పొద్దున లేవగానే గలగలా పారే నీటి సవ్వడి.. వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి హ్యాపీగా పడవలో షికారు.. వీటి కోసం ఎక్కడో టూరిస్ట్ ప్లేస్‌కు వెళ్లాల్సిందేనని అనుకోకండి. నగర స్థిరాస్తి రంగంలోనే తొలిసారిగా ప్రణీత్ గ్రూప్ నివాస సముదాయంలోనే బోటింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. -సాక్షి, సిటీబ్యూరో
గాగిళ్లపూర్‌లో నిర్మిస్తున్న గ్రూవ్ పార్క్ లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీలో బోటింగ్ వసతిని అందుబాటులోకి తీసుకురానుంది. ఈమేరకు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కంపెనీ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. ప్రాజెక్ట్‌కు మధ్యలో చెరువు ఉండటంతో నివాసితులకు వినూత్నంగా బోటింగ్ సేవలను అందించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ రియల్‌ఎస్టేట్‌లో కొత్త మైక్రో మార్కెట్..
70 ఎకరాల్లో 884 ట్రిపులెక్స్ విల్లాలను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 50 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. 167 నుంచి 350 గజాల్లో వేర్వేరు విస్తీర్ణాలలో స్పానిష్ ఆర్కిటెక్చర్ విల్లాలు ఉన్నాయని, ప్రారంభ ధర రూ.1.70 కోట్లుగా నిర్ణయించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment