హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌లో కొత్త మైక్రో మార్కెట్‌ | New Micro Market in Hyderabad Real Estate Bahadurpally Gandimaisamma | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌లో కొత్త మైక్రో మార్కెట్‌.. బహదూర్‌పల్లి, గండిమైసమ్మ

Dec 14 2024 1:02 PM | Updated on Dec 14 2024 1:02 PM

New Micro Market in Hyderabad Real Estate Bahadurpally Gandimaisamma

బోనమెత్తిన భక్తుల కోర్కెలు తీర్చే గ్రామదేవతగా పూజించే గండిమైసమ్మ.. అందుబాటు ధరల్లోనే సామాన్య, మధ్యతరగతి సొంతింటి కలనూ తీరుస్తోంది. అర్ధగంట ప్రయాణ వ్యవధిలోనే ఐటీ కారిడార్‌కు చేరుకునే వీలు, శంషాబాద్‌ విమానాశ్రయంతో పాటు ఇతర జిల్లా కేంద్రాలకు చేరుకునేందుకు ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో కనెక్టివిటీ.. సమీప దూరంలోనే అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద, ఉపాధి కేంద్రాలు.. అన్నింటికీ మించి అందుబాటులోనే గృహాల ధరలు ఉండటంతో బహదూర్‌పల్లి, గండిమైసమ్మ ప్రాంతాలకు డిమాండ్‌ ఏర్పడింది.     –సాక్షి, సిటీబ్యూరో

నీరు ఎత్తు నుంచి పల్లెం వైపు ప్రవహించినట్టే.. అభివృద్ధి కూడా మెరుగైన మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల వైపే విస్తరిస్తుంది. ఇందుకు సరైన ఉదాహరణ బహదూర్‌పల్లి, గండిమైసమ్మ ప్రాంతాలు. ఐటీ కారిడార్‌కు చేరువలో ఉండటంతో మియాపూర్, బాచుపల్లి ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున నివాస, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. ఇప్పుడా డెవలప్‌మెంట్‌ బాచుపల్లికి కొనసాగింపుగా.. బహదూర్‌పల్లి, గండిమైసమ్మ మార్గంలో విస్తరించింది. అన్నింటికీ మించి చౌక ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను గండిమైసమ్మ తీరుస్తోంది.

వెస్ట్, నార్త్‌ జోన్‌లతో కనెక్టివిటీ.. 
మెరుగైన రోడ్లు, రవాణా సదుపాయాలతో వెస్ట్, నార్త్‌ హైదరాబాద్‌ ప్రాంతాలకు సులువుగా చేరుకునే వీలు ఉండటం బహదూర్‌పల్లి, గండిమైసమ్మ ఏరియాల ప్రత్యేకత. ఇక్కడి నుంచి అరగంటలో బాచుపల్లి మార్గంలో ప్రగతినగర్‌ మీదుగా జేఎన్‌టీయూకి, అక్కడి నుంచి హైటెక్‌సిటీకి వెళ్లొచ్చు. ఇప్పటికే మియాపూర్‌–బాచుపల్లి ఆరులైన్ల రహదారి మార్గం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. అలాగే 1.5 కి.మీ. దూరంలోని దుండిగల్‌ ఔటర్‌ ఎగ్జిట్‌–5 ఎక్కితే శంషాబాద్‌ విమానాశ్రయానికి ఈజీగా చేరుకోవచ్చు.

ఉపాధి అవకాశాలు మెండుగానే.. 
ఉపాధిపరంగా ఐటీ కారిడార్‌కు సులువుగా చేరుకోవడంతో పాటు స్థానికంగా పలు ఫార్మా కంపెనీల పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. కండ్లకోయ, బహదూర్‌పల్లి ఐటీ పార్క్‌లు ఉండటంతో ఉపాధి అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. సమీపంలోని గౌడవెల్లిలో 600 ఎకరాల్లో అర్బన్‌ ఫారెస్ట్, దూలపల్లిలో ఫారెస్ట్‌ అకాడమీలు ఉండటంతో చుట్టూ పచ్చదనంతో ప్రశాంత వాతావరణం, కాలుష్య రహిత గృహాలు ఉండటం ఈ ప్రాంతాల ప్రత్యేకత. గండిమైసమ్మ చుట్టు పక్కల పదుల సంఖ్యలో ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, ఇంజినీరింగ్, మెడికల్‌ కాలేజీలున్నాయి. మల్లారెడ్డి, టెక్‌ మహీంద్రా విశ్వవిద్యాలయాలు చుట్టుపక్కలే ఉన్నాయి. వైద్య కళాశాలతో పాటు నారాయణ హృదయాలయ, మల్లారెడ్డి, జీవీకే ఆస్పత్రులు చేరువలోనే ఉన్నాయి.

అందుబాటు ధరల్లోనే ఇళ్లు..
హైదరాబాద్‌ రియల్టీలో కొత్త మైక్రో మార్కెట్‌గా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున గృహ నిర్మాణం జరుగుతోంది. బహదూర్‌పల్లి, గండిమైసమ్మ, బాసుర్‌గడి, గౌడవెల్లి, అయోధ్యక్రాస్‌ రోడ్స్‌ వంటి ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లో నిర్మాణంలో ఉన్నాయి. ప్రైమార్క్, రూబ్రిక్‌ కన్‌స్ట్రక్షన్స్, వాసవి, ప్రణీత్‌ గ్రూప్, అపర్ణా వంటి సంస్థలు పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలల్లో ధర చదరపు అడుగుకు రూ.5,500 వేలుగా చెబుతున్నారు. ప్రాజెక్ట్‌లలోని వసతులు, విస్తీర్ణాలను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.

ఇదీ చదవండి: హైదరాబాద్‌ 2.o.. అభివృద్ధి ఖాయం!

నార్త్‌ వేవ్‌లో సెంచరీ క్రాస్‌.. 
నిర్మాణ రంగంలో దశాబ్ధన్నర కాలం అనుభవంలో ఇప్పటివరకు 18 లక్షల చ.అ.ల్లో 30కు పైగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. తాజాగా బహదూర్‌పల్లిలో 13.5 ఎకరాల్లో నార్త్‌వేవ్‌ గేటెడ్‌ కమ్యూనిటీని నిర్మిస్తున్నాం. 14 బ్లాక్‌లు, ఒక్కోటి 9 అంతస్తుల్లో మొత్తం 1,026 యూనిట్లు ఉంటాయి. నార్త్‌ వేవ్‌ ప్రాజెక్ట్‌ను కిడ్స్‌ సెంట్రిక్‌ జోన్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఇందులో పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా ప్లే ఏరియా, పెట్‌ జోన్, ఔట్‌డోర్‌ ఫిట్‌నెస్‌ స్టేషన్, యోగా, స్విమ్మింగ్‌ పూల్, జిమ్, క్రికెట్‌ పిచ్, బీబీక్యూ పార్టీ లాన్, మినీ గోల్ప్, రాక్‌ క్లయింబింగ్, ప్లే స్కూల్‌.. ఇలా వందకు పైగా ఆధునిక వసతులను కల్పిస్తున్నాం. 
– సాయికృష్ణ బొర్రా, డైరెక్టర్, ప్రైమార్క్‌ డెవలపర్స్‌

మాడ్యులర్‌ కిచెన్‌ ఫ్రీ.. 
గండిమైసమ్మ– మేడ్చల్‌ మార్గంలోని అయోధ్య క్రాస్‌రోడ్స్‌లో 5.2 ఎకరాల్లో శ్రీవెన్‌ త్రిపుర ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 3 టవర్లలో 638 యూనిట్లుంటాయి. న్యూ ఇయర్‌ సందర్భంగా ప్రతి ఫ్లాట్‌కు మాడ్యులర్‌ కిచెన్‌ను ఉచితంగా అందిస్తున్నాం. అలాగే ఈ ఏడాది డిసెంబర్‌ 31లోపు ఫ్లాట్‌ కొనుగోలు చేసేవారికి లోయర్‌ ఫ్లాట్, ఈస్ట్, కార్నర్‌ ఫ్లాట్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. అలాగే 12 నెలల పాటు నిర్వహణ ఉచితం. ఆఫర్లతో కస్టమర్లకు సుమారు రూ.5–6 లక్షలు ఆదా అవుతుంది. 50 వేల చదరపు అడుగుల క్లబ్‌ హౌస్‌లో స్విమ్మింగ్‌ పూల్, జిమ్, టెన్నిస్‌ కోర్ట్, సూపర్‌ మార్కెట్, బాంక్వెట్‌ హాల్‌ వంటి అన్ని రకాల వసతులు ఉంటాయి. 299 యూనిట్లతో కూడిన టవర్‌–1ను దసరా నాటికి కస్టమర్లకు హ్యాండోవర్‌ చేస్తాం. నిర్మాణంలో ఉన్న మిగిలిన రెండు టవర్లను 2027 మార్చి వరకు పూర్తి చేస్తాం. 
– ఎండీ కృష్ణరావు, రూబ్రిక్‌ కన్‌స్ట్రక్షన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement