క్రిస్ హెమ్స్‌వర్త్
సూపర్ హీరో అంటే ఏదైనా చేయగలడు. ఆకాశానికి నిచ్చెన వేసేయగలడు. విలన్స్‌ని సింగిల్ పంచ్‌తో మటాష్ చేయగలడు. ప్రపంచాన్ని వినాశనం నుంచి కాపాడగలడు. కానీ ఆఫ్‌స్క్రీన్ ఆ సూపర్ హీరో మాస్క్ తీసేసిన తర్వాత అతను కూడా మనందరిలాంటి సాధారణ మనిషే. ‘అవెంజర్స్’లో థార్ కూడా అందుకు మినహాయింపు కాదు. ‘థార్’ క్యారెక్టర్ ప్లే చేసిన క్రిస్ హెమ్స్‌వర్త్‌కు స్పానిష్ మాట్లాడటం సరిగ్గా రాదట. ఇంట్లో శ్రీమతి మాట్లాడే స్పానిష్ మాటలు సరిగ్గా అర్థం కాకపోయినా ‘ఆహా.. ఓహో..’ అంటూ తలాడిస్తాడట ఈ ఆస్ట్రేలియన్ సూపర్ హీరో.
స్పానిష్ కష్టాలు గురించి క్రిస్ మాట్లాడుతూ ‘‘నేను బయట సూపర్ హీరో కావచ్చు. కానీ ఇంట్లో మాత్రం కాదు. నేనొక్కడినే ఇంట్లో స్పానిష్‌తో ఇబ్బంది పడుతుంటాను. మా వైఫ్, పిల్లలు అందరూ చక్కగా స్పానిష్ మాట్లాడుకుంటుంటారు. కొన్నిసార్లు ఒకటీ అరా వాక్యం స్పానిష్‌లో మాట్లాడేసి ‘యా.. యా..’ మీరు చెప్పింది రైట్ అని శృతిలో కలిపేస్తుంటాను. ఏదైనా గొడవ జరిగేటప్పుడు నా భార్య కోపంగా ఏదోటి అంటుంది. అసలు తనేమందో దానికి తిరిగి నేనేమనాలో అర్థం కాదు. సో ఎక్కువగా గొడవపడటం కూడా మానేశా’’ అని ఆయన పేర్కొన్నారు. అదన్నమాట... సూపర్ హీరో స్పానిష్ కష్టాలు.
Comments
Please login to add a commentAdd a comment