరంలో జరిగిన ఘోర బోటింగ్ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై బ్లూమ్స్బరీ అమెరికా తీవ్ర విచారాన్ని ప్రకటించింది. అడ్రియన్ అకాల మరణం తమకు తీరని లోటని వ్యాఖానించింది. ఆమె నేతృత్వంలోనే అమెరికా తమకు అతిపెద్ద మార్కెట్‌గా ఎదిగిందని తెలిపింది. సీఎన్ఎన్ ప్రకారం తన భర్త,ఇద్దరు పిల్లలతో విహార యాత్రంలోఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. అద్దెకు తీసుకున్న స్పీడ్‌బోట్‌లో ప్రయాణిస్తుండగా, 80 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న పెద్ద సెయిలింగ్ బోట్‌ను ఢీకొట్టింది. దీంతో వాఘన్ నీటిలో పడిపోవడంతో, తీవ్ర గాయాల పాలయ్యారు. అత్యవసర సిబ్బంది వచ్చి ఆమెను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే మరణించినట్లు ప్రకటించారు.వాఘన్ భర్త మైక్ వైట్‌కు స్వల్పగాయాలయ్యాయి.వారి ఇద్దరు పిల్లలు లియన్నా (14) మేసన్(11) కు ఎలాంటి గాయాలు కానప్పటికీ, తల్లి మరణంవారిని తీవ్రంగా కలిచి వేసింది. మరోవైపు బోట్ స్కిప్పర్ ఎలియో పెర్సికోపై వాఘన్ భర్త తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మద్యం సేవించడంతోపాటు, స్మార్ట్‌ఫోన్ వాడుతూనే ఉన్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సలెర్నోలోని ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు ప్రారంభించారు. అటు అనుమానితుడుమద్యం సేవించి, కొకైన్ వాడినట్లు టాక్సికాలజీ పరీక్షలు నిర్ధారించాయి. కాగా 2021లో బ్లూమ్స్బరీ అమెరికాకు హెడ్‌గా నిమిమితులైన వాఘన్ 2020లో అమెరికాలో హ్యారీ పాటర్ పుస్తకాలను ప్రచురించే సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీవోవోగా చేరారు. ఫైనాన్స్‌లో ఎంబీఏతోపాటు NYU స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో గ్రాడ్యుయేట్ అయిన వాఘన్ గతంలో డిస్నీ పబ్లిషింగ్ గ్రూప్, ఆక్స్ఫర్డ్ ఫ్రీ ప్రెస్‌కి ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. వాఘన్ నెట్‌వర్త్ దాదాపు 1 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. -
సాగరంలో సౌరవిహారం.. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం
మామూలు మరపడవలు నడవాలంటే పెట్రోలు లేదా డీజిల్ కావాల్సిందే! వీటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వల్ల సముద్రాలకు, నదులకు కాలుష్యం తప్పదు. ఈ సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో మారిషస్‌కు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ ‘సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్’ (ఎస్పీఈఎస్) పూర్తిగా సౌరశక్తితో నడిచే పడవను రూపొందించింది. ‘ఫోక్లోరిక్ ఎక్స్‌ప్లోరర్’ పేరుతో తయారు చేసిన ఈ పడవ పైకప్పు మీద 48 సౌరఫలకాలు ఉంటాయి. ఒక్కో ఫలకం నుంచి 110 వాట్ల విద్యుత్తు ఉత్పత్తవుతుంది. సౌరఫలకాల నుంచి వెలువడే విద్యుత్తును ఈ పడవలోని ఆరు లిథియం అయాన్ బ్యాటరీలు నిల్వచేసుకుంటాయి. బ్యాటరీలు పూర్తిగా చార్జ్ అయితే, ఈ పడవ ఏకధాటిగా 25 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ పడవ గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నదులు, సరస్సుల్లో ప్రయాణాలకు ఈ పడవ బాగా అనువుగా ఉంటుంది. -
ఏపీ,తెలంగాణ మధ్య మరో సమస్య!
-
Hyderabad: గాలివాన బీభత్సం.. ట్యాంక్ బండ్లో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, ఖైరతాబాద్‌లో వాన భారీ ఎత్తున కురిసింది. బొమ్మల రామారం, తుర్కపల్లి లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం పడింది. ఎల్బీనగర్, హయత్ నగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈదురు గాలుల కారణంగా సిటీలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం మరింత కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. (దొంగ తెలివి! పని మనిషిగా చేరిన 24 గంటల్లోనే దోపిడీ.. ఎప్పటిలా మళ్లీ సిటీకి) తప్పిన పెను ప్రమాదం ట్యాంక్ బండ్లో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి భాగమతి టూరిస్ట్ బోటు ట్యాంక్ బండ్లో కొట్టుకుపోయింది. ఆ సమయంలో బోటులో 40 మంది పర్యాటకులున్నారు. అయితే, అప్రమత్తమైన సిబ్బంది వారిని కాపాడి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 40 మంది టూరిస్టులతో బుద్ధ విగ్రహం వద్దకు బోటు బయల్దేరింది. బుద్ధ విగ్రహం చేరుకునే సమయంలో భారీగా ఈదురు గాలుల వీచాయి. దీంతో అదుపు తప్పిన బోటు, కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని ముందే గుర్తించి టూరిజం సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్పీడ్ బోట్ల ద్వారా బోట్‌ను బోట్స్ క్లబ్ వద్ద ఒడ్డుకు చేర్చారు. పర్యాటకులంతా సురక్షితంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. నిమ్మకాయంత సైజులో రాళ్లు.. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు కూడా పడటంతో భారీ ఎత్తున పంట నష్టం సంభవించిందని రైతులు వాపోయారు. తొగుట మండలం గుడికందుల, గోవర్ధనగిరిలో నిమ్మకాయంత సైజులో రాళ్లు పడ్డాయని స్థానికులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, బీబీ నగర్ లో ఉరుములు, మెరుపులతో కుడిన భారీ వర్షం కురిసింది. (Telangana: డిగ్రీ చదువుతూనే 10 వేలు సంపాదన.. ఎలా అంటే..!)