వుడ్ విల్లాస్‌ను ప్రారంభిస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ
మహేశ్వరం: మ్యాక్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలి కెనడియన్ వుడ్ విల్లాస్‌ను నిర్మించడం అభినందనీయమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం మహేశ్వరం మండలం, తుమ్మలూరు సమీపంలో నిర్మించిన వుడ్ విల్లాస్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులతో ఎంతో ఆకర్షణీయంగా విభిన్న శైలిలో వుడ్ విల్లాలను అందుబాటులోకి తెచ్చారన్నారు.
పర్యావరణ హితమైన డిజైన్, సృజనాత్మకత కలిగిన కళా నైపుణ్యాల మిశ్రమం ఈ వుడ్ విల్లాస్ సొంతమన్నారు. కాంక్రీట్, ఉక్కు నిర్మాణాలతో పోలిస్తే వుడ్ విల్లా శ్రేయస్కరమన్నారు. హైదరాబాద్‌లో వుడ్ విల్లా కల్చర్ రావాలని ఆయన ఆకాంక్షించారు. మ్యాక్ ప్రాజెక్ట్ ఎండీ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. వుడ్ అనేది స్థిరమైన, పునరుత్పాదక, ప్రకృతి సిద్ధమైన నిర్మాణ సామగ్రి అన్నారు. మ్యాక్ ప్రాజెక్టులో కెనడియన్ వుడ్‌తో మరిన్ని విల్లాలను నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కెనడా హై కమిషనర్ కామెరాన్ మాకే, ఫారెస్ట్రీ ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్ సీఈఓ మైఖల్ లోసేత్, కెనడియన్ కంట్రీ డైరెక్టర్ ప్రాణేష్ చిబ్బర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment