
సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాణిపోల్ ప్రాంతంలో ఒక పాల ట్యాంకర్ రోడ్డుపైనున్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 150 మంది గాయపడ్డారు. వీరిలో 30 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన సిక్కింలోని రాణిపూల్‌లోని తాంబ్లా గేమ్ ఫెయిర్‌లో ఆదివారం రాత్రి 7.13 గంటలకు జరిగింది. ఆ సమయంలో రాణిపూర్ టాటా మైదానం జనంతో కిటకిటలాడింది. ఈ సమయంలో హఠాత్తుగా సిక్కిం మిల్క్ యూనియన్ ట్యాంకర్ రోడ్డుపై ఉన్న నాలుగు కార్లను ఢీకొని నేరుగా జనాలపైకి దూసుకొచ్చింది. దీంతో పలువురు ట్యాంకర్ కింద నలిగిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
సుమారు 150 మంది గాయపడ్డారు. సిక్కిం పోలీసులు క్షతగాత్రులను రాణిపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో జనం హాహాకారాలు మిన్నంటాయి.
CCTV footage of Sikkim Milk Union truck accident at Ranipool Mela, Sikkim pic.twitter.com/wStmjBfilp
— Jyoti Mukhia (@jytmkh) February 10, 2024