సాగరంలో సౌరవిహారం.. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం | Eco Friendly Folklore Explorer Boat | Sakshi
Sakshi News home page

సాగరంలో సౌరవిహారం.. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం

Published Sun, May 7 2023 9:08 PM | Last Updated on Sun, May 7 2023 9:12 PM

Eco Friendly Folklore Explorer Boat - Sakshi

మామూలు మరపడవలు నడవాలంటే పెట్రోలు లేదా డీజిల్‌ కావాల్సిందే! వీటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వల్ల సముద్రాలకు, నదులకు కాలుష్యం తప్పదు. ఈ సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో మారిషస్‌కు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ ‘సొసైటీ ఫర్‌ ది ప్రమోషన్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ (ఎస్‌పీఈఎస్‌) పూర్తిగా సౌరశక్తితో నడిచే పడవను రూపొందించింది.

‘ఫోక్‌లోరిక్‌ ఎక్స్‌ప్లోరర్‌’ పేరుతో తయారు చేసిన ఈ పడవ పైకప్పు మీద 48 సౌరఫలకాలు ఉంటాయి. ఒక్కో ఫలకం నుంచి 110 వాట్ల విద్యుత్తు ఉత్పత్తవుతుంది. సౌరఫలకాల నుంచి వెలువడే విద్యుత్తును ఈ పడవలోని ఆరు లిథియం అయాన్‌ బ్యాటరీలు నిల్వచేసుకుంటాయి.

బ్యాటరీలు పూర్తిగా చార్జ్‌ అయితే, ఈ పడవ ఏకధాటిగా 25 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ పడవ గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నదులు, సరస్సుల్లో ప్రయాణాలకు ఈ పడవ బాగా అనువుగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement