
ఆఫ్రికన్ దేశమైన మారిటానియా సమీపంలోని సముద్రంలో పడవ బోల్తా పడి 15 మంది వలసదారులు మృతిచెందారు. ఈ ఘటనలో పలువురు గల్లంతయ్యారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) ఈ సమాచారాన్ని తెలియజేసింది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 300 మంది ఉన్నారు. మారిటానియా రాజధాని నౌవాక్‌చాట్‌కు సముద్రమార్గంలో పడవ చేరుకుంటున్న సమయంలో అది బోల్తా పడింది. ఈ పడవ ఏడు రోజుల పాటు సముద్రంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఈ పడవలో అధికశాతం మంది సెనెగల్, గాంబియన్ ప్రజలు ఉన్నారు.
నౌక్‌చాట్‌లో పడవ బోల్తా పడి 15 మంది వలసదారులు మృతిచెందడం, సముద్రంలో 195 మందికి పైగా జనం గల్లంతుకావడం తమకు చాలా బాధ కలిగించిందని ఐఓఎం ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. ప్రాణాలతో బయటపడిన వారిలో 10 మందిని అత్యవసర వైద్య చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment