villas
-
Hyderabad: కొత్త పుంతలు తొక్కుతున్న సిటీ కల్చర్
నగరంలోని గేటెడ్ కమ్యూనిటీలు చిన్నపాటి అందమైన ఊళ్లను తలపిస్తున్నాయి. వీటి నిర్వహణా వ్యవస్థల మధ్య ఏర్పడుతున్న ఆరోగ్యకరమైన పోటీ సిటీలో వేళ్లూనుకున్న గేటెడ్ కల్చర్‌కు కొత్త రంగులు అద్దుతోంది. అయామ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పుకున్నంత గర్వంగా ఐయామ్ బిలాంగ్స్ టు పలానా కమ్యూనిటీ అని చెప్పుకునేలా నిర్వహణ కాంతులీనుతోంది.బండ్లగూడలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేశుడి లడ్డూ వేలంలో రూ.1.26 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. కరోనా టైమ్‌లో కోకాపేట్‌లోని రాజపుష్పా ఆట్రియా రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ డ్రైవ్స్ అద్భుతంగా నిర్వహించి తమ కమ్యూనిటీని కరోనా కేసుల్లో జీరోకి చేర్చారు. వందల సంఖ్యలో కుటుంబాలు నివసించే గేటెడ్ కమ్యూనిటీల్లో ఉట్టిప డుతున్న ఐక్యతకే కాదు నిర్వహణా సామర్థ్యానికి కూడా ఇవి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.సెక్యూరిటీలో హై‘టెక్’.. సీసీ టీవీలు, కెమెరాలు అనేవి ప్రతి కమ్యూనిటీలో ఇప్పుడు సర్వసాధారణం. కాగా బయోమెట్రిక్ ఫేస్ రికగ్నైజేషన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నివాసితుల భద్రతకు భరోసా ఇస్తున్నారు. ఇక అత్యంత సుశిక్షితులైన సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుంటున్నారు. టోల్ గేట్ తరహాలో ప్రతి వాహనానికీ ఒక ఆర్ఎఫ్ఐడీ ఇస్తున్నారు. ఆ ఐడీ ఉన్న వాహనం వస్తేనే గేట్ ఓపెన్ అవుతుంది. ప్రతి గంటకూ ఒకసారి డ్రోన్స్‌తో తనిఖీలు చేసేందుకు త్వరలోనే ఏర్పాట్లు చేయనున్నామని ఓ గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధి చెప్పడం ప్రస్తావనార్హం.నిర్వహణలో నీట్‌గా.. వసతులు కలి్పంచడంలో మాత్రమే కాదు మెయిన్టెనెన్స్ వసూళ్లలో సైతం కమ్యూనిటీలు పోటీపడుతున్నాయి. గత నాలుగేళ్లలో సిబ్బందికి ఏటా పది శాతం జీతాలు పెంచుతూనే, నివాసితులకు మాత్రం నిర్వహణా వ్యయం రూపాయి కూడా పెంచకుండా మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ గేటెడ్ కమ్యూనిటీల నిర్వహణ చరిత్రలో కొత్త రికార్డ్ సృష్టించింది. మరోవైపు కమ్యూనిటీ పరిధిలో నాలుగేళ్లలో 70కి పైగా సీసీటీవీలు ఏర్పాటు చేయడం ద్వారా నివాసితుల భద్రత పటిష్టంగా మార్చారు. నివాసితుల సమస్యల పరిష్కారానికి బ్లాక్స్ వారీగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. బిల్డర్ నిర్ణయించిన మెయిన్టెనెన్స్ ఛార్జీలను కమ్యూనిటీ, ఇతరత్రా ఆదాయ మార్గాలు ద్వారా తగ్గించుకుంటున్నాయి. అభివృద్ధి కోసం సమావేశాలువినాయకచవితి మొదలుకుని దాదాపు అన్ని కుల మతాలకు చెందిన పండుగలనూ ఘనంగా నిర్వహిస్తూనే, వరల్డ్ కప్ విజయం లాంటి అపురూప సందర్భాలకూ అప్పటికప్పుడు స్పందిస్తూ కార్య క్రమాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి నుంచి సంవత్సరారంభం దాకా కాదేదీ సెలబ్రేషన్‌కి అనర్హం అన్నట్టు గేటెట్ కమ్యూనిటీలు సందడి చేస్తున్నాయి. నల్లగండ్లలోని అపర్ణ సైబర్ కమ్యూన్లో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా 5వేల లాంతర్లతో సంబరాలు చేశారు. నానక్‌రామ్‌గూడలోని మై హోమ్ విహంగలో అన్నదానాలు నిర్వహించారు. ఇక డ్రగ్స్, సైబర్ నేరాలు తదితర అంశాల మీద అవగాహన, యోగ, ధ్యానంపై శిక్షణా కార్యక్రమాలు రోజువారీగా జరుగుతున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచిన కరోనా... ఆధునిక వసతుల్లో పోటీపడుతున్న గేటెడ్ కమిటీలన్నీ సంపూర్ణంగా ఆరోగ్యసేవలపై శ్రద్ధ పెట్టేలా చేసిన ఘనత కరోనాదే. మహమ్మారి విజృంభణ సమయంలో ఈ కమిటీలన్నీ బలోపేతం అవడమే కాకుండా వ్యాక్సినేషన్, శానిటైజేషన్ వంటి అంశాల్లో పోటీ.. వంటివి గేటెడ్ కమ్యూనిటీలను శక్తివంతగా మార్చాయి. ఆక్సిజన్ ప్లాంట్లు, అంబులెన్స్‌లూ ఏర్పాటు చేసుకున్నారు. ఒంటరి వృద్ధుల కోసం 14 ఆస్పత్రులతో, డయాగ్నసిస్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని, అలాగే క్లినిక్, ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నామని గ్రీన్ గ్రేస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధి బద్రీనాథ్ చెప్పడం గమనార్హం.ప్రోత్సహిస్తున్నాం.. అవార్డులు ఇస్తున్నాం..మా పరిధిలో అనేక గేటెడ్ కమ్యూనిటీలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నివాసితులకు అనేక రకాల సేవలు అందిస్తున్నాయి. నిర్వహణలో పోటీ తత్వాన్ని మరింత పెంచడానికి వారి సేవల్ని అభినందించడానికి మేం అవార్డులు ఇస్తున్నాం. తాజాగా పచ్చదనం విషయంలో మే ఫెయిర్ విల్లాస్‌కు ఇచ్చాం. ఇందులో ఎకరం స్థలంలో ఫారెస్ట్ పెంచారు. అంతేకాక 800, 900 ఏళ్ల నాటి చెట్లను రీలొకేట్ చేశారు. అదే విధంగా అత్యాధునిక మోషన్ కెమెరాలు వినియోగిస్తున్న ఇని్ఫనిటీ విల్లాస్‌కు బెస్ట్ సెక్యూరిటీ అవార్డు ఇచ్చాం. అలాగే వ్యర్థాల రీసైక్లింగ్‌లో అద్భుత పనితీరు కనబరుస్తున్న ముప్పా ఇంద్రప్రస్థకు బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ గుర్తింపుని అందించాం. – రమణ, అధ్యక్షులు, తెల్లాపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్స్పర్యావరణ హితం.. పురస్కార గ్రహీతలం‘సాధారణంగా గేటెడ్ కమ్యూనిటీలో ఉండే దానికి మించి మా కమ్యూనిటీలో 45 నుంచి 50 శాతం ఎక్కువ పచ్చదనం ఉన్నట్టు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్స్ (ఐజీబీసీ) గుర్తింపుని ఇచి్చంది’ అని చెప్పారు ఖాజాగూడ నుంచి నానక్‌రామ్ గూడ వైపు వెళ్లే దారిలోని చౌరస్తాలో ఉన్న గ్రీన్ గ్రేస్ గేటెడ్ కమ్యూనిటీ కి చెందిన బద్రీనా«థ్. సోలార్ స్ట్రీట్ లైట్స్, సోలార్ వాటర్ హీటర్స్, బాత్రూమ్ సింకులు తదితరాల నుంచి పోయే వేస్ట్ వాటర్‌ని రీసైకిల్ చేసి గార్డెనింగ్, కారిడార్స్, రోడ్ల శుభ్రతకు వినియోగిస్తున్నారు. పర్యావరణ హిత కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి గతంలో తాము కట్టిన రూ.10 లక్షలు నీటి బిల్లులకు డిపాజిట్‌గా మారి గత 45 నెలల నుంచి మాకు నీటి బిల్లు కట్టే అవసరం లేకుండా పోయిందని చెబుతున్నారు. అంతే కాక ఐజీబీసీ గుర్తింపు వల్ల ఆస్తి పన్నులో 20 శాతం రిబేటు కూడా సాధించగలిగామని చెప్పారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్న తొలి గేటెడ్ కమ్యూనిటీ తమదేనని డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆటోమేటిక్ రెస్క్యూ డివైజెస్ వల్ల కరెంట్ పోయినా లిఫ్ట్ మధ్యలో ఆగకుండా మరో ఫ్లోర్ దాకా వెళ్లి ఆగి డోర్ తెరుచుకుంటుంది. ఇలాంటి ఎన్నో పకడ్బందీ ఏర్పాట్ల ద్వారా నివాసితులకు మేలు చేయడంతో పాటు పురస్కారాలెన్నో అందుకున్నాం. – బద్రీనాధ్, గ్రీన్ గ్రేస్ కమ్యూనిటీ -
భళా.. వుడ్ విల్లా
మహేశ్వరం: మ్యాక్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలి కెనడియన్ వుడ్ విల్లాస్‌ను నిర్మించడం అభినందనీయమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం మహేశ్వరం మండలం, తుమ్మలూరు సమీపంలో నిర్మించిన వుడ్ విల్లాస్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులతో ఎంతో ఆకర్షణీయంగా విభిన్న శైలిలో వుడ్ విల్లాలను అందుబాటులోకి తెచ్చారన్నారు. పర్యావరణ హితమైన డిజైన్, సృజనాత్మకత కలిగిన కళా నైపుణ్యాల మిశ్రమం ఈ వుడ్ విల్లాస్ సొంతమన్నారు. కాంక్రీట్, ఉక్కు నిర్మాణాలతో పోలిస్తే వుడ్ విల్లా శ్రేయస్కరమన్నారు. హైదరాబాద్‌లో వుడ్ విల్లా కల్చర్ రావాలని ఆయన ఆకాంక్షించారు. మ్యాక్ ప్రాజెక్ట్ ఎండీ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. వుడ్ అనేది స్థిరమైన, పునరుత్పాదక, ప్రకృతి సిద్ధమైన నిర్మాణ సామగ్రి అన్నారు. మ్యాక్ ప్రాజెక్టులో కెనడియన్ వుడ్‌తో మరిన్ని విల్లాలను నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కెనడా హై కమిషనర్ కామెరాన్ మాకే, ఫారెస్ట్రీ ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్ సీఈఓ మైఖల్ లోసేత్, కెనడియన్ కంట్రీ డైరెక్టర్ ప్రాణేష్ చిబ్బర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మాసిటీతో రియల్ బూమ్: వాటికి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ, ఫ్యాబ్ సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లతో శ్రీశైలం జాతీయ రహదారి రూపురేఖలే మారిపోయాయి. ఫార్మా సిటీ నుంచి కూతవేటు దూరంలో ఉన్న కడ్తాల్, కందుకూరు, ఆమన్‌గల్, తలకొండపల్లి వంటి ప్రాంతాలు రెసిడెన్షియల్ హబ్‌గా మారిపోయాయి. విజయవాడ, బెంగళూరు, వరంగల్ జాతీయ రహదారులతో పోలిస్తే శ్రీశైలం హైవేలోని గృహ అద్దెలకు, స్థలాలకు రెట్టింపు విలువ చేకూరుతుంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న జాతీయ రహదార్లలో ఒక్క శ్రీశైలం రహదారి మినహా అన్ని దార్లలోనూ స్థిరాస్తి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వరంగల్ హైవేలో చూస్తే.. నగరం నుంచి 50 కి.మీ. వరకూ ఎకరం ధర రూ.కోటి పైనే. ముంబై, బెంగళూరు హైవేల్లోనూ కోటిన్నర పైమాటే. ఇక, షామీర్పేట్, శంకర్పల్లి రహదారిలో అయితే రూ.2 కోట్లకెక్కువే. మరి, నేటికీ సామాన్య, మధ్యతరగతి అందుబాటులో ఉన్న ప్రాంతం ఏమైనా ఉందంటే అది ఒక్క శ్రీశైలం రహదారి మాత్రమే. హాట్‌స్పాట్స్ ప్రాంతాలివే.. శ్రీశైలం రహదారిలో కందుకూరు, కడ్తాల్, ఆమన్‌గల్, తలకొండపల్లి, కల్వకుర్తి ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతంలో ధర గజానికి రోడ్ ఫేసింగ్‌ను బట్టి రూ.8 వేల నుంచి 30 వేల వరకున్నాయి. ప్రధా న నగరంలో లేదా ఐటీ కేంద్రాలకు చేరువలో 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కు వెచ్చించే వ్యయంతో శ్రీశైలం రహదారిలో ఏకంగా విల్లానే సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లే అవుట్లు, విల్లాలకు డిమాండ్.. శ్రీశైలం రహదారిలో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లతో పాటూ లే అవుట్ల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. హాల్‌మార్క్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై, విశాల్ ప్రాజెక్ట్స్, రాంకీ, హస్తినా రియల్టీ, మ్యాక్ ప్రాజెక్ట్స్, వెర్టెక్స్, జేఎస్ఆర్ గ్రూప్ వంటి పేరున్న నిర్మాణ సంస్థలతో పాటు చిన్న సంస్థలు కూడా ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నాయి. కందుకూరు నుంచి ఆదిభట్లకు 15 కి.మీ. దూరం. దీంతో ఆదిభట్లలోని ఐటీ, ఏరో స్పేస్ ఉద్యోగులు శ్రీశైలం రహదారిలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. 30 కి.మీ. దూరంలో ఎల్బీనగర్, ఆదిభట్ల ప్రాంతాలుండడంతో విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకూ కొదవేలేదు. కృష్ణా జలాల సరఫరా, విద్యుత్ ఉపకేంద్రంతో మౌలిక వసతులూ మెరుగ్గానే ఉన్నాయి. ఫార్మా సిటీ చుట్టూ అభివృద్ధి.. ఐటీ తర్వాత అధిక శాతం మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించేది ఫార్మా రంగమే. తెలంగాణ ప్రభుత్వం ముచ్చర్లలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఫార్మా సిటీ రాకతో శ్రీశైలం రహదారి అభివృద్ధి దశే మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐడీఏ బొల్లారం, పాశమైలారం తదితర ప్రాంతాల్లోని ఫార్మా పరిశ్రమల వల్ల మియాపూర్, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల వరకూ అభివృద్ధి విస్తరించింది. అలాగే గతంలో బేగంపేట్‌లో విమానాశ్రయం ఉన్నప్పుడు సనత్‌నగర్, బోయిన్పల్లి వంటి ప్రాంతాలకు ఎలాగైతే అభివృద్ధి చెందాయో.. శంషాబాద్ విమానాశ్రయం శ్రీశైలం రహదారికి చేరువలో ఉండటంతో సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశముంది. ఫార్మాసిటీని అనుసంధానిస్తూ రీజినల్ రింగ్ రోడ్డు కూడా రానుంది. ఇది షాద్‌నగర్ నుంచి తలకొండపల్లి మీదుగా ఫార్మాసిటీకి అనుసంధానమై ఉంటుంది. ఇప్పటికే శ్రీశైలం రహదారిలో ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లున్నాయి. -
ఇటు ఢమాల్!
నానక్‌రామ్‌గూడలో ఐదెకరాల్లో ఎత్తయిన ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తున్నాం. 800కు పైగా యూనిట్లు. ధర చదరపు అడుగుకు రూ. 8 వేలు. ప్రాజెక్టుకు పునాదిరాయి పడటం.. నిర్మాణ పనులు శరవేగంగా జరగడంతో ప్రతి నెలా 70–80 యూనిట్లు అమ్ముడుపోయేవి. 111 జీవో ఎత్తివేత ప్రకటనతో అమ్మకాలు తగ్గిపోయాయి. కనీసం రెండంకెల సంఖ్యను కూడా చేరుకోవట్లేదు... ఇదీ ఓ లగ్జరీ ప్రాజెక్టు డెవలపర్ ఆవేదన సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ స్థిరాస్తి రంగంపై జీవో 111 రద్దు ప్రభావం బాగా పడింది. ముఖ్యంగా నగర రియల్టీకి ఆయువు పట్టువైన పశ్చిమ హైదరాబాద్‌పై దీనిప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోని లగ్జరీ గృహాల విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. చదరపు అడుగు రూ.6 వేల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రాజెక్టుల్లో కొనుగోళ్లకు కస్టమర్లు వెనకాడుతున్నారు. ధరలు తగ్గుతాయేమోనని ఆలోచిస్తున్నారు. ఎక్కువ ధరకు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనే బదులు అదే ధరకు 84 గ్రామాల పరిధిలో వ్యక్తిగత గృహాలు, విల్లాలు కొనొచ్చని అనుకుంటున్నారు. దీంతో పశ్చిమ హైదరాబాద్‌లోని హై రైజ్, లగ్జరీ ప్రాజెక్టుల్లో విక్రయాలు పడిపోయాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయమూ బాగా తగ్గింది. పశ్చిమంలో 50 వేల యూనిట్లు ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల వల్ల పశ్చిమ హైదరాబాద్‌లో గృహ కొనుగోళ్లు, లాంచింగ్‌లు ఎక్కువగా ఉంటాయి. నగర రియల్టీలో ఈ ప్రాంతం వాటా 60 శాతం. కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట, గోపన్‌పల్లి, నల్లగండ్ల వంటి ప్రాంతాల్లో సుమారు 10 కోట్ల చద రపు అడుగుల్లో నివాస సముదాయాలు నిర్మాణం లో ఉన్నాయి. వీటిల్లో సుమారు 50 వేల యూనిట్లు ఉంటాయని అంచనా. 111 జీవో పరిధిలో లేకపోవడంతో కొల్లూరు, తెల్లాపూర్, నల్లగండ్ల, గోపన్‌పల్లి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడల్లో భూముల ధరలు ఎక్కువగా ఉండేవి. ఈ ప్రాంతాల్లో గతేడాది జీహెచ్ఎంసీ 83 హై రైజ్ భవనాలకు అనుమతిచ్చింది. ఇందులో 13 ఆకాశహర్మ్యాలు 30 అంతస్తుల కంటే ఎత్తయినవి. అయితే తాజాగా జీవోను ఎత్తేయడంతో అమ్మకాలు నేలచూపులు చూస్తున్నాయి. ప్రీలాంచ్ ఒప్పందాలు రద్దు గతంలో కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లో చాలా వరకు నిర్మాణ సంస్థలు ప్రీలాంచ్లో భారీగా అమ్మకాలు జరిపేవి. తక్కువ ధరకు వస్తుందని కొనుగోలుదారులూ మొగ్గు చూపేవారు. 111 జీవో రద్దుతో వీరంతా ఆయా నిర్మాణ సంస్థల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఒప్పందం రద్దు చేసుకొని కట్టిన డబ్బులు ఇవ్వాలని డెవలపర్లను కోరుతున్నారు. -
250 విల్లాలు.. ఒక్కోటి 2 కోట్లు
సాక్షి, యాదాద్రి: మహోన్నత క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రిలో భక్తులకు వసతి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా టెంపుల్ సిటీలో భారీ వసతి గదుల నిర్మాణానికి వైటీడీఏ (యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ) సన్నాహాలు చేస్తోంది. సీఎం కేసీఆర్ ఈనెల 19న యాదాద్రి పనులను స్వయంగా పరిశీలించిన విషయం తెలిసిందే. తిరుమలకు వచ్చే భక్తులు కుటుంబాలతో మూడు, నాలుగు రోజులు కొండపై ఉంటున్న విధంగా.. యాదాద్రికి వచ్చే భక్తులు కూడా బస చేయడానికి 250 కాటేజీల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆలయం సమీపంలో ఉన్న పెద్దగుట్టపై టెంపుల్‌సిటీని పరిశీలించిన సీఎం కేసీఆర్.. అక్కడ రూపొందించిన లేఅవుట్లలో చేపట్టనున్న వసతి గదుల నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, యాత్రికుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యాదాద్రి కొండకు ఎదురుగా ఉన్న పెద్దగుట్టపై 900 ఎకరాల్లో టెంపుల్ సిటీని నిర్మించనున్నారు. మొదటగా 250 ఎకరాల్లో రూ.207 కోట్లతో లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో 250 ప్లాట్లలో విశాలమైన విల్లాల నిర్మాణం కోసం 40 మందికి పైగా దాతలు ముందుకొచ్చారు. ముందుగా విల్లాల నిర్మాణం భక్తుల వసతి కోసం ముందుగా విల్లాల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతి విల్లాలో నాలుగు సూట్లు ఉంటాయి. టెంపుల్‌సిటీలో నిర్మించే ప్రతి బ్లాక్‌కు దేవతల పేర్లు పెట్టనున్నారు. ప్రస్తుతం 250 ఎకరాల్లో లేఅవుట్ సిద్ధంగా ఉంది. మరో 650 ఎకరాల్లో లేఅవుట్‌ను సిద్ధం చేయబోతున్నారు. వీటితోపాటు ప్రస్తుతం అభివృద్ధి చేసిన టెంపుల్ సిటీలో మంచినీరు, రోడ్లు, విద్యుత్, డ్రెయినేజీ వసతుల కల్పన పూర్తి చేశారు. సుందరీకరణ, గ్రీనరీ పనులు కూడా పూర్తి చేశారు. ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం భక్తులకు కనువిందు చేయనుంది. ఐదు రకాల నిర్మాణాలు : పెద్దగుట్టపై ఐదు రకాల అధునాతన కాటేజీలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఒక్కో విల్లాను రూ.2 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నారు. ‘ఎ’టైప్ నుంచి ‘డి’టైప్ వరకు పూర్తిగా ఏసీ కాటేజీలు నిర్మిస్తున్నారు. నాన్ ఏసీ కేటగిరీలో ‘ఇ’టైప్ కాటేజీలు ఉంటాయి. ముందుగా రూ.2 కోట్ల విరాళం ఇచ్చే దాతల పేరిట ‘ఎ’టైప్ వసతి గృహాన్ని నిర్మించనున్నారు. అలాగే రూ.కోటి విరాళం ఇచ్చే దాతల పేరిట ‘బి’టైప్, రూ.50 లక్షలు ఇచ్చేవారి పేరిట ‘సి’టైప్, రూ.25 లక్షలు విరాళం ఇచ్చేవారి పేరిట ‘డి’టైప్ కాటేజీల నిర్మాణాలు జరగనున్నాయి. విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పెద్దగుట్ట మీద నిర్మించే విల్లాల కోసం విరాళాలు ఇవ్వడానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం 250 విల్లాలు నిర్మించాలని నిర్ణయించాం. ఒక్కో విల్లా విలువను రూ.2 కోట్లుగా నిర్ణయించాం. ఇప్పటికే 40 మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించారు. మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు. దాతలు బ్యాంకుల్లో విరాళాలు చెల్లించవచ్చు. – కిషన్‌రావు, వైటీడీఏ వైస్ చైర్మన్ -
పంథా మారిన భూ విక్రయాలు.. ‘ధరణి’ సమస్యలే కారణం
సాక్షి, మెదక్: గ్రామీణ ప్రాంతాల్లో భూ విక్రయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల కాలంలో పల్లె భూములపై ఔత్సాహికులు ఎక్కువ ఆసక్తి చూపుతుండటంతో భూ క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. దీంతో రియల్ వ్యాపారం ఊపందుకుంది. కరోనా ప్రభావంతో నగరాలు, జిల్లా కేంద్రా ల్లో నివసిస్తున్న మధ్యతరగతి, ఉన్నత వర్గాల జీవన శైలిలో మార్పు తెచ్చింది. స్వచ్ఛమైన పల్లె వాతావరణంలో వారానికొక్క రోజైనా గడపాలన్న ఆకాంక్షను రెట్టింపు చేసింది. ఫైనాన్స్, ఇతర రంగాల్లో కంటే భూములపైనే పెట్టుబడులు పెట్టేలా ఆలోచనా సరళిని మార్చేసింది. ‘ధరణి’ సమస్య కూడా తోడు కావడంతో వెంచర్లు, విల్లాల కొనుగోళ్లకు బ్రేక్ పడింది. నాలుగైదు గుంటలైనా సరే.. ఫాంల్యాండ్పైనే మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం ధరణి వెబ్సైట్ ద్వారా వ్యవసాయ భూములకే రిజిస్ట్రేషన్ అవుతోంది. ఈ క్రమంలో గుంటల భూముల లెక్కన అమ్మడం సులభమని రియల్ వ్యాపారులు భావిస్తున్నారు. మూడు గుంటల భూమికి తగ్గకుండా 363 గజాల స్థలంగా పరిగణించి మార్కెట్లో ఫాంహౌస్‌ల కోసం విక్రయిస్తున్నారు. 60 శాతం భూ విక్రయాలు గతేడాది నవంబర్ 3 నుంచి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఇప్పటి వరకు 1,045 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇందులో 3 నుంచి 10 గుంటల వరకు 60 శాతం మేర భూ విక్రయాలు జరిగాయి. మిగతా 40 శాతం భూములను వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఫాంహౌస్‌ల కోసం కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో మధ్య తరగతి వర్గాలు వీటి నిర్మాణాలకు ఆసక్తి కనబరుస్తున్నారు. లే అవుట్ల ఖర్చు భరించలేకనే.. వ్యవసాయ భూమిని నివాసయోగ్య స్థలంగా మార్చేందుకు అనేక నిబంధనలు అడ్డొస్తున్నాయి. గతంలో టౌన్‌ప్లానింగ్, గ్రామ పంచాయతీల అనుమతితో ఇష్టానుసారంగా విల్లాలు, లేఅవుట్లు, వెంచర్లు చేసి ప్లాట్లుగా విక్రయించేవారు. ఇప్పుడు అలా చేయాలంటే రిజిస్ట్రేషన్ సమస్య ఉత్పన్నమవుతోంది. వ్యవసాయ భూమి ని మొదటగా రెసిడెన్షియల్ స్థలంగా మార్పు చేయాలి. అప్పుడు ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం)కు పన్ను చెల్లించాలి. ఆ తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతి లభిస్తోంది. దీంతో రియల్ వ్యాపారులు ప్లాట్లను ఫాంల్యాండ్‌గా మార్చి విక్రయాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఖర్చు లేకుండానే ఆదాయం వస్తోందని అంటున్నారు. పల్లెల్లో సందడి రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నల్లగొండ, వికారాబాద్, సంగారెడ్డి.. ఇలా అన్ని జిల్లాల్లో వ్యవసాయ భూముల కొనుగోళ్లకు పట్నం వాసులు ముందుకొస్తున్నారు. శని, ఆదివారాల్లో పల్లెలు కార్లతో కళకళలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరమైనా ఎకరం భూమి ధర రూ.25 లక్షలు, తారు రోడ్డును ఆనుకుని ఉంటే ఎకరం ధర రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర పలుకుతోంది. ఫాంహౌస్‌లపైనే మక్కువ చూపుతున్నారు కొత్త వెంచర్ల ఏర్పాటుకు అనుమతులు ఇస్తలేరు. జోన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయకపోవడం.. ధరణిలో కమర్షియల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. మూడు గుంటల నుంచి ఎకరంలోపు భూములను కొనుగోలు చేసి.. ఫాం ల్యాండ్‌గా అభివృద్ధి చేసి విక్రయిస్తున్నాం. ప్రస్తుతం ఎక్కువ మంది వీటిపైనే ఆసక్తి చూపుతున్నారు. – సంతోష్‌రెడ్డి, తూప్రాన్, రియల్ ఎస్టేట్ వ్యాపారి చదవండి: లగ్జరీ గృహాల అద్దెల్లో హైదరాబాద్ టాప్ దశాబ్ద కనిష్టానికి గృహ రుణ రేట్లు -
హైదరాబాద్‌లో పెరుగుతున్న విల్లా కల్చర్
ఊరి బయట ఉండాలి.. అంగట్లో అన్నీ ఉండాలి.. ఇప్పుడు నగరవాసులకు కావల్సిందిదే.. దాని కోసం ఖర్చుకూ వెనుకాడటం లేదు.. ఒక్కో విల్లాను అర ఎకరం, ఎకరం విస్తీర్ణంలోనూ నిర్మిస్తున్నారు. దానికి తగ్గట్లే శివార్లలో విల్లా కల్చర్ కొత్త సొబగులు అద్దుకుంటోంది.. మినీ నగరాల సృష్టికి నాంది పలుకుతోంది.. పుణే, ఢిల్లీ, ముంబై వంటి మెట్రోలకు దీటుగా బెంగళూర్, మేడ్చల్, శ్రీశైలం హైవేల మీద ఈ కల్చర్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: గేటెడ్ కమ్యూనిటీ కల్చర్‌లో భాగంగా.. ఒకే ప్రాంగణంలో పదులు, వందల సంఖ్యలో ఇళ్లు లేదా ఫ్లాట్స్ ఉండటం, నివాసితులకు అవసరమైన విధంగా జిమ్స్, క్లబ్ హౌస్‌లు... వంటివాటిని నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిందే. అయితే, విల్లా కల్చర్ అంతకుమించిన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తూ విలాసాలకు ఆకాశమే హద్దు అన్నట్టుగా విస్తరిస్తోంది. పోష్ పీపుల్ తమ మోడ్రన్ లైఫ్ స్టైల్ సిగ్నేచర్‌గా దీన్ని మార్చుకుంటున్నారు. సుదూరమైనా.. ప్రశాంతంగా.. కాంక్రీట్ జంగిల్‌గా మహానగరం విస్తరిస్తుండటంతో హైదరాబాద్‌కు కనీసం 30 నుంచి 50 కి.మీ. దూరంలో నివసించడానికి కూడా సిటీజనులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. పచ్చని ప్రాంతాల్లో ప్రశాంతమైన పరిసరాలను కోరుకుంటున్నారు. జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, టెన్నిస్, బ్యాడ్మింటన్, గోల్ఫ్, ఇతర స్పోర్ట్స్ప్లేస్లు, ఆహ్లాదాన్నిచ్చే పార్కులు, విందు వినోదాలకు క్లబ్‌హౌస్‌లు వంటి వసతులతో టౌన్‌షిప్స్ పుట్టుకొస్తున్నాయి. పట్టణం సాక్షిగా పల్లె ప్రేమ.. ఇంటి ముందు ఆడుకునే పిల్లలు, పచ్చని చెట్లు, పార్కుల్లో పిచ్చాపాటీ మాట్లాడుకునే పెద్దలు, నీటి కొలనులు, ఆధ్యాత్మికత పంచే ఆలయాలు... ఇలాంటి పల్లె వాతావరణం వైపు నగరవాసులు తిరిగి దృష్టి మళ్లిస్తున్నారు. పట్టణంలో ఉండే ఆధునిక వసతులు, పల్లెల్లోని పరిసరాల ప్రశాం తతను వీరు కోరుకుంటున్నారు. దీంతో విల్లాలు, అత్యాధునిక టౌన్‌షిప్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. లంకంత ఇల్లు.. అడుగడుగునా థ్రిల్లు.. ఒకప్పుడు ఎకరా, అర ఎకరా స్థలంలో ప్లాట్లు వేసి విక్రయించేవారు. ఈ విల్లా కల్చర్ పుణ్యమాని ఇప్పుడు అదే విస్తీర్ణంలో లంకంత ఇల్లు కడుతు న్నారు. నిజానికి వాటిని ఇళ్లు అనడం కన్నా చిన్న పాటి ఊర్లు అనొచ్చేమో... వేలాది చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన మాన్షన్లు, వాటికి నలువైపులా రోడ్లు, స్విమ్మింగ్‌పూల్, సెంట్ర లైజ్డ్ బయోగ్యాస్ సరఫరా, 2 కి.మీ. వాకింగ్ ట్రాక్, స్పా, బ్యూటీ సెలూన్, జిమ్నాసియమ్, టెన్నిస్, స్క్వాష్, బ్యాడ్మింటన్, స్నూకర్, బాస్కెట్ బాల్, పార్టీ లాన్, టీ కార్నర్, బాంక్వెట్స్, హోమ్ థియే టర్, గెస్ట్ రూమ్స్, లాంజ్, ఎలివేటర్ సౌక ర్యం, కనీసం 4 నుంచి 5 కార్లు పట్టేలా పార్కింగ్ప్లేస్ ఇలాంటి ఒక చిన్న అల్ట్రామోడ్రన్ సిటీకి అవ సర మైన సౌకర్యాలన్నీ ఒక విల్లాలోనే ఏర్పాటు చేస్తుండ డంతో ఇవి సిటీలోని రిచ్ పీపుల్ని ఆకర్షిస్తున్నాయి. మోడ్రన్ టౌన్... మెరుపుల క్రౌన్.. ఎంట్రన్స్ ప్లాజా పేరిట దాదాపు 3 నుంచి 5 ఎకరాల దాకా స్థలాలు కేటాయించడం అంటేనే.. ఈ మోడ్రన్ సిటీస్ లుక్ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయవచ్చు. ఇక లోపలకి వెళితే.. కనీసం 60 నుంచి 100 అడుగులలో వెడల్పాటి రోడ్లు, సైక్లింగ్ ట్రాక్స్, రహదారులకు ఇరువైపులా పచ్చని చెట్లు, నలు చెరగులా కొలువైన శిల్పాకృతులు, డ్రిప్ వాటర్ ఇరిగేషన్ సిస్టమ్, నిర్ణీత దూరంలో పార్కులు, నాలుగైదెకరాల స్థలంలో గోల్ఫ్ కోర్టు దాదాపు 75 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్... వంటివాటిని చూస్తే... ఆహా ఇది ఏ విదేశీ నగరమో కదా అన్నంత అనుభూతి కలిగేలా విల్లాసం ఉట్టిపడేలా చేస్తున్నారు. ఇలాంటి మోడ్రన్ విల్లా కమ్యూనిటీస్‌లో ఒక విల్లా స్వంతం చేసుకోవాలన్నా... దాదాపుగా రూ. 20 నుంచి 25 కోట్ల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. అయినప్పటికీ నగరానికి చెందిన పేజ్ త్రీ పీపుల్, సినిమా రంగ ప్రముఖులు, సంపన్న వ్యాపారులు వెనుకాడడం లేదు. కాంక్రీట్ జంగిల్లో కోట్లు ఖర్చు చేసి ఫ్లాట్స్, బిల్డింగులతో పోలిస్తే ఇదే మేలు అనుకుంటూ కొందరు... సిటీ నుంచి వేర్వేరు ఊర్లకు వెళ్లి రిలాక్స్ అయ్యే బదులు ఇదే బెటర్ అంటూ మరికొందరు.. ఖరీదుకు వెనుకాడటంలేదు. వారంలోపే సేల్.. రియల్ బూమ్ కారణంగా గాని, విభిన్న వ్యాపారాల ద్వారా గానీ పెద్ద మొత్తంలో ఆర్థికంగా పెద్ద స్థాయికి చేరినవారు ఈ తరహా విల్లాలవైపు చూస్తున్నారు. ఒకప్పుడు స్టేటస్ కోసం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో కొనుగోలు చేయాలని అనుకునేవారు. అయితే, ఇప్పుడు అక్కడ ఉండేవారు కూడా శివారు ప్రాంతాలవైపే దృష్టి మళ్లించారు. దీంతో కనీసం రూ.20 కోట్లు ఖరీదైన విల్లాలు కూడా కేవలం వారంలోనే వెంచర్ మొత్తం అమ్ముడవుతున్న పరిస్థితులున్నాయి. ఇలాంటి కొన్ని వెంచర్లలో అయితే సదరు కొనుగోలు దారుని స్థితిగతులను ఇంటర్వ్యూ చేసిగానీ విల్లా విక్రయించడం లేదంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. – కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, చైర్మన్, కేఎల్ఆర్ ప్రాపర్టీస్ -
నమ్మించి.. మత్తిచ్చి దోచేశారు..!
రాజేంద్రనగర్: నేపాల్‌కు చెందిన ఓ జంట కోకాపేటలోని ఓ విల్లాలో పని మనుషులుగా చేరింది. వారం రోజులు అయిందో లేదో ఇంటి యజమానులకు ఆహారంలో మత్తుమందు కలిపిచ్చి బంగారు ఆభరణాలతో ఉడాయించింది. దొంగిలించిన సొత్తుతో నేపాల్‌కు పారిపోయే క్రమంలో నార్సింగి పోలీసులకు పట్టుబడింది. వివరాలు.. కోకాపేటలోని ఆరిస్టోస్ పౌలోమీ విల్లా 44లో ఓ వ్యాపారి తన భార్య, కుమార్తెతో కలసి నివసిస్తున్నారు. డిసెంబర్ 27వ తేదీన ఇంట్లో పనిచేసేందుకు ఓ ఏజెన్సీ నుంచి నేపాలీ జంటను కుదుర్చుకున్నారు. జంటలోని మహిళ తనను పవిత్రగా పరిచయం చేసుకుని ఇంటిలోని వారితో కలివిడిగా ఉంటోంది. దీంతో ఆ ఇంటిలోని వారికి తమపై నమ్మకం పెరిగేలా చేసుకుంది.ఆ ఇంట్లో మనుషుల వ్యక్తిత్వంతోపాటు విలువైన వస్తువులు ఎక్కడెక్కడ దాచారో ఈ జంట వారం పాటు గమనించింది. ఇక అన్ని కుదరడంతో 3వ తేదీ రాత్రి మత్తుమందు కలిపిన భోజనాన్ని యజమాని కుటుంబానికి పెట్టారు. వారు మత్తులోకి జారుకున్న అనంతరం బంగారు ఆభరణాలతో పాటు నగదు, వెండి వస్తువులు, విలువైన దుస్తులను 4 బ్యాగుల్లో సర్దుకుని వారిద్దరు ఉడాయించారు. 4వ తేదీ మధ్యాహ్నం గచ్చిబౌలిలో ఉండే ఆ వ్యాపారి మరో కుమార్తె విల్లాలోని కుటుంబసభ్యులకు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. దీంతో ఆమె మధ్యాహ్నం 4.30 గంటల సమయంలో విల్లాకు వచ్చి తలుపులు తీసిలోనికి వెళ్లింది. కుటుంబసభ్యులంతా ఎక్కడి వారు అక్కడే పడిఉండటంతోపాటు కళ్లు తెరవకపోవడంతో అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా ఉండటంతో విల్లా అసోసియేషన్ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో వారు నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మత్తులో ఉన్న ముగ్గురిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం, బీరువా లాకర్ తెరిచి ఉండటంతో ఇదంతా పనిమనుషుల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నేపాలీ జంట ఫొటోలను ఇతర రాష్ట్ర పోలీసులకు చేరవేశారు. వీరిది అంతర్రాష్ట్ర ముఠా అని నిర్ధారించుకున్న పోలీసులు వారి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నేపాల్‌కు పారిపోయే క్రమంలో పట్టుకున్నట్టు తెలిసింది. వీరిపై గతంలో కూడా కేసులు నమోదైనట్లు సమాచారం. -
నగరంలో విల్లామెంట్ గృహాలు
విల్లా+అపార్ట్మెంట్= విల్లామెంట్ 20 ఎకరాల్లో 700 గృహాలు వ్యక్తిగత గృహాలు, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు ఇదీ వరస! ఇప్పుడీ జాబితాలో విల్లామెంట్ చేరింది. విల్లా+అపార్ట్మెంట్ రెండూ కలిపితే విల్లామెంట్. నగరంలో కొత్త తరహా గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్! ప్రాజెక్ట్ విశేషాలు సంస్థ సీఎండీ విజయ్‌సేన్ రెడ్డి మాటల్లోనే.. సాక్షి, హైదరాబాద్: సాధారణంగా వ్యక్తిగత గృహాల్లో స్థలం తక్కువగా వస్తుంది. ఓపెన్ స్పేస్ ఎక్కువ రావటం కోసం కొత్తగా విల్లామెంట్ సంస్కృతికి తెరతీశాం. విల్లాల్లోని స్థలం, అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లు రెండూ కలిపి విల్లామెంట్లో ఉంటాయన్నమాట. షామీర్పేటలోని 27.18 ఎకరాల్లో ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్–2 ప్రాజెక్ట్ ఉంది. ఇందులో 20 ఎకరాల్లో విల్లామెంట్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టాం. ⇔ 20 ఎకరాల్లో మొత్తం 700 విల్లామెంట్లొస్తాయి. 240 గజాల్లో జీ+2 అంతస్తుల్లో నిర్మాణం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2, పై అంతస్తులో 2 ఫ్లాట్లుంటాయి. 4 ఫ్లాట్లు కూడా 835 చ.అ.ల్లో విస్తరించి ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఫ్లాట్ల ధర రూ.18.85 లక్షలు, పై అంతస్తులోని ఫ్లాట్ల ధర రూ.17.85 లక్షలు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని కొనుగోలుదారులకు ముందు స్థలం, పై అంతస్తులోని వారికి టెర్రస్ రిజిస్ట్రేషన్ చేస్తాం. ⇔ వసతుల విషయానికొస్తే.. 45 వేల చ.అ.ల్లో క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్ పూల్, పార్కు, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్స్, యోగా సెంటర్, జిమ్, ఇండోర్, అవుట్ డోర్ ప్లే ఏరియా, టెన్నిస్, బాస్కెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులు, క్రికెట్, ఫుట్ బాల్ మైదానాలు, ప్రాజెక్ట్‌లోనే షాపింగ్ కాంప్లెక్స్, స్కూలు, ఆసుపత్రి కూడా ఉంటాయి. ⇔ ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్–2లో కొంత భాగంలో అందుబాటు గృహాలను కూడా నిర్మిస్తున్నాం. ఇప్పటికే ఆయా గృహాలు అమ్మకాలు 80 శాతం పూర్తయ్యాయి కూడా. 835 చ.అ.ల్లో ఉండే ఒక్కో ఇంటి ధర రూ.23 లక్షలు. ⇔ త్వరలోనే మహేశ్వరంలో వర్జిన్ కౌంటీ ప్రాజెక్ట్‌లో 1,500, కుంట్లూరులో గుల్మోర్ ప్రాజెక్ట్‌లో 150 గృహాలు, ఘట్కేసర్లో విన్సర్పాక్ ప్రాజెక్ట్‌లో 1,200 నిర్మాణాలను ప్రారంభించనున్నాం.