Harry Potter Actor Paul Grant Passes Away At 56 - Sakshi
Sakshi News home page

Paul Grant: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు హఠాన్మరణం

Published Tue, Mar 21 2023 8:58 AM | Last Updated on Tue, Mar 21 2023 9:28 AM

Harry Potter Actor Paul Grant Passes Away at 56 - Sakshi

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, ‘హ్యారీపోటర్‌’ ఫేం పాల్‌ గ్రాంట్‌(56) కన్నుమూశారు. బ్రిటిష్‌ నటుడైన పాల్‌ గ్రాంట్‌ లండన్‌లోని యాస్టర్‌ రోడ్‌ సెయింట్‌ పాంక్రస్‌ స్టేషన్‌లో ఒక్కసారిగా కుప్పుకూలిపోయాడు. దీంతో స్థానికులు ఆయనను ఆస్పత్రిలో చెర్పించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు స్థానికి మీడియా పేర్కొంది. దీంతో ఆయన మృతిపై పలువురు హాలీవుడ్‌ నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

చదవండి: మోహన్‌ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా?

కాగా పాల్‌ గ్రాంట్‌ 1980ల టైంలో విల్లో, లైబరన్త్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కాలంలో హ్యారీపోటర్, స్టార్ వార్స్ లాంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు భార్య ఉన్నారు. స్పాండిలోపిఫిసిల్ డైస్పాల్షియా కాంజెనిటల్ అనే అరుదైన జెనిటిక్ డిజార్డర్ కారణంగా మరగుజ్జులా ఉండిపోయాడు. ఈ కారణంగా ఇతడికి పలు అనారోగ్య సమస్యల కూడా వచ్చేవి. ఈ పరిస్థితుల్లోనూ డ్రగ్, ఆల్కహాల్ తాగడం వ్యసనంగా మారిపోయిమంది. ఈ క్రమంలో 2014లో కొకైన్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయిపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement