Cape Verde Africa Over 60 Feared Dead After Boat Capsizes - Sakshi
Sakshi News home page

కేప్ వర్డె దీవుల్లో పడవ బోల్తా, 60 మంది మృతి

Published Thu, Aug 17 2023 11:27 AM | Last Updated on Thu, Aug 17 2023 2:49 PM

Cape Verde Africa Over 60 Feared Dead After Boat Capsizes - Sakshi

పశ్చిమాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి కేప్ వెర్డే దీవుల్లో పడవ బోల్తా పడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 60 మందికి పైగా మరణించారని,38 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) అధికారులు తెలిపారు. దీనిని అల్ జజీరా వెల్లడించింది. పశ్చిమ ఆఫ్రికా తీరానికి దాదాపు 620 కిలోమీటర్ల (385 మైళ్లు) దూరంలోని ద్వీప దేశమైన కేప్ వెర్డే నుంచి ఒక ఫిషింగ్ బోట్ నెల రోజుల క్రితం సెనెగల్ నుండి బయలుదేరింది.

మీడియా తెలిపిన వివరాల ‍ప్రకారం గినియా-బిస్సౌకు చెందిన ఒక పౌరునితో సహా 38 మందిని అర్థరాత్రి వేళ పడవ ప్రమాదం నుండి రక్షించినట్లు సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాల్ ద్వీపానికి 320 కిలోమీటర్ల (200 మైళ్లు) దూరంలో స్పెయిన్ ఫిషింగ్ బోట్ ఈ ఓడను గుర్తించింది. స్పానిష్ మైగ్రేషన్ అడ్వకేసీ గ్రూప్ వాకింగ్ బోర్డర్స్ ఈ ఓడను భారీ ఫిషింగ్ బోట్‌గా పేర్కొంది. 

ఈ పడవను పిరోగ్ అంటారు. ఇది 100 మంది శరణార్థులు, వలసదారులతో జూలై 10న సెనెగల్ నుండి బయలుదేరింది. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేప్ వెర్డేలో నెలకొన్న పేదరికం, యుద్ధ వాతావరణం కారణంగా  వేలాదిమంది ఇక్కడి నుంచి బయటపడేందుకు ఇటువంటి ప్రమాదకరమైన ప్రయాణం చేస్తూ, తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఏమాత్రం రక్షణలేని పడవలు లేదా స్మగ్లర్లు అందించే మోటరైజ్డ్ పడవలలో వీరంతా ప్రయాణిస్తుంటారని అల్ జజీరా తెలిపింది. 
ఇది కూడా చదవండి: ఒకసారి మంత్రి కుమారుడు, మరోసారి  మనుమడు.. మధ్యలో తారలకు లేఖలు.. బ్లఫ్‌ మాస్టర్‌ స్టోరీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement